BigTV English

Women Comes Hospital with Snake: నీ దైర్యానికి సెల్యూట్ తల్లి.. కరిచిన పాముతో డాక్టర్ల దగ్గరకు వెళ్లిన మహిళ

Women Comes Hospital with Snake: నీ దైర్యానికి సెల్యూట్ తల్లి.. కరిచిన పాముతో డాక్టర్ల దగ్గరకు వెళ్లిన మహిళ

Women Comes Hospital with Snake: పాములంటే చాలా మందికి భయం ఉంటుంది. పాము కరిస్తే ప్రాణాలు పోతాయని వణికిపోతుంటారు. అయితే ఓ మహిళకు తాజాగా ఓ పాము కుట్టింది. అయితే పాము కుట్టిన భయంతో హుటాహుటీగా ఆసుపత్రికి పరుగుతు తీయాల్సింది పోయి.. కరిచిన పాము కోసం వెతుకులాట మొదలుపెట్టింది. వెంటనే ఆ పామును పట్టుకుని మరి ఆసుపత్రికి వెళ్లగా.. డాక్టర్లే షాక్ అయ్యారు. ఈ ఘటన ములుగు జిల్లాలో వెలుగుచూసింది.


కూలీ పని చేసుకునే వెంకటాపురం మండలం ముకునూరుపాలెంకు చెందిన శాంత అనే మహిళ యథావిథిగా పనికి వెళ్లింది. ఈ తరుణంలో పని చేస్తుండగా ఓ పాము వచ్చి ఆమెను కాటేసింది. దీంతో వెంటనే ఆమె పక్కన ఉన్న కూలీలకు సమాచారం ఇచ్చింది. దీంతో వారంతా కలిసి ఆ పామును కొట్టి చంపేశారు. అయితే పాము కాటుకు గురైన శాంత హుటాహుటీనా ఆసుపత్రికి బయలుదేరింది. ఈ తరుణంలోనే తనకు అసలు కరిచింది ఏ పాము అనే ఆలోచన తట్టింది. తనను కరిచిన పాము పేరు తనకు తెలియదు. దీంతో డాక్టర్లకు ఏం సమాధానం చెప్పాలో తెలియక కరిచిన పామును కూడా ఆసుపత్రికి తీసుకెళ్లింది.

Also Read: Hooded Pitohui: ఈ పక్షిని తాకితే ప్రాణం పోవడం ఖాయం.. నాగుపాముకన్నా ప్రమాదకరమైనది..!


తనను కరిచిన పాముతో ఆసుపత్రికి వెళ్లిన శాంతను చూసి డాక్టర్లు అవాక్కయ్యారు. పాము కాటులో ఆసుపత్రికి వచ్చే వారిని చూశాం కానీ పాముతో సహా ఆసుపత్రికి రావడం ఏంటని ఆశ్చర్యపోయారు. ఘటనను శాంత వైద్యులకు వివరించిన అనంతరం చికిత్స కోసం ఆసుపత్రిలో అడ్మిట్ చేసుకున్నారు. ఇక వెంటనే ఆమెకు వైద్య సేవలు అందించగా ప్రస్తుతం శాంత ఆరోగ్యం మెరుగైంది. ఇక పాముతో చికిత్సకు వచ్చిన మహిళను చూసి వైద్యులతో సహా పేషెంట్లు కూడా ఆశ్చర్యపోయారు.

Related News

Kavitha: కవిత ఔట్.. బీఆర్ఎస్ సేఫ్.. ప్లాన్ అదుర్స్!

CM Revanth: మూసీ పునరుజ్జీవ పథకంలో కీలక ఘట్టం.. హైదరాబాద్‌కు 20 టీఎంసీల నీరు తరలించాలని నిర్ణయం!

Weather News: మళ్లీ భారీ వర్షాలు.. ఈ జిల్లాల్లో కుండపోత వాన, పిడుగులు పడే ఛాన్స్

KTR: కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు.. కవితను అందుకోసమే సస్పెండ్ చేశాం..

Dussehra holidays: తెలంగాణలో దసరా సెలవు.. విద్యార్థులు ఫుల్ ఎంజాయ్, టూర్ ప్లానింగ్

T Fiber Net: తెలంగాణలో టీ-ఫైబర్‌.. దసరాకు మిస్సయితే, కార్తీకమాసం ఖాయం?

Big Stories

×