Ravi tejas detox water: సినిమా షూటింగ్స్‌లోనైనా, పబ్లిక్ ఈవెంట్లలోనైనా కుర్ర హీరోలకు సైతం గట్టి పోటీ ఇస్తూ ఎప్పుడూ నాన్-స్టాప్ ఎనర్జీతో కేక పుట్టించే మాస్ మహారాజా రవితేజ ఫిట్‌నెస్ సీక్రెట్ గురించి ఎప్పుడైనా గమనించారా? రీసెంట్ ఈవెంట్‌లో ఆయన చేతిలో పట్టుకున్న ఆ వాటర్ బాటిలే ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్! ఆ బాటిల్ నిండా పుదీనా ఆకులు, నిమ్మకాయ ముక్కలు, తులసి దళాలు, ఉసిరి ముక్కలు కనిపించాయి. చూడ్డానికి ఏదో కలర్ ఫుల్ జ్యూస్ లా ఉన్న ఆ వాటర్ వెనక మాస్ రాజా స్టామినా దాగుంది. మరి ఆ మ్యాజికల్ డీటాక్స్ వాటర్ తాగితే మన శరీరంలో ఎలాంటి అద్భుతాలు జరుగుతాయో ఇప్పుడు చూసేద్దాం రండి!
ఈ పదార్థాలు ప్రకృతి ప్రసాదించిన అద్భుతమైన ఔషధాలు. వీటిని రాత్రి పూట నీటిలో నానబెట్టి, మరుసటి రోజు తాగితే శరీరంలో పేరుకుపోయిన వ్యర్థాలు, హానికరమైన టాక్సిన్స్ అన్నీ చెమట లేదా యూరిన్ ద్వారా బయటకు వెళ్లిపోతాయి. దీని వల్ల లివర్ శుభ్రపడుతుంది. అంతే కాకుండా జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగు పడుతుంది.
ప్రస్తుత కాలంలో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండటం వల్ల చాలా మంది త్వరగా అనారోగ్యాల బారిన పడుతున్నారు. ఈ డ్రింక్‌లో విటమిన్ ‘సి’ సమృద్ధిగా ఉండే ఉసిరి, యాంటీ ఆక్సిడెంట్లు ఉండే తులసి ఆకులు కలవడం వల్ల ఇమ్యూనిటీ పవర్ రాకెట్ లా దూసుకెళ్తుంది. అంతే కాకుండా జలుబు,దగ్గు,వైరల్ ఇన్ఫెక్షన్లు దరి చేరకుండా శరీరాన్ని ఇది రక్షిస్తుంది.
బరువు తగ్గాలని ప్రయత్నించే వారికి ఈ వాటర్ చాలా బాగా ఉపయోగపడుతుంది. దీనిలోని పుదీనా జీర్ణ క్రియను వేగవంతం చేస్తాయి . తిన్న ఆహారం త్వరగా అరిగి, కేలరీలు వేగంగా ఖర్చవుతాయి. దీని వల్ల పొట్ట చుట్టూ పేరుకున్న కొవ్వు కరిగి స్లిమ్ ఫిజిక్ సొంతం చేసుకోవచ్చు.
రవి తేజ ముఖంలో ఆ వయసులో కూడా ఆ గ్లో ఎలా ఉంటుందో తెలుసా? ఉసిరి, తులసిలో ఉండే యాంటీ ఏజింగ్ గుణాలు చర్మాన్ని కాంతి వంతంగా మారుస్తాయి. ఇవి రక్తాన్ని శుద్ధి చేయడం ద్వారా మొటిమలు, మచ్చలు రాకుండా అడ్డుకుంటాయి. ఈ నీటిని రోజూ తాగడం వల్ల చర్మం నిగనిగలాడుతుంది.
Also Read: రాఖీ స్పెషల్ స్వీట్స్.. పండుగ రోజు సులభంగా తయారు చేసే 3 రెసిపీలు
పుదీన.. అజీర్తి, కడుపు ఉబ్బరం వంటి సమస్యలను ఇట్టే దూరం చేస్తుంది. తిన్నది సరిగ్గా అరగక ఇబ్బంది పడేవారికి ఈ హెర్బల్ వాటర్ మంచి ఉపశమనాన్ని ఇస్తుంది. అంతే కాకుండా మానసిక ఒత్తిడిని తగ్గించి రిలాక్స్‌గా ఉంచడానికి సహాయ పడుతాయి.
ఒక లీటర్ నీటిలో కొన్ని పుదీనా ఆకులు, నిమ్మ ముక్కలు, కొన్ని తులసి ఆకులు, ఒక ఉసిరి కాయ ముక్కలను వేసి రాత్రంతా నానబెట్టాలి. మరుసటి రోజు ఉదయం నుంచి ఈ నీటిని సాధారణ నీటిలా కొద్దికొద్దిగా తాగుతుండాలి.