E-Paper
Advertisement

చిరంజీవిని చూశాం.. విజయ్‌ని గమనించాం.. తెలంగాణలో అధికారంలోకి వస్తాం-కవిత కీలక వ్యాఖ్యలు

చిరంజీవిని చూశాం.. విజయ్‌ని గమనించాం.. తెలంగాణలో అధికారంలోకి వస్తాం-కవిత కీలక వ్యాఖ్యలు
Advertisement

TRS Chief Kavitha: తెలంగాణలో రాజకీయాలు మారబోతున్నాయా? కొత్తవారికి అక్కడి ప్రజలు అవకాశం ఇస్తారా? ప్రజల్లో ఆలోచన తీరు మారిందా? తాజాగా టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత ‘బిగ్ టీవీ’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎలాంటి విషయాలు బయట పెట్టారు? తమిళనాడు విజయ్ మాదిరిగానే, తెలంగాణలో మా పార్టీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు ఆమె.

బిగ్ టీవీ ఇంటర్వ్యూలో టీఆర్ఎస్ చీఫ్ కవిత కీలక వ్యాఖ్యలు

Advertisement

తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత ‘బిగ్ టీవీ’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు మొదటి నుంచి నమ్మకం ఉందని, విజయ్ గెలుపుతో ప్రజలకు నమ్మకం వచ్చిందన్నారు. కొత్తవారికి అవకాశం ఇవ్వాలని ప్రజలు భావిస్తున్నారని మనసులోని మాట బయటపెట్టారు.

గడిచిన రెండు మూడేళ్లలో అనేక కష్టాలు ఎదుర్కొన్నానని, ఆ కాలంలో వేలాది మంది మద్దతుదారులు తనకు అండగా నిలిచారన్నారు. తాను జైలులో ఉన్నప్పుడు, బయటకు వచ్చిన తర్వాత కూడా ఫాలోవర్స్ క్రమంగా పెరుగుతున్నారని, ఏమి ఇచ్చి వారి రుణం తీర్చుకోవాలో తెలీదన్నారు. ఆ విధంగా మద్దతుదారులు ఉన్నారని, వేలాది మంది మా పార్టీలో జాయిన్ అవుతున్నారని చెప్పారు.

Advertisement

చిరంజీవిని చూశాం.. విజయ్‌ని గమనించాం, తెలంగాణలో అధికారంలోకి వస్తాం-కవిత 

మద్దతు అనేది ఊరికే రాదని, పార్టీ పెట్టిన 10 రోజుల్లో జెండా పండగ కార్యక్రమానికి పిలుపు ఇచ్చామన్నారు. మా పార్టీలో అలాంటి కమిట్మెంట్ ఉన్న కార్యకర్తలు ఉన్నారని, వారి మీద పార్టీ నిర్మాణం జరుగుతుందన్నారు. తాను గట్టి నాయకుడి వద్ద ట్రైనింగ్ తీసుకున్నానని, ఎలాంటి అపజయం వచ్చినా వెనక్కి తగ్గకుండా ఎలా ఉండాలి?

ఏ విధంగా పార్టీని ముందుకు తీసుకెళ్లాలి? అలాంటివి చూసి పెరిగిన వ్యక్తినని తెలిపారు. పార్టీల ఫెయిల్యూర్ జరిగిన తర్వాత తెలంగాణ ఉద్యమం సక్సెస్ అయ్యిందన్నారు. ఫెయిల్యూర్లు చూసి నేర్చుకుంటున్నామని, బీఆర్ఎస్ మాదిరిగా ఓడిపోకుండా పార్టీ నిర్మాణంపై దృష్టి సారించినట్టు వివరించారు.

ALSO READ: బాల్కసుమన్‌కు 14 రోజుల రిమాండ్.. చంచల్‌గూడ జైలుకు తరలింపు, అసలేం జరిగింది?

పార్టీలు పెట్టి ఫెయిలైన నాయకులు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నారని ఈ సందర్బంగా వివరించారు. ఇంద్రారెడ్డి, దేవేందర్ గౌడ్, చిరంజీవి వంటి నేతలు పార్టీలు పెట్టి నడప లేకపోయారని గుర్తు చేశారు. వారేమీ చిన్న నేతలు కాదని, అలాగే షర్మిల కూడా పార్టీ పెట్టారని ఆ తర్వాత కాంగ్రెస్‌లో విలీనం చేశారని చెప్పుకొచ్చారు. ఫెయిలైన పార్టీలను చూపించి తాము అలాగే అవుతామని కొందరు చెప్పడం కరెక్టుకాదన్నారు. వందకు వెయ్యి శాతం సక్సెస్ చేసి చూపిస్తామని కుండ బద్దలు కొట్టేశారు టీఆర్ఎస్ చీఫ్ కవిత.

 

 

Related News

ఎల్‌నినో ఎఫెక్ట్‌.. తెలుగు రాష్ట్రాలకు రానున్న అతిపెద్ద గండం ఇదే?

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వింత దృశ్యం.. మిరప తోటల్లో సినీ తారల ఫ్లెక్సీలు!

కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు!

నకిలీ యూఎల్‌సీ పత్రాలతో రిజిస్ట్రేషన్లు దందా కలకలం

తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం.. మారనున్న ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు!

తెలంగాణలో హ్యుందాయ్ బిగ్ ప్లాన్.. రూ.8,528 కోట్లతో మెగా ప్రాజెక్ట్.. సీఎం రేవంత్ కీలక విజ్ఞప్తి!

నీ డేటా మొత్తం నా దగ్గర ఉంది పరేషాన్ కాకు.. కేటీఆర్‌ పై గజ్జెల కాంతం ఫైర్!

కరవు కట్టడి చర్యల్లో.. సీఎం రేవంత్ అట్టర్ ఫ్లాప్.. ప్రభుత్వంపై విరుచుకుపడ్డ కవిత!

Big Stories

Advertisement
×