BigTV English

Diabetic – Salt: డయాబెటిస్ ఉన్నవారు ఉప్పు కూడా తినకూడదా?

Diabetic – Salt: డయాబెటిస్ ఉన్నవారు ఉప్పు కూడా తినకూడదా?

Diabetic – Salt: ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందిని ప్రభావితం చేస్తున్న మోస్ట్ కామన్ హెల్త్ ఇష్యూ డయాబెటిస్. భారతదేశంలో, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో, డయాబెటిస్ రోగుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. డయాబెటిస్ ఉన్నవారు ఆహారంలో జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే ఈ సమస్యతో ఇబ్బంది పడుతున్న వారు కొన్ని రకాల ఆహార పదార్థాలను తరచుగా తీసుకోకూడదని అంటారు. చక్కెర, కొవ్వు పదార్థాలు తగ్గించాలని చాలామందికి తెలిసే ఉంటుంది. కానీ ఉప్పు గురించి చాలా మందికి డౌట్స్ ఉంటాయి. డయాబెటిస్ ఉన్నవారు ఉప్పు పూర్తిగా మానేయాలా? లేదా అనేది ఇప్పుడు తెలుసుకుందాం..


ఉప్పు ఎందుకు ముఖ్యం?
ఉప్పు, అంటే సోడియం క్లోరైడ్, మన శరీరానికి అవసరమైన ఒక ముఖ్యమైన పోషకం. ఇది శరీరంలో వాటర్ లెవెల్స్‌ని కంట్రోల్ చేస్తుంది. అంతేకాకుండా నరాల పనితీరుకు సహాయపడుతుంది. అయితే, అధిక మోతాదులో ఉప్పు తీసుకోవడం వల్ల రక్తపోటు, గుండె జబ్బులు, మూత్రపిండాల సమస్యలు వచ్చే అవకాశం ఉందని డాక్టర్లు చెబుతారు. డయాబెటిస్ రోగులకు ఈ సమస్యలు మరింత ఎక్కువగా ఉంటే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఉప్పు వాడకంలో జాగ్రత్త వహించడం అవసరమని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

ఉప్పు ఎంత తినాలి?
డయాబెటిస్ ఉన్నవారు రోజుకు ఒక టీస్పూన్ కంటే ఎక్కువ తీసుకోకూడదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. డయాబెటిస్‌తో పాటు రక్తపోటు, కిడ్నీల సమస్యలు ఉంటే ఇంకా తక్కువ ఉప్పు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.


డయాబెటిస్ ఉన్నవారు అధిక ఉప్పు తీసుకుంటే, రక్తపోటు పెరిగే ప్రమాదం ఉందట. దీని వల్ల గుండె జబ్బులు, స్ట్రోక్, మూత్రపిండాల వైఫల్యం వంటి సమస్యలు రావచ్చని డాక్టర్లు చెబుతున్నారు. డయాబెటిస్ వల్ల ఇప్పటికే కిడ్నీలపై ఒత్తిడి పడుతుంది. కాబట్టి ఎక్కువ ఉప్పు వాడకం వల్ల ఈ సమస్యలు మరింత పెరిగే అవకాశం ఉంటుంది. అందుకే వీలైనంత వరకు ఉప్పు వాడకాన్ని తగ్గించాలని నిపుణులు చెబుతున్నారు.

చిప్స్, బిస్కెట్లు, రెడీమేడ్ సూప్‌లు, టిన్‌లో ఉండే ఆహారాల్లో ఉప్పు ఎక్కువగా ఉంటుంది. ఇప్పటికే డయాబెటిస్ ఉన్నవారు ఇటువంటి ప్రాసెస్డ్ ఫుడ్స్‌ని తీసుకోవడం తగ్గించాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. వీటికి బదులుగా కూరగాయలు, పండ్లు, ఇంట్లో వండిన ఆహారం తినడం మంచిది.

ఉప్పు స్థానంలో జీలకర్ర, మిరియాలు, అల్లం, లవంగం వంటి సహజ మసాలాలు రుచిని పెంచుతాయి. అవసరమైతే వీటిని తీసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. వంటలో ఉప్పు తక్కువగా వాడాలని చెబుతున్నారు. ముఖ్యంగా డయాబెటిస్ ఉన్న వారు టేబుల్ సాల్ట్‌ను అస్సలు వాడకూడదని నిపుణులు చెబుతున్నారు.

పూర్తిగా ఉప్పు మానేయాలా?
పూర్తిగా ఉప్పు మానేయడం కూడా ఆరోగ్యానికి మంచిది కాదు. శరీరానికి కొంత మోతాదులో సోడియం అవసరం. అందుకే, డయాబెటిస్ రోగులు ఉప్పును పూర్తిగా మానేయకుండా, తగిన మోతాదులో తీసుకోవాలి. డాక్టర్ లేదా డైటీషియన్ సలహా తీసుకోని ఉప్పును మితంగా తీసుకోవడం మంచిది.

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా డాక్టర్ లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు.

Related News

Hair Care Tips: వర్షంలో జుట్టు తడిస్తే..… వెంటనే ఇలా చేయండి?

Paneer Effects: దే…వుడా.. పన్నీరు తింటే ప్రమాదమా?

Hair Growth Tips: ఈ టిప్స్ పాటిస్తే.. వారం రోజుల్లోనే ఒత్తైన జుట్టు !

Gut Health: గట్ హెల్త్ కోసం.. ఎలాంటి ఆహారం తినాలి ?

Cucumber Benefits: దోసకాయ తింటే.. నమ్మలేనన్ని లాభాలు !

Mint Leaves: తులసి ఆకులు నేరుగా తింటే ప్రమాదమా? ఏమవుతుంది?

Big Stories

×