E-Paper
Advertisement

జిమ్,ఆఫీసులకు బెస్ట్.. టాప్ 5 పోర్టబుల్ బ్లెండర్లు ఇవే!

జిమ్,ఆఫీసులకు బెస్ట్.. టాప్ 5 పోర్టబుల్ బ్లెండర్లు ఇవే!
Advertisement

Best portable blenders: బయట షాపుల్లో దొరికే ఖరీదైన స్మూతీల కోసం డబ్బులు తగలేస్తున్నారా? ఇక ఆ టెన్షన్ అసలు వద్దు! మీరు ఎక్కడికెళ్లినా మీతో పాటే తీసుకువెళ్లేలా, చిటికెలో తాజా జ్యూసులు తయారు చేసుకునేలా అద్భుతమైన పోర్టబుల్ బ్లెండర్లు ప్రస్తుతం మార్కెట్‌ను షేక్ చేస్తున్నాయి. యూఎస్బీ ద్వారా ఛార్జ్ చేసుకునే.. ఈ మినీ బ్లెండర్లు మీ రోజువారీ హెల్తీ లైఫ్‌స్టైల్‌ను పూర్తిగా మార్చేస్తాయి. అమెజాన్‌లో హాట్ కేకులా అమ్ముడవుతున్న ఆ టాప్-5 పోర్టబుల్ బ్లెండర్లు ఫీచర్లకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

టాప్-5 పోర్టబుల్ బ్లెండర్లు ఫీచర్లు:

1.BlendJet 2 Portable Blender:

పోర్టబుల్ బ్లెండర్లలో వరల్డ్ వైడ్‌గా విపరీతమైన క్రేజ్ ఉన్న బ్రాండ్ ఇది. ఈ మోడల్ కాంపాక్ట్ సైజులో ఉంటుంది. ఇది USB-C కేబుల్ ద్వారా త్వరగా ఛార్జ్ అవుతుంది. ఐస్ క్యూబ్స్‌ని కూడా క్షణాల్లో బ్లెండ్ చేసే పవర్ ఫుడ్ బ్లేడ్లు దీని సొంతం. అమెజాన్‌లో దీని ధర సుమారు రూ.3,500 నుంచి రూ. 4,500 మధ్యలో ఉంటుంది.

2.AGARO Royal USB Portable Blender:

Advertisement

నమ్మకమైన బ్రాండ్‌గా పేరున్న అగారో నుంచి వచ్చిన ఈ మినీ బ్లెండర్ చాలా పాపులర్. ఇది ఫుడ్ గ్రేడ్ మెటీరియల్‌తో.. తయారైంది కాబట్టి ఆరోగ్యానికి పూర్తిగా సురక్షితం.పవర్ ఫుల్ మోటార్‌తో కూడిన ఈ బ్లెండర్ ప్రోటీన్ షేక్స్ ,ఫ్రూట్ జ్యూస్‌లను నిమిషాల్లోనే రెడీ చేస్తుంది. ఇది సుమారు రూ.1,500 నుంచి రూ.2,000 మధ్యలో అందుబాటులో ఉంది.

3.NutriBullet GO Cordless Blender:

హెల్త్ కాన్షియస్ పీపుల్ ఎక్కువగా.. ఇష్ట పడే న్యూట్రిబుల్లెట్ బ్రాండ్ నుంచి వచ్చిన కార్డ్‌ లెస్ మోడల్ ఇది. ఇది చిన్నగా ఉన్నప్పటికీ పని తీరులో మాత్రం అదుర్స్ అనిపిస్తుంది. హై-స్పీడ్ మోటార్ ఉండటం వల్ల కఠినమైన పండ్లను కూడా మెత్తని పేస్ట్ లేదా స్మూతీలా మారుస్తుంది. దీనిని క్లీన్ చేయడం కూడా చాలా ఈజీ అని చెప్పొచ్చు.అమెజాన్‌లో దీని ధర సుమారు రూ 4,000 నుంచి రూ.5,500 వరకు ఉంటుంది.

