E-Paper
Advertisement

Thummala Nageswara Rao: ఖమ్మంలో పలు అభివృద్ధి పనులకు మంత్రి తుమ్మల శంకుస్థాపన

Thummala Nageswara Rao: ఖమ్మంలో పలు అభివృద్ధి పనులకు మంత్రి తుమ్మల శంకుస్థాపన
Advertisement

Thummala Nageswara Rao: ఖమ్మం నగరంలోని 14వ డివిజన్‌లో రూ. 2.25 కోట్ల నిధులతో చేపట్టనున్న సీసీ రోడ్ల నిర్మాణ పనులకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లా అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తున్నారని తెలిపారు. మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని.. నగరంలోని ప్రతి డివిజన్‌లో అవసరమైన పనులు చేపడుతున్నామని చెప్పారు. మంజూరైన నిధులను సక్రమంగా వినియోగించి, నాణ్యమైన పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

Advertisement

విద్యాసంస్థల పరిసరాల్లో గంజాయి విక్రయాలు, మత్తు పదార్థాల అక్రమ రవాణాను సహించబోమని మంత్రి హెచ్చరించారు. ఇలాంటి చర్యలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అలాగే నగరంలో కబ్జాలకు పాల్పడే గ్యాంగ్‌లను పూర్తిగా అరికట్టి, ఖమ్మం నగరానికి దూరం చేస్తామని హామీ ఇచ్చారు.

కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ఆశలను నెరవేర్చేందుకు కట్టుబడి ఉందని మంత్రి తెలిపారు. అభివృద్ధి పనులు పారదర్శకంగా, ప్రజలకు ఉపయోగపడేలా జరుగుతాయని పేర్కొన్నారు. ఈ సీసీ రోడ్ల నిర్మాణంతో స్థానికుల రవాణా సమస్యలు తీరుతాయని నగర సౌందర్యం మరింత మెరుగవుతుందని అధికారులు తెలిపారు.

Advertisement

ALSO READ: Gas Cylinder Blast: లింగంపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో పేలిన గ్యాస్ సిలిండర్.. భారీగా ఎగసిపడుతోన్న మంటలు

Related News

బీజేపీలోకి కొండా సురేఖ.. క్లారిటీ ఇచ్చిన ఎంపీ డీకే అరుణ!

కాన్‌స్టర్ సొల్యూషన్స్ ప్రారంభోత్సవంలో కేటీఆర్ కీలక వ్యాఖ్యలు!

కామారెడ్డి జిల్లాలో ఘోరం.. ఆర్టీసీ బస్సు బోల్తా స్పాట్‌లో 13 మంది..!

మాదాపూర్‌లో ఈ-సిగరెట్ల దందా గుట్టురట్టు.. పోలీసులకు ఎలా చిక్కారంటే..?

ఖమ్మం జిల్లాలో చైనా సైబర్ గ్యాంగ్ దందా కలకలం.. 52 మంది యువకులు అరెస్ట్!

కేసీఆర్‌కు బిగ్ షాక్.. సంచలన నిర్ణయం తీసుకున్న తెలంగాణ కాంగ్రెస్..!

మేడ్చల్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం.. గాల్లో పల్టీలు కొట్టిన కారు

కొండా సురేఖ బర్తరఫ్‌లో బిగ్ ట్విస్ట్.. నిజాలు బయటపెట్టిన టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్!

Big Stories

Advertisement
×