E-Paper
Advertisement

మూసీ ప్రాజెక్ట్‌పై సీఎం రేవంత్ ఉన్నతస్థాయి సమీక్ష.. ఫేజ్-2 టెండర్లకు కసరత్తు ప్రారంభం!

మూసీ ప్రాజెక్ట్‌పై సీఎం రేవంత్ ఉన్నతస్థాయి సమీక్ష.. ఫేజ్-2 టెండర్లకు కసరత్తు ప్రారంభం!
Advertisement

Musi Riverfront: మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు కోసం అవసరమైన భూసేకరణను వేగవంతం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. భూసేకరణకు ల్యాండ్ పూలింగ్‌ విషయంలో స్పష్టమైన విధానం రూపొందించాలని అధికారులకు సూచించారు. మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్‌పై సీఎం రేవంత్.. ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. మూసీ రివర్‌ఫ్రంట్ ప్రాజెక్టు ఫేజ్-2 కి వీలైనంత తొందరగా టెండర్లు పిలవాలని చెప్పారు.

భూసేకరణ ప్రక్రియలో ఎఫ్‌టీఎల్, బఫర్‌ జోన్, అసైన్డ్ భూముల సేకరణకు స్పష్టమైన విధివిధానాలు రూపొందించాలని ఈ సందర్భంగా సీఎం దిశానిర్దేశం చేశారు. ఇందులో న్యాయపరమైన ఎలాంటి చిక్కులు రాకుండా జాగ్రత్త వహించాలని అధికారులకు చెప్పారు. మూసీ రివర్‌ఫ్రంట్‌లో భాగంగా చేపట్టే ప్రాజెక్టులకు అతి తక్కువ వడ్డీకి రుణ సదుపాయాలపై మున్సిపల్ కమిషనర్లు దృష్టి సారించాలని, అలాగే టీడీఆర్‌లు జారీ చేసే విషయంలో కూడా ప్రతి వారం సమీక్షించాలని చెప్పారు.

Advertisement

Also Read: కొండా సురేఖకు బిగ్ షాక్.. మంత్రి పదవి తీసేయాలని.. క్రమశిక్షణ కమిటీ నివేదిక!

అటు గండిపేట మంచిరేవుల సమీపంలోని ఓంకారేశ్వరస్వామి ఆలయ నిర్మాణానికి తక్షణం టెండర్లు పిలవాలని సీఎం ఆదేశించారు. అలాగే, కొత్వాల్‌గూడ బర్డ్స్ పార్క్‌కు విస్తృత ప్రచారం కల్పించాలన్నారు. కాగా ఈ సమావేశంలో హెచ్‌ఎండీఏ, జీహెచ్‌ఎంసీ, సైబరాబాద్‌ మున్సిపల్ కార్పొరేషన్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల కలెక్టర్లు, ఎంఆర్‌డీసీఎల్‌ ఎండీ, జేఎండీ తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Advertisement

Also Read: ఆ రాత్రి హాస్టల్ రూమ్‌లో జరిగిన ఆ చిన్న తప్పు.. ప్రపంచాన్ని ఏలే Googleగా ఎలా అవతరించింది?

Tags

Related News

ఎస్సై దాడి చేశాడని మనస్థాపం చెంది.. పురుగుల మందు తాగిన యువకుడు!

గోవాలో హోరెత్తిన ‘గోయ్ రాఖోన్న్ యాత్ర’.. ముఖ్య అతిథిగా పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి!

వారందరినీ తీసుకొస్తా.. తేదీ- సమయం చెప్పండి, రామచంద్రరావుకు పొన్నం సవాల్

ఎల్లంపేట్ మున్సిపాలిటీలో పడకేసిన పారిశుధ్యం.. పట్టించుకోని అధికారులు

గద్వాల మున్సిపల్ ఆఫీస్‌లో ఉద్రిక్తత.. కమిషనర్ విధులకు ఆటంకం!

ప్రభుత్వ హెల్త్ కార్డ్ పథకంపై వివాదం.. సర్కార్‌కు తప్పని తిప్పలు!

బొల్లారంలో షాకింగ్ ఘటన.. ఆరేళ్ల చిన్నారిని కిడ్నాప్ చేసి, హత్య చేసిన సెక్యూరిటీ, అసలు మేటరేంటి?

మానవత్వం చాటుకున్న మంత్రి కోమటిరెడ్డి.. మూగ, చెవిటి చిన్నారికి పునర్జన్మ!

Big Stories

Advertisement
×