E-Paper
Advertisement

అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ విద్యార్థులు మృతి, ఎలా జరిగింది?

అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ విద్యార్థులు మృతి, ఎలా జరిగింది?
Advertisement

America Road Accident: అమెరికాలోని ఫ్లోరిడా‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో తెలంగాణకు చెందిన ముగ్గురు విద్యార్థులు మృత్యువాతపడ్డారు. మృతుల్లో నిజామాబాద్ జిల్లా యువకుడు ఉన్నాడు. మొత్తం ముగ్గురు మరణించినట్టు యువకుల కుటుంబ సభ్యులకు సమాచారం వచ్చింది. దీంతో ఆయా కుటుంబాల్లో విషాదం అలముకుంది.

 

అమెరికాలోని ఫ్లోరిడాలో ఘోర రోడ్డు ప్రమాదం

Advertisement

అమెరికాలోని ఫ్లోరిడా హైవేలోని బ్రెవార్డ్ కౌంటీ ప్రాంతంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అక్కడి కాలమాన ప్రకారం ఉదయం 10 గంటలకు జరిగిన ప్రమాదంలో ముగ్గురు మరణించారు. పామ్ బేలోని 172వ మైలురాయి వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. రహదారిపై ఉత్తరం వైపు ప్రయాణిస్తున్న ఓ వాహనం అదుపుతప్పి రోడ్డు పక్కనున్న చెట్టును బలంగా ఢీ కొట్టింది.

 

ముగ్గురు తెలంగాణ విద్యార్థులు మృతి, నిజామాబాద్‌కు చెందిన విద్యార్థి

Advertisement

ఒక్కసారిగా వాహనంలో మంటలు చెలరేగాయి. మంటల్లో చిక్కుకుని ముగ్గురు యువకులు మృతి చెందారు. ముగ్గురు విద్యార్థుల్లో ఒకరు నిజామాబాద్ జిల్లా నవీపేట్‌కు చెందిన రాహుల్ ఉన్నాడు.  ఆ ముగ్గురు విద్యార్థులు ఉన్నత చదువుల కోసం మూడు నెలల కిందట అమెరికా వెళ్లారు . ఫ్లోరిడా అధికారులు ఈ సమాచారాన్ని కుటుంబ సభ్యులతో పంచుకున్నారు.

మిగతా ఇద్దరు యువకులు ఏ ప్రాంతానికి చెందినవారు అనేది ఇంకా తెలియాల్సివుంది. ఉన్నత చదువులు కోసం అమెరికా వెళ్లిన కొద్దిరోజులకు ప్రాణాలు కోల్పోవడంతో మృతుల కుటుంబాలు కన్నీరు మున్నీరు అవుతున్నాయి. రాహుల్ మృతదేహాన్ని స్వస్థలానికి తీసుకువచ్చేందుకు కుటుంబ సభ్యులు అక్కడివారితో మంతనాలు జరుపుతున్నారు.

 

ALSO READ: గ్లోబల్ హబ్‌గా హైదరాబాద్‌.. ఎన్విడియా వెరా రూబిన్‌ జీపీయూలతో భారీ ప్రాజెక్ట్!

Related News

2 లక్షల మందితో కాంగ్రెస్ భారీ బహిరంగ సభ.. ఎందుకో క్లారిటీ ఇచ్చిన మహేష్ కుమార్ గౌడ్!

నీ హీరోయిన్ల జాతకం మొత్తం బయటపెడతా.. కేటీఆర్ పై బల్మూరి వెంకట్ ఫైర్!

విదేశాల్లో చదవాలనుకునే బీసీ, ఈబీసీ విద్యార్థులకు భారీ గుడ్ న్యూస్.. వెంటనే అప్లై చేయండి?

33 జిల్లాల తెలంగాణలో టాలెంట్ ఉన్న క్రికెటర్లు లేరా.. ధరం గురువారెడ్డి ఫైర్!

హైదరాబాద్‌కు జగన్ మకాం..అక్రమాస్తుల కేసులో బిగ్ ట్విస్ట్, న్యాయస్థానం కీలక నిర్ణయం

మా సంకల్ప అదే.. యువతతోపాటు మహిళలను ప్రోత్సహించాలన్న సీఎం రేవంత్‌రెడ్డి

సరైన అభ్యర్థి ఎవరు? ఎమ్మెల్సీ టికెట్లపై బీజేపీ కసరత్తు

ప్రభుత్వ లెక్చరర్ల బాగోతంపై విద్యాశాఖలో ప్రకంపనలు.. మండిపడుతున్న ప్రజలు, చర్యలు తీసుకోవాలని డిమాండ్

Big Stories

Advertisement
×