E-Paper
Advertisement

మోడీ స్టేడియంలో గుజ‌రాత్ కుట్ర‌లు..RCB గుండెల్లో రైళ్లు, ఇక స‌గం మ్యాచ్ దొబ్బిన‌ట్టే

మోడీ స్టేడియంలో గుజ‌రాత్ కుట్ర‌లు..RCB గుండెల్లో రైళ్లు, ఇక స‌గం మ్యాచ్ దొబ్బిన‌ట్టే
Advertisement

IPL 2026 Finals:  ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ (Indian Premier League 2026 Tournament) తుది అంకానికి వచ్చేసింది. ఇవాళ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ గుజరాత్ టైటాన్స్ ( Royal Challengers Bengaluru vs Gujarat Titans, Final) మధ్య ఫైనల్స్ జరగనుంది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం (Narendra Modi Stadium, Ahmedabad) వేదికగా ఈ మ్యాచ్ నిర్వహించనున్నారు. ఇవాళ రాత్రి 7:30 గంటలకు ఈ మ్యాచ్ షురూ కానుంది. ఇలాంటి నేపథ్యంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టును ఓడించేందుకు హోం టీం గుజరాత్ టైటాన్స్ స్కెచ్ వేసినట్లు తెలుస్తోంది. ఇవాల్టి మ్యాచ్ కోసం పిచ్ నెంబర్ 6 ను సిద్ధం చేశారట. ఇదే పిచ్ పైన గ్రూప్ స్టేజ్ లో రెండు జట్లు తలపడ్డాయి. ఇందులో గుజరాత్ టైటాన్స్ విజయం సాధించింది. అందుకే ఇవాల్టి ఫైనల్స్ కోసం కూడా గుజరాత్ టైటాన్స్ అదిరిపోయే స్కెచ్ వేసి.. పిచ్ నెంబర్ 6ను (Pitch No.6) సిద్ధం చేశారు. ఇక ఈ నేపథ్యంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు అభిమానులు టెన్షన్ పడుతున్నారట.

Also Read: Ravichandran Ashwin: వైభ‌వ్ రెండుస్లార్లు సెంచ‌రీ మిస్‌..క‌న్నీళ్లు పెట్టుకున్న అశ్విన్‌ కసరత్తులు చేసి, వ్యూహాన్ని

Pitch No.6 సెలెక్ట్ చేయడం వెనుక అసలు రహస్యం ఇదే

Advertisement

గుజరాత్ టైటాన్స్ వర్సెస్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య మరికాసేపట్లో ఫైనల్స్ మ్యాచ్ జరిగినది. ఇలాంటి క్రమంలో అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరగనున్న ఈ మ్యాచ్ కోసం పిచ్ నెంబర్ 6 ( Pitch No.6) సిద్ధం చేసిందట గుజరాత్. మిక్స్డ్ సాయిల్ తో ఉండే ఈ పిచ్ పై గుజరాత్ టైటాన్స్ బౌలర్లు రెచ్చిపోయే ప్రమాదం ఉంది. అత్యంత ప్రమాదకరంగా ఉన్న గుజరాత్ టైటాన్స్ ఫాస్ట్ బౌలర్లు… ఈ పిచ్ ను బాగా వాడుకోనున్నారట. అంతేకాదు గ్రూప్ స్టేజీలో 42వ మ్యాచ్ లో భాగంగా బెంగళూరు వర్సెస్ గుజరాత్ టైలర్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో మొదటి బ్యాటింగ్ చేసిన బెంగుళూరు 155 పరుగులు సాధించింది. ఈ లక్ష్యాన్ని అవలీలగా చేదించిన గుజరాత్ టైటాన్స్ విజయం సాధించింది. 25 బంతులు మిగిలి ఉండగానే బెంగళూరు జట్టును చిత్తు చేసింది. ఈ మ్యాచ్ లో అర్షద్, రషీద్ ఖాన్, జాసన్ హోల్డర్, మహమ్మద్ సిరాజ్ అద్భుతంగా బౌలింగ్ చేశారు. ఈ క్రమంలోనే పిచ్ నెంబర్ 6 ను సెలెక్ట్ చేసి రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టును ఇబ్బంది పెట్టేందుకు ఆశిష్ నెహ్రా (Ashish Nehra) ఈ ప్లాన్ చేసినట్లు చెబుతున్నారు. ఇక ఆశిష్ నెహ్రా వేసిన ప్లాన్ వర్కౌట్ అవుతే మాత్రం… రాయల్ చాలెంజర్స్ బెంగళూరు చిత్తుగా ఓడిపోవడం గ్యారంటీ అంటున్నారు క్రీడా విశ్లేషకులు.

