Big Stories

Compensation: రేపటిలోగా రైతుల అకౌంట్లోకి డబ్బులు!

Compensation: పరిహారం చెల్లింపు విషయమై రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ శాఖ అధికారులకు తాజాగా ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. అకాల వర్షాలు, వడగండ్ల వానలతో పంటలు నష్టపోయినటువంటి రైతులకు ప్రకటించిన నష్టపరిహారానికి సంబంధించిన డబ్బులను మంగళవారంలోగా వారి ఖాతాల్లో జమ చేయాలని ఆదేశించినట్లు సమాచారం.

- Advertisement -
Compensation
Compensation

అయితే, గత మార్చి 16 నుంచి 24 వరకు రాష్ట్రంలోని పది జిల్లాల్లో అకాల వర్షాలు, వడగండ్ల వానలు కురిసి రైతులు పంట నష్టపోయారు. మొత్తం 15,814 ఎకరాల వరకు పంటలకు నష్టం వాటిల్లినట్లు వ్యవసాయ శాఖ నివేదించడంతో.. పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ. 10 వేల చొప్పున ఇవ్వాలని, మొత్తం 15,246 మంది రైతులకు పరిహారం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు సంబంధించి మొత్తం రూ. 15.81 కోట్లను విడుదల చేసింది. అయితే, ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో కేంద్ర ఎన్నికల సంఘం నుంచి అనుమతి కోరింది. పరిహారం పంపిణీకి ఈసీ ఓకే చెప్పినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలోనే మంగళవారంలోగా పరిహారం డబ్బులు రైతుల ఖాతాల్లో జమ చేయాలని రాష్ట్రం ప్రభుత్వం ఆదేశించినట్లు తెలుస్తోంది.

- Advertisement -

కాగా, గత మార్చి 16 నుంచి 24 వరకు రాష్ట్రంలో వడగండ్ల వానలు, అకాల వర్షాలు పడడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఎక్కడా చూసినా కూడా రైతులు పంట నష్టపోయి కన్నీరుమున్నీరవుతూ కనిపించారు. ఆరుగాలం కష్టపడితే చేతికొచ్చిన పంట కళ్లముందే నష్టపోవడంతో రైతులు లబోదిబోమని మొత్తుకున్నారు. అకాల వర్షాలు, వడగండ్ల వానల వల్ల తీవ్రంగా నష్టపోయిన తమను ప్రభుత్వం ఆదుకోవాలని పెద్ద ఎత్తున రైతులు ప్రభుత్వాన్ని కోరిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేసిన విషయం విధితమే.

మరో విషయమేమంటే.. రాష్ట్రంలో పార్లమెంటు ఎన్నికల హడావుడీ నెలకొన్న విషయం విధితమే. అయితే, ఈ సందర్భంగా పలుమార్లు రైతుల విషయమై ప్రస్తావిస్తూ రాష్ట్రంలో వ్యవసాయానికి అధిక ప్రాధాన్యాతనిస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. అదేవిధంగా రైతులకు రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి ఓ శుభవార్త కూడా చెప్పారు. ఈ నెల 9 లోగా రైతులకు ఎట్టిపరిస్థితుల్లో రైతుబంధు డబ్బులు వేసి తీరుతామని ప్రకటించారు. ఈనెల 9 తరువాత రైతు బంధు పడని రైతు ఉండబోడని తెలిపారు. అదేవిధంగా ఆగస్టు 15 లోగా రైతు రుణమాఫీ చేసి రైతుల రుణం తీర్చుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్న విషయం కూడా తెలిసిందే.

Also Read: వాళ్లు మళ్లీ కుట్ర పన్నుతున్నారు.. తిప్పికొట్టండి: సీఎం రేవంత్

ఈ విషమై ప్రతిపక్ష ఎమ్మెల్యే హరీశ్ రావుకు కూడా సవాల్ విసిరారు.. తాను ఆగస్టు 15లోగా రుణమాఫీ చేస్తా.. రాజీనామా పత్రంతో సిద్ధంగా ఉండంటూ హరీశ్ రావుకు సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరిన విషయం తెలిసిందే. అదేవిధంగా తమ ప్రభుత్వం రైతుబంధు డబ్బులు ఈ నెల 9 లోగా రైతుల అకౌంట్లోకి వేస్తామని, డబ్బులు వేస్తే నువ్వు ముక్కు నేలకు రాస్తావా? అంటూ కేసీఆర్ కు సవాల్ విసిరారు. ఇటు కేసీఆర్.. అటు హరీశ్ రావు తన సవాళ్లను స్వీకరించి సిద్ధంగా ఉండాలంటూ ఆయన పేర్కొన్న విషయం విధితమే.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News