Actor Suman: బీసీ సంక్షేమ సంఘం జాతీయ కమిటీ ఆధ్వర్యంలో ఢిల్లీ జంతర్‌మంతర్ వేదికగా బీసీ సంఘాల ధర్నా కొనసాగుతోన్న విషయం తెలిసిందే. ఈ సభలో సినీ నటుడు సుమన్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. బీసీ రిజర్వేషన్లు ఎక్కడ వస్తాయని అందరూ అనుమానాలు వ్యక్తం చేసిన సమయంలో సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు విద్య, ఉద్యోగ, రాజకీయాల్లో 42 శాతం రిజర్వేషన్లు అమలు చేసేలా బిల్లును తీసుకువచ్చి చూపించారని.. ఆయన రియల్ హీరో అని సుమన్ ప్రశంసించారు.
వారికి ఎస్టీ స్టేటస్ ఇవ్వాలి: సుమన్
ఈ రోజు బీసీ సంక్షేమ సంఘం జాతీయ కమిటీ ఆధర్వంలో జంతర్ మంతర్ వద్ద జరుగుతున్న బీసీ మహాధర్నాకు సుమన్ సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మా బీసీలమంతా సీఎం రేవంత్ రెడ్డికి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మద్దతుగా ఉంటామని అన్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో బీసీలు ఉన్నారని.. సీఎం పెద్దమనసు చేసుకుని వారికి ఎస్టీ స్టేటస్ ఇవ్వాలని కోరారు. ఈ డిమాండ్ చాలా ఏళ్ల నుంచి ఉందని.. ఇది నెరవేరిస్తే సీఎం రేవంత్ వారికి దేవుడు అవుతారని చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీ బీసీలకు రిజర్వేషన్లు అమలు చేయాలని ఆయన కోరారు.
ALSO READ: CISF Jobs: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. భారీగా పోలీస్ ఉద్యోగాలు.. ఇంకా 2 రోజులే గడువు..
పార్లమెంట్ లో ఆమోదించి అమలు చేయాలి..
బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచుతూ.. తెలంగాణ శాసన సభ ఆమోదించిన బిల్లును పార్లమెంట్ లోనూ ఆమోదించి అమలు చేయాలని ఢిల్లీలో బీసీ సంఘాలు నిర్వహిస్తున్న మహాధర్నా కొనసాగుతోంది. అలాగే దేశవ్యాప్తంగా కులగణన, 33 శాతం మహిళా రిజర్వేషన్లలో బీసీ మహిళలకు సబ్ కోటా కేటాయించాలని డిమాండ్ వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ ధర్నాకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హాజరై మాట్లాడిన విషయం తెలిసిందే.
మహాధర్నాకు ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ మద్ధతు
బీసీ సంఘాలు నిర్వహిస్తున్న మహాధర్నాకు ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ, ఎంపీలు కనిమొళి, సుప్రియా సూలే తదితరులు సైతం మద్దతు తెలిపారు. మహా ధర్నాలో తెలంగాణ మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్సీ కోదండరామ్, కాంగ్రెస్ నేత వీహెచ్, సినీ నటుడు సుమన్, జాజుల శ్రీనివాస్ గౌడ్ తదితర కీలక వ్యక్తులు ఉన్నారు. బీసీ పోరు గర్జన సభకు రావాలని బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలను బీసీ సంఘాలు ఆహ్వానించినా రెండు పార్టీలు ధర్నాకు దూరంగా ఉన్నాయి.
ALSO READ: CM Revanth Reddy: అసలు మేం 42% రిజర్వేషన్లు ఇస్తే మోదీకి ఏం ప్రాబ్లమ్: సీఎం రేవంత్ రెడ్డి
ALSO READ: RCF Ltd Recruitment: టెన్త్, డిగ్రీ అర్హతలతో ఉద్యోగాలు.. ఈ జాబ్ వస్తే జీతం అక్షరాల రూ.46,300