BigTV English

Chandrababu Speech: కర్నూల్‌కు న్యాయ రాజధాని వచ్చిందా? చంద్రబాబు హామీల వర్షం..

Chandrababu Speech: కర్నూల్‌కు న్యాయ రాజధాని వచ్చిందా? చంద్రబాబు హామీల వర్షం..
chandrababu speech

Chandrababu naidu latest news(AP politics) : YCP అంటే కరప్షన్‌.. TDP అంటే డెవలప్మెంట్‌ అని టీడీపీ అధినేత చంద్రబాబు కొత్త డెఫినేషన్‌ చెప్పారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో పర్యటించిన బాబు.. మచ్చుమర్రి, బనకచర్ల ప్రాజెక్టులను సందర్శించారు. నందికొట్కూరులో రోడ్‌ షోలో జగన్‌పై విరుచుకుపడ్డారు. కర్నూల్‌కు న్యాయ రాజధాని వచ్చిందా? అని ప్రశ్నించారు. తాము అధికారంలోకి రాగానే కొత్త విద్యుత్‌ పాలసీతో పాటు 3 సిలిండర్లు ఇస్తామన్నారు. మద్యం రేట్లు తగ్గిస్తామని హామీ ఇచ్చారు చంద్రబాబు.


రాయలసీమ కోసం జగన్‌ ఏనాడైనా పనిచేశారా? అని ప్రశ్నించారు. టీడీపీ హయాంలో సీమలో రూ.12,400 కోట్లు ఖర్చు పెట్టామని.. సీమ ద్రోహి జగన్‌ ఖర్చు చేసింది కేవలం రూ.2వేల కోట్లేనని చెప్పారు. రోడ్డుకు మట్టి వేయలేరు కానీ.. 3 రాజధానులు కడతారా? అని నిలదీశారు. ఒక రాజధానిని నాశనం చేసి 3 రాజధానులు అంటున్నారని మండిపడ్డారు.

జగన్ బటన్‌ నొక్కడం కాదు.. బటన్‌ బుక్కుడు ఎక్కువైంది అంటూ పంచ్‌లు వేశారు. విద్యుత్‌ ఛార్జీలు ఇప్పటికే 8 సార్లు పెంచారని.. టీడీపీ అధికారంలోకి వచ్చాక కరెంట్ ఛార్జీలు తగ్గిస్తామని.. పాత మద్యం విధానం తెచ్చి లిక్కర్ రేట్ తగ్గిస్తామని చెప్పారు. ఆడబిడ్డ నిధి కింద ప్రతి మహిళకు నెలకు రూ.1500.. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం.. 20 లక్షలకుపైగా ఉద్యోగాలు.. ఇలా అనేక హామీలు గుప్పించారు చంద్రబాబు.


Related News

Pulivendula Politics: పులివెందుల రాజకీయాలు.. 30 ఏళ్లలో రెండోసారి, ఓటర్లు ఫుల్‌ఖుషీ

Pawan Kalyan: రూటు మార్చిన పవన్.. నిన్న మామిడి.. నేడు చీరలు, రేపు?

AP Free Bus Scheme: ఏపీలో ఫ్రీ బస్ స్కీమ్.. ఆ బస్సు లెక్కితే ఉచిత ప్రయాణం ఉండదు

Chandrababu: మళ్లీ జన్మంటూ ఉంటే నాకు అక్కడ పుట్టాలని ఉంది -చంద్రబాబు

Jagan-Sharmila: అన్న పేరెత్తకుండా షర్మిల, చెల్లి పేరు లేకుండా జగన్ రక్షా బంధన్ ట్వీట్లు

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Big Stories

×