4.Kalsi Portable Rechargeable Juicer Blender:

Advertisement

తక్కువ బడ్జెట్‌లో.. ఎక్కువ రోజులు పాడవకుండా ఉండే గాడ్జెట్ కోరుకునేవారికి ఇది పర్‌ఫెక్ట్ ఛాయిస్. మంచి డిజైన్ కలిగి ఉండటంతో బ్యాగ్‌లో వేసుకుని ఎక్కడికైనా దీనిని ఈజీగా తీసుకెళొచ్చు. వంటగదిలో కరెంట్ లేని సమయంలో కూడా దీన్ని బ్యాటరీ సాయంతో వాడొచ్చు. దీని ధర సుమారు రూ.1,000 నుంచి రూ.1,400 లోపు బడ్జెట్ ధరలో లభిస్తోంది.

Also Read: క్షణాల్లోనే ఇల్లు తళతళా మెరిసిపోవాలా? టాప్ 5 వాక్యూమ్ క్లీనర్లు మీ కోసం!

5.Philips Portable Electric Juicer Cup:

ఎలక్ట్రానిక్స్ రంగంలో.. నమ్మకానికి మారు పేరైన ఫిలిప్స్ బ్రాండ్ నుంచి వచ్చిన.. పోర్టబుల్ జ్యూసర్ కప్ ఇది. అంతే కాకుండా ఇది స్టైలిష్ లుక్, సేఫ్టీ ఫీచర్లతో వస్తుంది. బ్లెండర్ సరిగ్గా ఫిట్ అయితేనే.. ఆన్ అయ్యే స్మార్ట్ లాకింగ్ సిస్టమ్ దీని ప్రత్యేకత. ప్రయాణాల్లో పాలు, జ్యూసులు కలుపుకోవడానికి ఇది నంబర్ వన్ ఆప్షన్. దీని ధర సుమారు రూ.2,200 నుంచి రూ.2,800 మధ్యలో ఉంది.

బయట షాపుల్లో.. అనారోగ్యకరమైన సిరప్‌లతో తయారయ్యే స్మూతీలకు డబ్బులు వృథా చేయడం ఎందుకు? అమెజాన్‌లో మీ బడ్జెట్‌కు తగినట్టుగా దొరుకుతున్న ఈ పోర్టబుల్ బ్లెండర్లలో ఒకదాన్ని ఇప్పుడే ఇంటికి తెచ్చుకోండి. మీకు నచ్చిన పండ్లతో ఎక్కడైనా, ఎప్పుడైనా తాజా జ్యూస్‌లు తయారు చేసుకుంటూ మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి.

Related News

డార్క్ మోడ్‌లో ఫోన్ వాడితే ఛార్జింగ్ సేవ్ అవుతుందా? తెలిస్తే షాక్ అవుతారు

ఫోన్ స్విచ్ ఆఫ్ ఉన్నా వాట్సాప్ మెసేజ్ వెళ్తుంది! వాట్సాప్ నుంచి మరో కిర్రాక్ అప్‌డేట్!

రూ.వెయ్యిలోపు బెస్ట్ ఇయర్‌బడ్స్! సేల్‌లో సగం ధరకే..

BSNL నుంచి మరో చౌకైన ప్లాన్.. రూ. 202 కే 32 రోజుల వ్యాలిడిటీ.. అదిరిపోయే బెనిఫిట్స్ మామ!

సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు ఎగిరి గంతేసే న్యూస్! ఇక నుంచి కోడింగ్,ఫైనాన్స్ పనులు చిటికెలో!

ఏఐ బాట్స్ డేంజర్ జోన్..శాస్త్రవేత్తల పరిశోధనలో షాకింగ్ నిజాలు!

జియో ఫైబర్ బంపర్ ఆఫర్..ఏడాది రీఛార్జ్‌పై 4 నెలలు ఫ్రీ ఇంటర్నెట్!

ఇదేందయ్యా ఇదీ..సేల్‌లో చిమ్నీల రేట్లు ఇంత తక్కువగా ఉన్నాయ్!

Big Stories

Advertisement
×