Bandi Support: స్వేచ్చ బ్యూరో: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ను రాజకీయంగా దెబ్బతీసేందుకు జరుగుతున్న కుట్రల నుంచి కాపాడటంతోపాటు ఆయనకు మానసిక ప్రశాంతత కల్పించాలని కోరుతూ తిరుపతికి చెందిన 46 ఏళ్ల జాతీయ వాది పెరుగు వెంకటేశ్వర్లు సైకిల్ యాత్ర చేపట్టారు. తిరుపతి అలిపిరి వద్ద గంగమ్మకు మొక్కులు చెల్లించుకుని శక్తి సంకల్ప యాత్ర పేరుతో గత నెల 25న సైకిల్ యాత్ర ప్రారంభించారు. తిరుపతి మీదుగా మొదలైన సైకిల్ యాత్ర ఒంటిమిట్ట, కడప, నంద్యాల, మైదుకూరు, కర్నూలు మీదుగా తెలంగాణలో అడుగుపెట్టారు. అలంపూర్ మీదుగా పెబ్బేరు, జడ్చర్ల, బాలానగర్, షాద్ నగర్, శంషాబాద్ మీదుగా హైదరాబాద్ చేరుకున్నారు.
ప్రతిరోజు సగటున 85 కిలోమీటర్ల చొప్పున సైకిల్ తొక్కుకుంటూ ఈరోజు హైదరాబాద్ కు చేరుకున్నారు. వాస్తవానికి తిరుపతి నుంచి కరీంనగర్ వరకు శక్తి సంకల్ప యాత్ర చేపట్టిన పెరుగు వెంకటేశ్వర్లు.., బండి సంజయ్ కుమార్ హైదరాబాద్ లోనే ఉన్నారని సమాచారం రావడంతో నేరుగా బంజారాహిల్స్ లోని కేంద్ర మంత్రి బండి సంజయ్ నివాసానికి చేరుకున్నారు. పెరుగు వెంకటేశ్వర్లు సైకిల్ యాత్ర గురించి బీజేపీ కార్యకర్తల నుంచి సమాచారం అందుకున్న బండి సంజయ్ పెరుగు వెంకటేశ్వర్లును తన నివాసానికి సాదరంగా ఆహ్వానించారు. తాను జాతీయవాదినని, జాతీయ వాదులకు ఏ కష్టం వచ్చినా అండగా ఉండాలనే సంకల్పంతో ఈ యాత్ర చేపట్టానని ఈ సందర్భంగా పెరుగు వెంకటేశ్వర్లు సంజయ్ కు తెలిపారు. మండుటెండను లెక్క చేయకుండా జాతీయ వాదులకు అండగా నిలుస్తూ పెరుగు వెంకటేశ్వర్లు చేస్తున్న శక్తి సంకల్ప యాత్ర అభినందనీయమన్నారు.b
Also Read: తెలంగాణలో జనసేన సభ మాటేంటి? హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్.. వాటిని నమ్మవద్దని విజ్ఞప్తి
అనంతరం పెరుగు వెంకటేశ్వర్లును శాలువాతో సన్మానించడంతోపాటు భోజన ఆతిథ్యమిచ్చారు. ఈ సందర్భంగా పెరుగు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ దేశం కోసం, ధర్మం కోసం, హిందుత్వం కోసం జాతీయవాది బండి సంజయ్ చేస్తున్న పోరాటాన్ని చూసి ఆయన అభిమానిగా మారాననన్నారు. ఇటీవల కాలంలో బండి సంజయ్ పై జరుగుతున్న దుష్ప్రచారాన్ని చూసి తీవ్ర కలత చెందానని వాపోయారు. బండి సంజయ్ లాంటి జాతీయ వాది ఈ దేశానికి ఎంతో అవసరమని, అందుకే బండి సంజయ్ బాగుండాలని ఆయనకు జాతీయ వాదులంతా అండగా నిలవాలని కోరుతూ శక్తి సంకల్ప యాత్ర పేరుతో తిరుపతి నుంచి హైదరాబాద్ వరకు సైకిల్ యాత్ర చేపట్టినట్లు తెలిపారు. సైకిల్ యాత్రలో భాగంగా ప్రతిరోజు రాత్రి దేవాలయంలో బస చేసేవాడనని, మరుసటి రోజు ఆలయంలో బండి సంజయ్ బాగుండాలని పూజ చేసిన అనంతరం సైకిల్ యాత్ర చేసేవాడనని చెప్పుకొచ్చారు.
Also Read: రామ్ చరణ్‌కు నేషనల్ అవార్డ్!.. శివరాజ్ కుమార్‌ది మామూలు నమ్మకం కాదు..