OTT Movie : ఎన్నో సినిమాలు ఓటీటీలో స్ట్రీమింగ్ కు వస్తుంటాయి. అయితే కొన్ని సినిమాలు చూడటానికి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా రీసెంట్ గా ఓటీటీలోకి వచ్చింది. ఈ స్టోరీ ఒక లా స్టూడెంట్ చుట్టూ తిరుగుతుంది. అతను కొత్త లైఫ్ స్టైల్ కోసం ఒక గ్రూప్‌లో చేరి నేరాల ప్రపంచంలో చిక్కుకుంటాడు. ఆతరువాత స్టోరీ రసవత్తరంగా ఉంటుంది. ఈ సినిమా పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే …
నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్
‘An Honest Life’ ఒక స్వీడిష్ క్రైమ్ థ్రిల్లర్ కమింగ్-ఆఫ్-ఏజ్ డ్రామా మూవీ. దీనికి మైకెల్ మార్సిమైన్ దర్శకత్వం వహించారు. ఇది జోకిమ్ జాండర్ రాసిన నవల ఆధారంగా రూపొందింది. ఈ సినిమా 2025 జూలై 31న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది. ఇది 2 గంటల 2 నిమిషాల నిడివితో, స్వీడిష్ భాషలో ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్‌తో అందుబాటులో ఉంది. ఈ చిత్రంలో సైమన్ లూఫ్, నోరా రియోస్, పీటర్ ఆండర్సన్, నాథలీ మర్చంట్, విల్లీ రామ్‌నెక్ పెట్రి, ఆర్విడ్ వాన్ హెలాండ్ నటించారు. IMDbలో ఈ సినిమా 5.6/10 రేటింగ్ పొందింది.
స్టోరీలోకి వెళితే
సైమన్ అనే ఒక మిడిల్-క్లాస్ యువకుడు. స్వీడన్‌లోని లండ్ యూనివర్సిటీలో లా స్టడీ చేయడానికి వస్తాడు. రైటర్ కావాలనే కలలతో ఉన్న అతనికి, లా స్కూల్‌లో తనకు నిరాశే ఎదురవుతుంది. ధనవంతులైన అతని సహవిద్యార్థులు, అతని లైఫ్ స్టైల్ ను చూసి అవమానిస్తారు. దీనివల్ల అతనికి సిస్టమ్‌పై విసుగు వస్తుంది. ఒక రోజు అతను మాక్స్ అనే యువతిని కలుస్తాడు. ఆమెతో ప్రేమలో కూడా పడతాడు. మాక్స్ అతన్ని ఒక థ్రిల్లింగ్ లైఫ్ స్టైల్ లోకి లాగుతుంది. అయితే ఇందులో ప్రమాదకరమైన రిస్క్‌లు ఉంటాయి. మాక్స్ ఆమె గ్రూప్ సైమన్‌ను చిన్న నేరాలు చేయడానికి ప్రోత్సహిస్తారు. ఉదాహరణకు : లగ్జరీ వాచ్‌లు దొంగిలించడం వంటివి. ఇవి సైమన్ కి రాబిన్ హుడ్ లాంటి థ్రిల్ ను ఇస్తాయి.
Read Also : డెడ్లీ డెత్ గేమ్… ఒక్కసారి గేమ్ ఆడినందుకు వంశం మొత్తానికి శాపం… రాత్రిపూట సింగిల్ గా చూశారో ఫసక్