Rain Alert to Telangana District: గత కొన్ని రోజులుగా ఎండలతో మండిపోతున్న రాష్ట్ర ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు చెప్బింది. రాగల మూడు రోజులు రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. అయితే కొన్ని జిల్లాలో వడగాలులు వీయగా.. మరికొన్ని జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ ఉందని తెలిపింది.
ఆదివారం నుంచి సోమవారం వరకు ఆదిలాబాద్, కొమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కామారెడ్డి జిల్లాలో వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. సోమవారం వనపర్తి, జోగులాంబ గద్వాలలో వడగాలులు వీస్తాయని సూచించింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, జగిత్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కామారెడ్డి జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీంతో ఐఎండీ ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.
Also Read: Weather News Today : చల్లటి కబురు.. రేపట్నుంచి వర్షాలు.. హైదరాబాద్ లో మాత్రం ?
మంగళవారం పలుచోట్ల తేలికపాటి జల్లులు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీనంగర్, ములుగు, భూపాలపల్లి, మెదక్ జిల్లాల్లో తేలికపాటి నుంచి ఉరుములు, మెరుపులతో వర్షాలు కురుస్తాయని ఐఎండీ పేర్కొంది. దీంతో ఈ జిల్లాలకు ఐఎండీ ఎల్లో అలర్ట్ జారీ చేసింది.