Heat Stroke: తెలంగాణలో రోజు రోజుకు ఎండ తీవ్రత ఎక్కువగా పెరుగుతుంది. రాష్ట్రం నిప్పుల కుంపటిలా మండిపోతుంది. ఎండలు బయటే కాదు.. ఇంట్లో కూడా వేడెక్కిపోతుంది. ఉక్కపోత, వేడితో జనం సతమతమవుతున్నారు. ప్రజలు ఎండకు బయటకు వెళ్లాలంటే భయపడుతున్నారు. ఈ ఎండకు అత్యవసర పనుల మీద బయటకు వెళ్ళిన ప్రజలు వడదెబ్బకు గురై ఆసుపత్రి పాలవుతున్నారు. ప్రస్తుత ఎండలు ప్రజల జీవన విధానం పై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి.
కనికరించని సూర్యుడు
ప్రస్తుతం తెలంగాణలో వడదెడ్డ తగిలి ఒకే ఒక్క రోజులో 11 మంది మృతి చెందారు. నిర్మల్ జిల్లాలో అత్యధికంగా 45.2 డిగ్రీల ఉష్ణోగత్రతో ఎండ దంచికోడుతుంది. 24 గంటల్లో 11 మంది ప్రాణాలు కోల్పోయారు అంటే ఎంత ఎక్కువగా ఎండకోడుతుందో అర్ధం చేసుకోవచ్చు. ఖమ్మం జిల్లాలో ముగ్గురు, పెద్దపల్లి జిల్లాలో ఒకరు, ఆసిఫాబాద్ జిల్లాలో ఒక్కరు, సూర్యాపేట జిల్లాలో ఒక్కరు, నిర్మల్ జిల్లాలో ఒక్కరు, కరీంనగర్ జిల్లాలో ఒక్కరు, వరంగల్ జిల్లాలో ఒక్కరు, జనగామ జిల్లాలో ఒక్కరు, ములుగు జిల్లాలో ఒక్కరు ఎండ తీవ్రతను తట్టుకోలేక మృత్యువాత చెందారు.
మనుషులు చేస్తున్న తప్పులివే..
పట్టణ ప్రాంతాలలో కాంక్రీట్ భవనాలు, రోడ్లు ఉష్ణాన్ని గ్రహించి వేడిని పెంచుతున్నాయి. అంతేకాకుండా పట్టణాలలో పెద్ద పెద్ద అంతస్తుల, గాలి వచ్చే సందు ఎక్కువగా లేకుండా.. దగ్గర దగ్గరగా ఇల్లులు ఉండడం వల్ల ఇంట్లో ఉన్న కూడా ఎండ వేడి ఎక్కువగానే వస్తుంది. అంతే కాకుండా ప్రస్తుత కాలంలో పర్యావరణం క్షీణించింది. “చెట్లను పెంచడం తగ్గించారు. నరకడం పెంచారు”. దీంతో పర్యావరణం క్షీణించి ఉష్ణోగ్రత పెరుగుదలకు దోహదం చేస్తుంది. అలాగే వాహనాల పెరుగుదల పెరిగింది.. కానీ చెట్లను నాటడం మాత్రం తగ్గించారు. దీనివల్ల రానున్న రోజుల్లో చాలా ఇబ్బందులకు గురవాల్సి ఉంటుంది.
వేసవిలో చూపే ప్రభావాలు..
హీట్ స్ట్రోక్ వల్ల నీరసం, నీటి లోపం వంటి సమస్యలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులలో ఈ సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి. వీరు ఎక్కువగా బయటకు వెళ్లకుండా ఇంట్లోనే ఉండేలా చూసుకోవాలి. అలాగే చాలా మంది ఎండవేడిమికి తట్టుకోలేక కూలర్లు, ఎసీలు, ఫ్యాన్ల వాడకం ఎక్కువగా ఉంటుంది. దీంతో విద్యుత్ డిమాండ్ పెరిగిపోతుంది. ఎండ ఎక్కువగా ఉన్న సమయంలో అప్రమత్తంగా ఉండాలి.
Also Read: అమ్మాయిలకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త.. రేపో మాపో కొత్త పథకం
జాగ్రత్తలు..
ఎండ తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో సరైన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఎండ ఎక్కువగా ఉన్న సమయంలో బయటకు వెళ్లకూడదు.. అత్యవసర సమయంలో మాత్రమే వెళ్లాలి. నీరు ఎక్కువగా తాగాలి లేదంటే.. శరీరం డీహైడ్రేషన్ అవుతుంది. దీంతో అనారోగ్య పాలవుతారు. అలాగే సరైన పోషకాహారం తీసుకోవాలి. మజ్జిగ, కోబ్బరి నీరు, శరీరాన్ని చల్లబరిచే ఆహారాలు తీసుకోవాలి. మసాలా ఆహారం తగ్గించాలి. తేలికైన దుస్తులను ధరించాలి.
ప్రభుత్వ చర్యలు
తెలంగాణ ప్రభుత్వం కొన్ని చర్యలు తీసుకోవాలి. ప్రజలు బయటకు వెళ్లినప్పుడు నీటి సమస్యకు ఇబ్బంది పడుతుంటారు.. కావున అక్కడక్కడ త్రాగు నీటి కేంద్రాలను ఏర్పాటు చేయాలి. అంతేకాకుండా సమాజం మరియు ప్రభుత్వం పర్యావరణ సంరక్షణకు కృషి చేయాలి. చెట్లను నాటడం, నీటిని ఆధా చేయడం వంటి చిన్న చిన్న చర్యలు తీసుకోవడం ద్వారా భవిష్యత్తులో ఈ సమస్యలను తగ్గించవచ్చు..