Civil Ranker Story: కష్టపడితే ఏదైనా సాధించవచ్చు అనే దానికి జీవితంలో ఎన్నో బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. లక్ష్యం కోసం అలుపెరగకుండా నిరంతరం శ్రమిస్తే నేడు కాకపోయినా రేపైనా విజయం సొంతమవుతోంది. లక్ష్య సాధనలో ప్రతి రోజు అదే పనిగా ముందుకుళ్లే విజయం దానంతటే అదే వస్తుంది. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ తిరుపతి జిల్లా నారాయణవనం మండలం గోవిందప్పనాయుడు కండ్రిగ గ్రామానికి చెందని పామూరి సురేష్.
టెన్త్‌లో సాధారణ స్టూడెంట్- ఇంటర్ ఫెయిల్
రెండు రోజుల క్రితం విడుదలైన సివిల్స్ – 2024 ఫలితాల్లో సురేష్ 988వ ర్యాంక్ సాధించాడు. టెన్త్ క్లాస్ వరకు బీలో యావరేజ్ స్టూడెంట్ అయిన సురేష్ తనను తాను గొప్పగా తీర్చిదిద్దుకున్నాడు. టెన్త్ క్లాస్ లో మామూలు స్టూడెంట్ అయిన ఇతను ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ లో ఫెయిల్ అయ్యాడు. ఆ తర్వాత మళ్లీ పరీక్షలు రాసి పాసయ్యాడు. అలా కష్టంగా ఇంటర్ పూర్తి చేశాడు. అనంతరం సురేష్ నంద్యాలలో డిప్లొమా చేశాడు. ఆ సమయంలో స్వామి వివేకానంద, అబ్దుల్ కలాం పుస్తకాలు చదవడం మొదలుపెట్టాడు.
గొప్ప స్థాయికి ఎదగాలంటే చదువు ఒక్కటే ఆయుధం..
జీవితంలో గొప్ప స్థాయికి ఎదగాలంటే.. చదువు ఒక్కటే ఆయుధం అని భావించాడు. ఆయన ధ్యాస అంతా సివిల్స్ వైపు మళ్లించుకున్నాడు. సివిల్స్ క్రాక్ చేస్తే జీవితంలో గొప్ప స్థాయికి వెళ్లొచ్చని అనుకున్నాడు. కేవలం చదువుతోనే జీవితం మార్పు తీసుకురావొచ్చని.. యూపీఎస్సీ (యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్) నిర్వహించే సివిల్స్ పాసైతే పేదల కష్టాలు తీర్చవచ్చని గ్రహించాడు. ఇలా డిప్లొమా పూర్తి చేసి ఈసెట్ లో స్టేట్ లెవల్ లో ఏడో ర్యాంక్ సాధించాడు. కర్నూలులో బీటెక్ పూర్తి చేసిన తర్వాత 2011 లో జెన్ కోలో ఏఈ ఉద్యోగం సాధించాడు.
కరోనా మహమ్మారి సోకినా..
అనంతర, ఏఈ ఉద్యోగం చేస్తూ సివిల్స్ ప్రిపేర్ కావడం మొదలు పెట్టాడు. 2017లో సివిల్స్ ఎగ్జామ్స్ రాయగా ప్రిలిమ్స్ లో క్వాలిఫై కాలేదు. మోసారి రెండో ప్రయత్నంలో ఇంటర్వ్యూ వరకు వెళ్లినా తుది జాబితాలో పేరు రాలేదు. 2020 వ సంవత్సరంలో కొవిడ్ టైంలో సివిల్స్ కు ప్రిపేర్ అవుతుండగా కరోనా మహమ్మారి బారిన పడ్డారు. దీంతో వినికిడి సమస్య తలెత్తింది. అదే సమయంలో చైతన్యవంతమైన పనులు చేశాడు. గ్రామ చైతన్య అనే స్వచ్చంద సంస్థను స్థాపించి నల్లమలలో బడి మానేసిన పిల్లలను స్కూల్ లో చేర్పించారు.
రూ.1,50,000 జీతాన్ని మానేసి..
ఇలా ఓవైపు సివిల్స్ కు ప్రిపేర్ అవుతుంటూనే సమాజానికి తన వంతు కృషి చేశాడు. ఐపీఎస్ కావాలన్నది తన ముఖ్య లక్ష్యం. అయితే వినికిడి సమస్య కారణంగా ఐపీఎస్ కు అర్హత సాధించలేని పరిస్థితి నెలకొంది. అప్పుడే ఐఏఎస్ సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. సివిల్స్ సన్నద్ధతకు ఇబ్బందిగా ఉందని 2020లో ఉద్యోగానికి రాజీనామా చేశాడు. ఆ టైంలోనే సురేష్ కు రూ.1,50,000 జీతం వచ్చేది. కొవిడ్ అనంతరం మూడు సార్లు సివిల్స్ రాసినా ప్రిలిమ్స్ కూడా క్వాలిఫై కాలేదు. 2024 లో ఏడో ప్రయత్నంలో సురేష్ 988 వ ర్యాంక్ సాధించి సివిల్స్ క్రాక్ చేశాడు.
ఎంతైనా గ్రేట్ కదా..
సురేష్ జీవిత మలుపులు చూస్తుంటే.. ఆయన స్టోరీ చాలా గ్రేట్ అనిపిస్తుంది కదా.. ప్రస్తుతం సివిల్స్ కు ప్రిపరే అయ్యే అభ్యర్థులకు అతను రోల్ మోడల్ గా నిలిచాడు అని చెప్పవచ్చు.
Also Read: NTPC Recruitment: డిగ్రీ అర్మతతో ఎన్టీపీసీలో ఉద్యోగాలు, ఇంకా 2 రోజులే ఛాన్స్ భయ్యా, జీతం రూ.71,000