Big Stories

Disco Shanti Exclusive Interview: బావ చనిపోయాకా.. రెండేళ్లు మద్యానికి బానిసయ్యా.. శ్రీహరి భార్య డిస్కో శాంతి ఎమోషనల్

Disco Shanti Exclusive Interview: శ్రీహరి.. ఈ పేరు తెలియని తెలుగు ప్రేక్షకుడు ఉండడు. విలన్ గా కెరీర్ ను ప్రారంభించి తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకొని.. ఆ తరువాత హీరోగా మారి మంచి మంచి సినిమాలు చేసి.. ప్రేక్షకులతో రియల్ స్టార్ అనిపించుకున్నాడు. విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఆయన ఎన్నో మంచి చిత్రాల్లో నటించి మెప్పించాడు. ఇక 2013 లో కాలేయ సంబంధ వ్యాధితో చికిత్స పొందుతూ ముంబై లో కన్నుమూశాడు. శ్రీహరి చనిపోయాక.. ఆయన కుటుంబం గురించి పట్టించుకున్నవారే లేరు. ఇక శ్రీహరి భార్య డిస్కో శాంతి కూడా నటినే అన్న విషయం చాలామందికి తెలుసు. ఐటంగర్ల్ గా ఆమెకు అప్పట్లోనే ఎంతో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇక అలాంటి అమ్మాయిని శ్రీహరి ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.

- Advertisement -

శ్రీహరితో పెళ్లి తరువాత శాంతి సినిమాలకు గుడ్ బై చెప్పి ఇంటికే పరిమితమయ్యింది. వీరికి ఇద్దరు పిల్లలు. శ్రీహరి పెద్ద కొడుకు మేఘాంశ్ హీరోగా కూడా పరిచయమయ్యాడు. ఎప్పటినుంచో కెమెరాకు దూరంగా ఉన్న డిస్కో శాంతి ఈ మధ్యనే యూట్యూబ్ ఛానెల్స్ కు ఇంటర్వ్యూ ఇస్తుంది. గత కొంతకాలంగా ఆమె కూడా అనారోగ్యానికి గురి అయ్యిందని, సర్జరీ తరువాత ఇప్పుడు బావున్నట్లు ఆమె చెప్పుకొచ్చింది. అంతేకాకుండా శ్రీహరి మరణం తరువాత ఆమె ఎలా ఉన్నది అనేది చెప్పి ఎమోషనల్ అయ్యింది.

- Advertisement -

” బావ చనిపోయాక ఎక్కువ హాస్పిటల్ లోనే ఉన్నాను. తాగుడుకు బాగా అలవాటుపడ్డాను. పొద్దునే లేవడమే తాగడం మొదలుపెట్టేదాన్ని..వంట మాత్రం చేసి పెట్టేసి తాగడం, పడుకోవడం.. మళ్లీ లేచి తాగడం, పడుకోవడం.. తిండి అనేది అసలు లేకుండా పోయేది. రెండురోజులకు,మూడు రోజులకు ఎక్కువ ఆకలి అనిపిస్తే.. ఇడ్లీ ఒక ముక్క తినేదాన్ని, అది కూడా వాంతు అయిపోయేది. పిల్లలను చూసుకునేదాన్ని, అన్ని చేసుకొనేదాన్ని.. కానీ, నా మైండ్ మొత్తం ఆయన మీద స్ట్రక్ అయిపోయేది. ఇలాగే రెండేళ్లు గడిచిపోయాయి.

మా ఇంట్లో పండగలు కూడా జరుపుకోలేదు. ఏ పండగ కూడా బావ చనిపోయాక చేసుకోలేదు. దీంతో పిల్లలు బాధపడతారని.. చెన్నైలోని మా చెల్లి వాళ్లు పిలిచారు. అక్కడ చేద్దామని పిల్లతో చెన్నై వెళ్లాను. అక్కడ తమ్ముడు వాళ్ళింట్లో ఉన్నాను.. సడెన్ గా పడిపోయాను అంట.. నాకు తెలియదు. వెంటనే హాస్పిటల్ కు తీసుకెళ్తే లివర్ డ్యామేజ్ అని చెప్పారు. మొత్తం లివర్ పోయింది .. మార్చాలని చెప్పారు. సింగపూర్ టికెట్ వేసి.. నన్ను అక్కడికి తీసుకెళ్లి చికిత్స చేయించారు. మూడు నెలల్లో సర్జరీ లేకుండానే నార్మల్ అయ్యాను. ఆ తరువాత నా కొడుకులిద్దరూ వచ్చి నన్ను ఒక మాట అడిగారు. హైదరాబాద్ నుంచి వచ్చి నిన్ను ఎవరు చూడలేదు.. నాన్న చనిపోయి 8 ఏళ్లు అవుతుంది.. నువ్వు కూడా లేకపోతే మమ్మల్ని ఎవరు చూస్తారు అన్నారు. ఆ ఒక్క మాట నా కళ్ళలో నీళ్లు తిరిగాయి. అప్పటి నుంచి మందు ముట్టలేదు” అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News