E-Paper
Advertisement

ఆ శాఖలో పనిచేయాలంటే జంకుతున్న ప్రభుత్వ ఉద్యోగులు

ఆ శాఖలో పనిచేయాలంటే జంకుతున్న ప్రభుత్వ ఉద్యోగులు

Transport Targets: స్వేచ్ఛ బ్యూరో: రవాణాశాఖలో పనిచేస్తున్న ఉద్యోగులకు టార్గెట్ విధించారు. ప్రతి నెలా టార్గెట్ రీచ్ కావాలని ఆదేశాలు సైతం ఇచ్చినట్లు సమాచారం. దీంతో పనిచేస్తున్న ఉద్యోగులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నట్లు సమాచారం. జిల్లాను, ఏరియాను బట్టి అధికారులు టార్గెట్ పెట్టడం తో ఎలా సాధ్యమవుతుందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏం చేయాలో తెలియని పరిస్థితి నెలకొందని లోలోన సతమతమవుతున్నారు.

టార్గెట్ కోంసం పరుగులు

రవాణాశాఖలో భాగమైన స్టేట్ ట్రాన్స్ పోర్టు అథారిటీ(ఎస్టీఏ)లో సుమారు 340 మంది వరకు ఎంవీఐ, ఏఎంవీఐలు విధులు నిర్వర్తిస్తున్నారు. 340 మందిలో 141 మంది ఎంవీఐలు ఉండగా 199 మంది ఏఎంవీఐలు ఉన్నారు. ఆదాయంపై రవాణాశాఖ దృష్టిసారించింది. దీంతో ఎంవీఐ, ఏఎంవీఐలకు టార్గెట్ విధించారు. ఒక్కొక్కరికి 8 నుంచి 15లక్షలు పెట్టినట్లు సమాచారం. జిల్లాలు, ఏరియాలను బట్టి టార్గెట్ విధించడం గమనార్హం. రూరల్ ఏరియా అయితే తక్కువ.. అర్బన్ ఏరియా అయితే ఎక్కువగా విధించినట్లు సమాచారం. అంటే నిత్యం టార్గెట్ లకోసం పరుగులు పెడుతున్న పరిస్థితి నెలకొంది. వారిపై ఆర్టీఓలు, డీటీసీలు సైతం నిత్యం మానిటరింగ్ చేస్తున్నట్లు సమాచారం. వాహనాల తనిఖీతోనే కాలం వెళ్లదీయాల్సి వస్తుందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

విస్తృత తనిఖీలు

చెక్ పోస్టులు తొలగించక ముందు పెట్టిన టార్గెట్ లను రీచ్ అయినట్లు సమాచారం. ఒక్కవైపు చెక్ పోస్టులు..మరోవైపు వాహన తనిఖీలు చేయడంతో విధించిన టార్గెట్ ను విధించిన గడువులోగానే చేరుకునేవారని సమాచారం. అయితే చెక్ పోస్టులు ఎత్తివేసిన తర్వాత.. అక్కడ పనిచేసిన ఉద్యోగులను, ఆర్టీఓ కార్యాలయాల్లో పనిచేస్తున్న ఎంవీఐ, ఏఎంవీఐలతో ఎన్ ఫోర్స్ మెంట్ బృందాలు ఏర్పాటు చేశారు. విస్తృత తనిఖీలు చేపడుతున్నారు. నిబంధనలు అతిక్రమించిన వాహనాలపై ఉన్న ఫైన్లు, గడువు తీరిన, ఇతర రాష్ట్రాల నుంచి వాహనాలకు అనుమతులు లేకపోయినా.. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనం నడిపేవారిపై, ఓవర్ లోడ్ వాహనాలు, ఇతర నిబంధనలు పాటించని వారిపై చర్యలు తీసుకుంటున్నారు.

