E-Paper
Advertisement

Tomoto Price today: ఆల్‌ టైమ్ హై కి టమాటా.. ధర దిగేదేలే..

Tomoto Price today: ఆల్‌ టైమ్ హై కి టమాటా.. ధర దిగేదేలే..
Advertisement
Tomoto latest price

Tomoto latest price(Telugu news updates):

తెలుగు రాష్ట్రాల్లో టమాటా ధర ఆల్ టైం రికార్డును నమోదు చేసింది. అన్నమయ్య జిల్లాలోని మదనపల్లె మార్కెట్లో టమాటా ధర కిలోకు 2 వందల రూపాయల రికార్డు ధర పలికింది. తెలంగాణ రాష్ట్రంలోనూ టమాటా ధర 200 రూపాయలు పలకడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.

నిన్న మొన్నటి వరకు 120 రూపాయలు ఉన్న టమాటా ధర అమాంతం పెరిగింది. టమాటాలకు డిమాండ్ ఎక్కువ ఉండడం, మర్కెట్లో దొరకడం లేదన్న సాకుతో 2వందలు దాటించేశారు వ్యాపారులు. దీంతో సామాన్యులు టమాటాల వంక చూడటమే మానేశారు.

Advertisement

ఈ నెలలో టమోటా ధరలు కిందికి దిగుతాయని అనుకున్నప్పటికీ ఆ పరిస్థితి కనిపించడంలేదు. ఇటీవల కురిసిన వర్షాలు టమాటా దిగుబడులపై ప్రభావం చూపాయి. ఏపీలోని అన్నమయ్య జిల్లా మదనపల్లె మార్కెట్ టమాటాలకు ఫేమస్. అయితే మదనపల్లె మార్కెట్ కు తక్కువ మొత్తంలో టమాటాలు రావడంతో ధర పెరుగుతోందని వ్యాపారులు తెలిపారు.

మరోవైపు టమాటాకు దేశ వ్యాప్తంగా గిరాకీ భారీగా పెరిగింది. ఢిల్లీ, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, ఛత్తీస్గడ్ కు చెందిన వ్యాపారులు ఆంధ్రప్రదేశ్ లో మకాం వేసి టమాటాలను కొనుగోలు చేసుకుని వెళ్తున్నారు. ఇది చాలదా మరింత రేట్ పెంచేందుకు.

Related News

AP DSC-2025 లో అక్రమాలు.. మంత్రి లోకేష్ సైలెంట్ వెనుక, అధికారులు మాత్రం శాప్ కార్యాలయంలో

ఏపీ డీఎస్సీ-2025లో తవ్వినకొద్దీ.. ప్రభుత్వంలో వణుకు మొదలు, బిగ్‌ టీవీ సోషల్ మీడియాపై ఆంక్షలు

పెళ్లైన వారానికే.. సినిమాకు వెళ్దామని చెప్పి భార్య గొంతు కోసి భర్త, నెల్లూరు జిల్లాలో ఘటన

ప్రశ్నిస్తే బ్లాక్ చేస్తారా? బిగ్ టీవీ వ్యవహారంపై నెటిజన్ల ఫైర్

ఏపీలో అమల్లోకి కొత్త మున్సిపల్ చట్టం.. జీవోలు విడుదల!

నిజాలు చూపిస్తే ఇన్‌స్టాగ్రామ్ ఖాతా బ్లాక్ చేయిస్తారా.. కూటమి ప్రభుత్వంపై సీదిరి అప్పలరాజు ఫైర్!

ఏపీ డీఎస్సీ 2025 కుంభకోణంపై జగన్ సంచలన ట్వీట్.. ప్రశ్నిస్తే సోషల్ మీడియా ఖాతాలు బ్లాక్ చేస్తారా అంటూ ఫైర్!

ఏపీ ఉద్యోగులకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్.. డీఏల విడుదలకు గ్రీన్ సిగ్నల్!

Big Stories

Advertisement
×