E-Paper
Advertisement

జీవో 97 రద్దు చేయకపోతే.. లక్ష మందితో సెక్రటేరియట్ ముట్టడిస్తాం.. కాంగ్రెస్‌కు హరీశ్ రావు అల్టిమేటం!

జీవో 97 రద్దు చేయకపోతే.. లక్ష మందితో సెక్రటేరియట్ ముట్టడిస్తాం.. కాంగ్రెస్‌కు హరీశ్ రావు అల్టిమేటం!
Advertisement

Harish Rao: సెప్టెంబర్ 7న అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యేలోపు జీవో 97ను కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేయాలని బీఆర్ఎస్ ముఖ్యనేత హరీశ్ రావు డిమాండ్ చేశారు. లేని పక్షంలో లక్ష మంది విద్యార్థులతో సెక్రటేరియట్ ను ముట్టడిస్తామని హెచ్చరించారు. లక్షమంది పాలిటెక్నిక్ విద్యార్థులు ఒకటై కదిలితే సీఎం రేవంత్.. సెక్రటేరియట్‌లో అడుగు పెట్టగలరా? అని నిలదీశారు.

జీవో నెంబర్ 97ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్ మాసబ్ ట్యాంక్ లోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఆందోళన చేస్తున్న విద్యార్థులకు హరీశ్ రావు సంఘీభావం తెలిపారు. పాలిటెక్నిక్ కళాశాలలో చదువుకున్న పూర్వ విద్యార్థిగా విద్యార్థులకు పూర్తి మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ ప్రభుత్వ పాలన చూస్తుంటే పిచ్చోడి చేతిలో రాయిలా మారిందని ధ్వజమెత్తారు. ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలను తీసుకెళ్లి స్కిల్ యూనివర్సిటీకి అప్పగించాలని చూస్తున్నారని మండిపడ్డారు.

Advertisement

రాష్ట్రంలో 113 పాలిటెక్నిక్ కళాశాలలు ఉంటే అందులో 59 ప్రభుత్వ కళాశాలలను ప్రైవేటు పరం చేయాలని చూస్తున్నారని హరీశ్ రావు ఆరోపించారు. దీని వల్ల లక్ష మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారబోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ‘ప్రభుత్వానికి పిల్లల భవిష్యత్తు కన్నా పాలిటెక్నిక్ ఆస్తుల మీదే కన్ను పడింది.. రూ.వేల కోట్లు విలువ కలిగిన ఆ ప్రభుత్వ భవనాలు, భూములను బ్యాంకుల్లో కుదవపెట్టి అప్పులు తేవడానికే ఈ కుట్రలు చేస్తున్నారు’ అని మండిపడ్డారు.

పాలిటెక్నిక్ విద్యార్థులు అంటే కేవలం బ్లూ కాలర్ జాబ్స్ చేసేవాళ్లే కాదని.. వైట్ కాలర్ జాబ్స్ కూడా చేసే సత్తా వారిలో ఉందని హరీశ్ రావు అన్నారు. తాను ఇరిగేషన్ మంత్రిగా ఉన్నప్పుడు డిప్లొమా చేసిన వాళ్లు ఏఈ లుగా పనిచేశారని.. రాష్ట్రంలో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు, వాటర్ వర్క్స్ ఇంజనీర్లలో సగం మంది మన పాలిటెక్నిక్ విద్యార్థులే అని గుర్తుచేశారు. ప్రస్తుతం విద్యార్థులు రూ.15 వేలు ఫీజు కడితే పాలిటెక్నిక్ విద్య పూర్తవుతుందని.. ఆ తర్వాత నేరుగా ల్యాటరల్ ఎంట్రీ ద్వారా ఇంజనీరింగ్ చదువుకుంటారని పేర్కొన్నారు. అదే ఇప్పుడు స్కిల్ యూనివర్సిటీలో కలిపితే ఆ ల్యాటరల్ ఎంట్రీ అవకాశాన్ని కోల్పోతారని ఆవేదన వ్యక్తం చేశారు.

Advertisement

Also Read: పాఠశాలల్లో హిజాబ్ కంటే.. యూనిఫామే ముఖ్యం.. అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు

ఢిల్లీలో నీట్ పరీక్షపై జెన్-జీ తరహా ఉద్యమిస్తే ఏకంగా కేంద్ర మంత్రే రాజీనామా చేయాల్సిన పరిస్థితి వచ్చిందని హరీశ్ రావు గుర్తుచేశారు. ఆ చిచ్చు రేపు తెలంగాణలో కూడా రగులుతుందన్నారు. సూర్యాపేటలో ఒక విద్యార్థిని అరెస్ట్ చేస్తే అమ్మాయిలంతా వెళ్లి పోలీసులను చుట్టుముట్టి విడిపించుకొచ్చారన్నారు. జెన్-జీ అంటే కేవలం రీల్స్, వీడియోలు చేసుకునే వారు కాదని.. అవసరమైతే రోడ్డెక్కి భవిష్యత్తును కాపాడుకునే పోరాట యోధులు అని ప్రభుత్వం గుర్తుపెట్టుకోవాలన్నారు. ప్రభుత్వం ఇకనైనా కమిటీల పేరుతో డ్రామాలు ఆడటం మానుకోవాలని సూచించారు.

Also Read: మూసీ ప్రాజెక్ట్‌పై సీఎం రేవంత్ ఉన్నతస్థాయి సమీక్ష.. ఫేజ్-2 టెండర్లకు కసరత్తు ప్రారంభం!

Tags

Related News

కూతురు మరణాన్ని తట్టుకోలేక తండ్రి ఆత్మహత్య!

ఈనెల 30న తెలంగాణకు సునీల్ బన్సల్.. ఆ అంశాలపై కీలక చర్చ!

దేశానికే ఆదర్శంగా తెలంగాణ మహిళా సంఘాలు.. ఢిల్లీ వేదికగా జాతీయ అవార్డు!

కేఆర్ఎంబీ అంటే లెక్క లేదు.. త్రిసభ్య కమిటీ అంటే విలువ లేదు.. ఏపీపై హరీశ్ రావు ఫైర్

గట్టు గ్రామపంచాయతీలో భారీ కుంభకోణం.. రూ. 22 లక్షల ప్రజాధనం మాయం!

కూతురి వ్యాఖ్యలతో మాకేం సంబంధం.. కాంగ్రెస్‌లోనే ఉంటాం.. కొండా మురళి క్లారిటీ!

మార్చి 31 నాటికి ఇందిరమ్మ ఇళ్లు పూర్తి చేసుకున్నారా.. అయితే మీకో గుడ్ న్యూస్!

పౌర సేవలకే కాకుండా.. ఆదాయ మార్గంగా ‘మీ సేవా’.. మెటాతో తెలంగాణ కీలక ఒప్పందం

Big Stories

Advertisement
×