Also Read: బీహార్‌లో ఘోర బస్సు ప్రమాదం.. 13 మంది మృతి.. 30 మందికి గాయాలు

ఆదాయ మార్గాలు

రోడ్డు ప్రమాదాల నివారణలో భాగంగామే అంటూ అధికారులు పేర్కొంటున్నప్పటికీ విధించిన టార్గెట్ రీచ్ కావాలని ఆదేశాలతోనే ముమ్మర తనిఖీలు చేపడుతున్నారనే ప్రచారం ఊపందుకుంది. 2024-25 లో రవాణా శాఖ 6910.90 కోట్లు ఆదాయం రాగా కాగా ,2025-26 లో 7097.38 కోట్లు ఆదాయం వచ్చింది. అయితే ఈవీ పాలసీతో 769.81 కోట్ల పన్నురాయితీ ఇవ్వడంతో తగ్గింది. ఈ ఆదాయం రాబట్టేందుకు ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. తగ్గిన ఆదాయాన్ని ఎన్ఫోర్స్మెంట్ బలోపేతం చేస్తూ ఆదాయ మార్గాలు పెంచుకునేలా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు సైతం ఇచ్చింది.

వాహనాలు లేకుండా ఎలా సాధ్యం

ఎన్ ఫోర్స్ మెంట్ టీంలకు వాహనాలు లేవు. సీనియర్ ఎంవీఐలకు మాత్రమే వాహనాలను ప్రభుత్వం గతంలో ఇచ్చింది. ఆర్టీఓలకు, ఎంవీఐలకు సైతం ఇస్తామని హామీ ఇచ్చినప్పటికీ ఇంకా కొనుగోలు చేయలేదు. ఈ మధ్యకాలంలో ఈవీ వాహనాల కొనుగోలుకు కసరత్తు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. అయితే ఎప్పటిలోగా కొనుగోలు చేస్తారనేది మాత్రం క్లారిటీ లేదు. ఆదాయంపై దృష్టిసారించిన శాఖ.. ఉద్యోగులకు వాహనాలపై ఎందుకు పెట్టడం లేదని పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు. కేవలం ఆదాయమేనా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. కొంతమంది మాత్రం పాత ఉద్యోగులకే టార్గెట్ ఇచ్చారని.. ఈ మధ్యకాలంలో ఉద్యోగ బాధ్యతలు చేపట్టిన(ఏఎంవీఐ)వారికి మాత్రం టార్గెట్ విధించలేదని.. వారి సైతం విధిస్తే తమపై కొంత టార్గెట్ తగ్గుతుందని అభిప్రాయపడుతున్నారు.

హెచ్చరికలు జారీ..

మరోవైపు టార్గెట్ రీచ్ అయి లైఫ్ టాక్స్ ,త్రైమాసిక టాక్స్ వసూలు లో మంచి పనితీరు కనబరిచిన అధికారులను ప్రభుత్వం అభినందిస్తుంది. పలువురు అధికారులకు పనితీరు మెరుగు పరచుకోవాలని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. దీంతో కొంతమంది లోలోన మానసికంగా కుంగిపోతున్నట్లు సమాచారం. ఏం చేయాలో తెలియక తోటి ఉద్యోగులతోనే అభిప్రాయాలను పంచుకుంటున్నారు. ఏది ఏమైనప్పటికీ టార్గెట్లు అధికారులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నట్లు సమాచారం.

Also Read: కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ జెండాకు కలర్ ఫిక్స్!

Related News

Promotion Scam: డీహెచ్ ఆఫీస్‌లో ఘోరం.. ప్రమోషన్ల కోసం కులాన్నే మార్చేసిన అధికారులు..?

సీఎం రేవంత్ రెడ్డి విజన్‌కు జర్మనీ ప్రతినిధులు జేజేలు.. ఎందుకో తెలుసా..?

ఎస్పీడీసీఎల్ డైరెక్టర్‌కు బిగ్ షాక్.. రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్ని బంద్..?

చెరువులో చెట్ల దందా.. ప్రశ్నించిన మహిళా లీడర్‌పై దాడి.. ఫోన్లు లాక్కొని సర్పంచ్ భర్త రౌడీయిజం!

Stubble Burning: రైతు చేసిన చిన్న తప్పుకి.. లక్షల రూపాయల కష్టం నిమిషాల్లో బుగ్గిపాలు..!

కాంగ్రెస్ సర్కార్‌ పై.. నాగం జనార్దన్ రెడ్డి ఫైర్..?

Palamuru: రెండు రోజుల పాటు పాలమూరులోనే సీఎం రేవంత్!

రైతులకు జూన్ 2 కానుక మిస్!: పనులన్నీ పూర్తి చేసినా సాంకేతిక అడ్డంకులు!

Big Stories

×