E-Paper
Advertisement

Traffic Diversions : రేవంత్‌రెడ్డి ప్రమాణస్వీకారం.. నగరంలో ట్రాఫిక్‌ ఆంక్షలు..

Traffic Diversions : రేవంత్‌రెడ్డి ప్రమాణస్వీకారం.. నగరంలో ట్రాఫిక్‌ ఆంక్షలు..
Advertisement
telangana news live

Traffic Diversions in Hyderabad(Telangana news live):

మరికొన్ని గంటల్లో తెలంగాణ చరిత్రలో మరో కీలక ఘట్టం ఆవిష్కృతం కానుంది. తెలంగాణ రెండో సీఎంగా రేవంత్‌రెడ్డి ఇవాళ మధ్యాహ్నం ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని సీబీఐ కాలనీలో ఆయన నివాసం వద్ద సందడి వాతావరణం నెలకొంది. భారీ భద్రత ఏర్పాటు మేరకు పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. అలాగే రేవంత్‌ నివాసానికి వెళ్లే మార్గంలో అడుగడుగునా భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.

ఇక రేవంత్‌రెడ్డి ప్రమాణస్వీకారం నేపథ్యంలో నగరంలో ట్రాఫిక్‌ ఆంక్షలు అమలు చేశారు అధికారులు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటలకు ఈ ఆంక్షలు అమలులో ఉండనునున్నాయి. ఈ మేరకు ఏఆర్‌ పెట్రోల్‌ పంపు నుంచి వచ్చే ట్రాఫిక్‌ను బీజేఆర్‌ విగ్రహం వైపు వెళ్లకుండా నాంపల్లి, చాపెల్‌ రోడ్డు వైపు మళ్లించనున్నారు. ఎస్‌బీఐ గన్‌ఫౌండ్రీ నుంచి వచ్చే ట్రాఫిక్‌ను బీజేఆర్‌ సర్కిల్‌ వైపు వెళ్లకుండా.. ఎస్‌బీఐ గన్‌ఫౌండ్రీ వద్ద చాపెల్‌ రోడ్డు వైపు మళ్లిస్తారు.

Advertisement

అలాగే బషీర్‌బాగ్‌ నుంచి బీజేఆర్‌ విగ్రహం వైపు వచ్చే ట్రాఫిక్‌ను బషీర్‌బాగ్‌ వద్ద కింగ్‌కోఠి, ఓల్డ్‌ ఎమ్మెల్యే క్వార్టర్స్‌ రహదారి వైపు మళ్లిస్తారు. వాహనదారులు ఎల్‌బీ స్టేడియం సమీపంలో ఉన్న పలు జంక్షన్‌ల వైపు వెళ్లకుండా ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా గమ్యస్థానాలు చేరుకోవాలని ట్రాఫిక్‌ పోలీసులు సూచించారు.

Related News

సవాల్ మీది.. అరెస్ట్ మాదా? తెలంగాణ భవన్ వద్ద హైడ్రామా.. మాజీ మంత్రి హరీష్ రావు అరెస్ట్!

Minister Komatireddy: కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో మంత్రి ఉత్సాహం.. మీ రుణం తీర్చుకోలేనంటూ..?

Telangana BJP: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టేందుకు బీజేపీ బిగ్ స్కెచ్.. అందుకు వ్యూహం ఇదే..?

Khammam News: ఖమ్మంలో కాక రేపుతున్న మున్సిపల్ రాజకీయం.. ఓ పక్క గెలుపు వ్యూహాలు.. మరోపక్క జంపింగ్ రాజాల తంటాలు..!

Sarpanch elections: సర్పంచ్‌గా గెలవక ముందే అభ్యర్థి ప్రకటన చూసి అవాక్కయిన గ్రామస్థులు –  అసలు ఏం చేశాడో తెలుసా..?  

New Royal Enfield Bikes: రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి 2 క్రేజీ బైక్స్ లాంచ్, ఏకంగా 648cc ట్విన్ ఇంజిన్ తో!

Telangana Loksabha Election Results: కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి ప్రభంజనం.. భారీ మెజార్టీతో గెలుపు

Traffic diversions in Hyderabad due to counting of votes: ఎన్నికల కౌంటింగ్.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు!

Big Stories

Advertisement
×