Vimal Krishna: కొన్ని సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్స్ అయినప్పుడు ఆ హీరోలకు పేరు రావడం సహజం. కొన్ని సందర్భాలలో దర్శకులు కూడా మంచి పేరు వస్తుంది. అయితే కొన్ని సూపర్ హిట్ సినిమాల దర్శకులు కూడా కొంతమంది పట్టించుకోరు. సిద్దు జొన్నలగడ్డ నటించిన డి జె టిల్లు సినిమా బాక్సాఫీస్ వద్ద ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమాతో మంచి స్టార్ డం అందుకున్నాడు సిద్దు. సిద్దుకు కూడా ఈ సినిమాతోనే వరుసగా అవకాశాలు వచ్చాయి. ఎన్ని అవకాశాలు వచ్చినా చేయకుండా టిల్లు స్క్వేర్ సినిమాతో మరోసారి ప్రేక్షకులు ముందుకు వచ్చి దాదాపు 100 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసుకుని పోయాడు. టిల్లు క్యూబ్ సినిమా కూడా రానుంది. అయితే ఇవి కాకుండా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో జాక్, నీరజ కోన దర్శకత్వంలో తెలుసు కదా సినిమాను చేస్తున్నాడు సిద్దు.
డి జె టిల్లు సినిమాకి విమల్ కృష్ణ దర్శకత్వం వహించాడు. ఆ సినిమా తర్వాత స్క్వేర్ కి పనిచేసే అవకాశం వచ్చినా కూడా రిపీటెడ్ గా ఉంటుందని తనంతట తానే ఆ సినిమా డైరెక్షన్ నుంచి తప్పుకున్నాడు. విమల్ కృష్ణ ముందుగా కొన్ని సినిమాల్లో నటుడుగా కనిపించాడు. ఇక దర్శకుడుగా కూడా టిల్లు స్క్వేర్ సినిమాతో మంచి పేరు సాధించాడు. అయితే సితార ఎంటర్టైన్మెంట్ నాగ వంశీకి ఇదివరకే ఒక కథను చెప్పినట్లు కూడా తెలిపాడు విమల కృష్ణ. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం విమల్ కృష్ణ హీరో విక్టరీ వెంకటేష్ కు ఒక కథను చెప్పినట్లు తెలుస్తుంది. ఈ కథకు ఆల్మోస్ట్ విక్టరీ వెంకటేష్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం వినిపిస్తుంది. దీని గురించి అధికారిక ప్రకటన త్వరలో రావాల్సి ఉంది. ఇక వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా ఎలా ఉండబోతుంది అని ఇప్పటికే కొంతమందికి క్యూరియాసిటీ మొదలైంది.
Also Read : Game Changer third Single : ఆ పాట నా మైలేజ్ పెంచింది… సరికొత్త ప్రపంచంలోకి వెళ్తారు
విక్టరీ వెంకటేష్ ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమాను చేస్తున్నాడు. ఈ సినిమా కూడా సంక్రాంతి కానుక విడుదల కావలసి ఉంది. ఈ సినిమా మీద మంచి అంచనాలు ఉన్నాయి. ఇక సీనియర్ హీరోస్ అంతా కూడా యంగ్ డైరెక్టర్స్ తో రీసెంట్ టైమ్స్ లో సినిమాలు చేయడం మొదలుపెట్టారు. మెగాస్టార్ చిరంజీవి బాబీతో సినిమా చేసి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. నందమూరి బాలకృష్ణ అనిల్ రావిపూడి తో సినిమా చేసి మంచి హిట్ కొట్టారు. ఇప్పుడు విక్టరీ వెంకటేష్ కూడా యంగ్ డైరెక్టర్స్ తో సినిమాలు చేస్తున్నారు. విక్టరీ వెంకటేష్ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఒక పర్ఫెక్ట్ సినిమా పడితే మంచి కలెక్షన్స్ రాబట్టొచ్చు. మరి విమల్ కృష్ణ ఎటువంటి సబ్జెక్ట్ ను వెంకీ కోసం సెట్ చేశాడో వేచి చూడాలి.