BigTV English

Bogata Waterfalls: ఉప్పొంగి ప్రవహిస్తూ, పర్యాటకులకు కనువిందు చేస్తోన్న బోగత జలపాతం

Bogata Waterfalls: ఉప్పొంగి ప్రవహిస్తూ, పర్యాటకులకు కనువిందు చేస్తోన్న బోగత జలపాతం

Tourist Spot Bogata Water Falls In Mulugu District vajedu Village: గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా తెలంగాణ నయాగరగా పేరుగాంచిన బోగత జలపాతం ములుగు జిల్లా వాజేడు మండలంలో ఉంది. ప్రస్తుతం ఈ జలపాతం పాలనురుగులతో ఉప్పొంగి ప్రవహిస్తోంది. ఈ ప్రాంతం వరంగల్ జిల్లా నుండి సుమారు 134 కి.మీ ఉంటుంది. ఇక అటు ఖమ్మం, ఇటు కరీంనగర్, ఆదిలాబాద్, చత్తీస్‌ఘడ్ ప్రాంతాలకు దగ్గరగా ఉంటుంది.దీంతో ఇక్కడికి వచ్చే టూరిస్ట్‌ల సంఖ్య ప్రతి సంవత్సరం రెట్టింపు అవడంతో టూరిస్ట్‌ల అనుమతికి అధికారులు నిరాకరించారు.


అంతేకాదు పర్యాటకులు ఎట్టి పరిస్థితుల్లోనూ నీటిలోకి దూకి ఈతలు కొట్టకూడదని ఫారెస్ట్ అధికారులు ఆ ప్రాంతానికి కట్టుదిట్టమైన ఏర్పాట్లను చేశారు. అంతేకాదు పర్యాటకులు దూరం నుండి చూసి వెళ్లిపోవాలని సూచిస్తున్నారు.ప్రతి ఏడాది ఈ టైమ్ వచ్చిందంటే చాలు బోగత జలపాతం పరవళ్లు తొక్కుతూ ఉగ్రరూపం దాల్చుతుంది. అంతేకాకుండా మహారాష్ట్రలో వర్షాలకు దిగువన ఉన్న ఈ బోగత ప్రాంతానికి అధిక వరద వచ్చి చేరడంతో బోగత జలపాతం చాలా రమణీయంగా చూపరులను కనువిందు చేస్తోంది. అంతేకాదు ఈ జలపాతం పూర్తిగా అడవి ప్రాంతంలో ఉండటంతో పాటుగా కొండాకోనల ప్రాంతాల నుండి నీళ్లు వచ్చి ఈ జలపాతానికి పోటెత్తుతున్నాయి.

Also Read: కుక్కల దాడిలో బాలుడు మృతి.. ఘటనపై స్పందించిన రేవంత్ రెడ్డి


ఈ నేపథ్యంలో బోగత జలపాతాన్ని చూసేందుకు పర్యాటకులు క్యూలైన్ కడుతున్నారు. దీంతో ఆ ప్రాంతమంతా సందడి వాతావరణం నెలకొంది. అంతేకాదు ఈ ప్రాంతం ఎప్పటినుంచో టూరిస్ట్‌ స్పాట్‌గా ఉండటంతో తెలుగు రాష్ట్రాల పర్యాటకులతో పాటుగా చత్తీస్‌ఘడ్, మహారాష్ట్రాల నుండి పర్యాటకులు ఇక్కడికి ప్రతిసంవత్సరం వస్తుంటారు. ఇక ఇక్కడికి వచ్చే పర్యాటకుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జిల్లా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. అంతేకాదు జలపాతం దగ్గరకు వెళ్లకుండా జలపాతం చుట్టూ ఇనుపకంచెను ఏర్పాటు చేశారు.వీకెండ్ ఫ్లాన్ చేయాలనుకునే వారు ఇక్కడికి వెళితే ఈ ప్రకృతి రమణీయ ప్రదేశాన్ని ఆధ్యంతం ఆశ్వాదించవచ్చు. అంతేకాదు ఈ జలపాతం దృష్యాలు దగ్గరి నుండి చూసిన అనుభవం మీరు ఎప్పటికి మర్చిపోలేరు.

Tags

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×