TPCC General Secretary Addanki Dayakar: BRS వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ పై TPCC ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వ బీఆర్ఎస్ హయాంలో తెలంగాణను కేటీఆర్ క్యాసినో హబ్ గా మార్చారని ఓ రేంజ్ లో తీవ్ర విమర్శలు చేశారు. అత్యాధునిక హంగులతో కూడిన క్యాసినో ఆట విదేశాల్లో ఆడతారు. అయితే ఈ జూదాలు ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి ఫామ్ హౌస లో జరుగుతున్నాయని అద్దంకి దయాకర్ సంచలన ఆరోపణలు చేశారు.
ఇటీవల కాలంలో కేటీఆర్ బావమరిది ఇంట్లో పార్టీ లో కొకైన్ పట్టుబడిందని చెప్పారు. ‘మళ్లీ ఆ మాత్రం తీసుకోవద్దా అన్నట్లు మాట్లాడుతున్నారు. టీపీసీసీ హోదాలో రేవంత్ రెడ్డి వైట్ చాలెంజ్ చేస్తే హై కోర్టుకు వెళ్ళి పరువు నష్టం కేసు పెడతాడు. కేటీఆర్ అప్పుడప్పుడు అలా ఏసీబీని టెస్ట్ చేస్తుంటాడు. కేసీఆర్ కుటుంబంలోని నలుగురు వాళ్ళ కోసం మాత్రమే పోరాడుతున్నారు. BRS హాయంలో ఇచ్చిన పర్మిషన్ తో రెండేళ్ల నుంచి ఈ పందెలు జరుగుతున్నాయి. కేటీఆర్ ఓ దొంగల నాయకుడు. సారా అమ్మి జైలుకు వెళ్లొచ్చి.. ఫార్ములా రేస్ లో విచారణ అనంతరం మళ్లీ జై తెలంగాణ అంటారు. జై తెలంగాణ అనే హక్కు మీకు లేనే లేదు. పది మంది ఎమ్మెల్యేలు ఎందుకో పార్టీ ఫిరాయించారో అర్ధం చేసుకోండి. హీరో కావడానికి కేటీఆర్ జీరో పనులు చేస్తున్నారు’ అని అద్దంకి దయాకర్ చెప్పుకొచ్చారు.
‘నాలుగేళ్ల తర్వాత కూడా కేసీఆర్ బయటకి వచ్చే పరిస్థితి లేదు. పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి ఫామ్ హౌస్ లో జరుగుతున్నఅక్రమాలకు కేటీఆర్ బాధ్యుడు కేటీఆర్. కేటీఆర్ కూడా శిక్షకు అర్హుడే. దొంగలకు లీజును ఇస్తే ఇచ్చినవాళ్ళు దొంగలే అవుతారు. సూరత్ పోర్టు నుంచి రెండు తెలుగు రాష్ట్రాలకు గంజాయి వస్తుంది. పోలీసుల అండర్ కవర్ ఆపరేషన్ లో పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి ఫామ్ హౌస్ వ్యవహారం బయట పడింది. ఈ వ్యవహారంపై ప్రభుత్వం, పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంటుంది అని భావిస్తున్నాను. ఎస్సీ వర్గీకరణ లో ఎలాంటటి కుట్ర లేదు.. శాస్త్రీయబద్దంగా జరిగింది. కాంగ్రెస్ ఏ వర్గాన్ని దూరం చేసుకోదు. ఇప్పటికైనా కులగణనలో కేసిఆర్, కేటీఆర్, డీకే అరుణలు పాల్గొనాలి’ అని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ వ్యాఖ్యానించారు.