బెంగళూరుకు ఉన్న అడ్వాంటేజ్ ఏంటి ?

ఐపీఎల్ 2026 ఫైనల్స్ నేపథ్యంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు కూడా ఓ అడ్వాంటేజ్ ఉంది. క్వాలిఫైయర్ మొదటి మ్యాచ్ ఐదు రోజుల కిందట ఆడి ఫైనల్స్ కు చేరుకుంది బెంగుళూరు. ఈ క్రమంలో బెంగుళూరుకు మంచి రెస్ట్ దొరికింది. అలాగే మోడీ స్టేడియంలో దాదాపు 5 రోజులుగా బెంగళూరు జట్టు సావాసం చేస్తోంది. అక్కడే ప్రాక్టీస్ చేస్తున్నారు. రెండు రోజులపాటు ప్రాక్టీస్ సెషన్స్ లో పాల్గొన్న బెంగళూరు జట్టు… అక్కడి వాతావరణానికి అలవాటు పడింది. పిచ్ కండిషన్స్ మొత్తం అర్థం చేసుకుంది. కానీ ఇప్పటి వరకు గుజరాత్ టైటాన్స్ ఆ గ్రౌండ్ లో ప్రాక్టీస్ చేయలేదు. నిన్న రాత్రి 11 గంటల సమయంలో న్యూ చండీగఢ్ నుంచి మోడీ స్టేడియానికి చేరుకుంది గుజరాత్ టైటాన్స్. అందుకే బెంగళూరుకు కాస్త అడ్వాంటేజ్ ఉంటుందని మరికొంతమంది చెబుతున్నారు. అయితే ఇక్కడ గుజరాత్ చాలా మ్యాచులు ఇప్పటికీ ఆడింది. వాళ్లకు ఇది హోమ్ గ్రౌండ్. కాబట్టి ప్రాక్టీస్ చేయకుండా గుజరాత్ అద్భుతంగా రాణించే అవకాశాలే ఉంటాయి.

Advertisement

Also Read: IPL 2026 Finals  RCB VS GT:  గుజ‌రాత్ వ‌ర్సెస్ RCB మ‌ధ్య ఫైన‌ల్స్..ముందే ఊహించిన అన‌న్య బిర్లా, పాత పోస్ట్ వైర‌ల్ 

 

Related News

పాకిస్తాన్ జ‌ట్టులో కుదుపు…ఫాతిమా స‌నా కెప్టెన్సీ గ‌ల్లంతు

ధోని లేక ఒక్కొక్క‌డి సుఖాలు ఎక్కువ‌య్యాయి..లేకుంటే గంభీర్‌, అగార్క‌ర్ తోక‌లు క‌ట్ చేసేవాడు

పాకిస్తాన్ త‌యారు చేసిన బంతుల వ‌ల్లే, ఫిఫా వరల్డ్ కప్ స‌క్సెస్!

పిక్ పాకెట్ కేసులో పాక్ క్రికెట‌ర్ హసన్ అలీ..తోలు తీసిన ఇండియ‌న్‌ పోలీసులు !

పాకిస్తాన్ ద‌య వ‌ల్లే, మేం క్రికెట్ నేర్చుకున్నాం..ఆఫ్ఘనిస్తాన్ ప్లేయ‌ర్ సంచ‌ల‌నం !

‘వరల్డ్‌కప్‌’ ఫార్మాట్‌ మార్పు వెనుక అంబానీ కుట్ర‌లు..ఐసీసీతో BCCI కుమ్మ‌క్కై !

పియూష్ చావ్లాకు న‌ర‌కం చూపించిన‌ పాక్ బ్యాట‌ర్ న‌వాజ్..ఒకే ఓవ‌ర్ లో 20 ప‌రుగులు

ఇంగ్లాండ్ కు గుడ్ బై…శ్రీలంక జ‌ట్టులో చేరిపోయిన జోఫ్రా ఆర్చ‌ర్‌?

Big Stories

Advertisement
×