BigTV English

TSPSC : సరికొత్త విధానంలో TSPSC బోర్డు సభ్యుల నియామకం.. ఆ విధానానికి స్వస్తి..

TSPSC : రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ స్టేట్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీస్సీ) ఛైర్మన్, సభ్యుల భర్తీకి సరికొత్త విధానాన్ని తీసుకువచ్చింది. ఈ పోస్టులను ఇప్పటివరకు నామినేటెడ్ విధానంలో సభ్యులను నియమిస్తున్నారు. అయితే తొలిసారిగా దరఖాస్తు విధానాన్ని రాష్ట్రప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ మేరకు దరఖాస్తులు ఆహ్వనిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి శుక్రవారం ప్రకటన విడుదల చేశారు. ఆసక్తి ఉన్నవారు www.telangana.gov.in వెబ్ సైట్ నుంచి దరఖాస్తును డౌన్ లోడ్ చేసుకోవాలని సూచించారు. ఈ నెల 18వ తేదీ సాయంత్రం 5 గంటల్లోగా దరఖాస్తును నింపి సమర్పించాల్సి ఉంటుందని సీఎస్ తెలిపారు.

TSPSC : సరికొత్త విధానంలో TSPSC బోర్డు సభ్యుల నియామకం.. ఆ విధానానికి  స్వస్తి..

TSPSC : రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ స్టేట్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీస్సీ) ఛైర్మన్, సభ్యుల భర్తీకి సరికొత్త విధానాన్ని తీసుకువచ్చింది. ఇప్పటి వరకు నామినేటెడ్ విధానంలో సభ్యులను నియమిస్తున్నారు. అయితే తొలిసారిగా దరఖాస్తు విధానాన్ని రాష్ట్రప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ మేరకు దరఖాస్తులు ఆహ్వనిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి శుక్రవారం ప్రకటన విడుదల చేశారు. ఆసక్తి ఉన్నవారు www.telangana.gov.in వెబ్ సైట్ నుంచి దరఖాస్తును డౌన్ లోడ్ చేసుకోవాలని సూచించారు. ఈ నెల 18వ తేదీ సాయంత్రం 5 గంటల్లోగా దరఖాస్తును నింపి సమర్పించాల్సి ఉంటుందని సీఎస్ తెలిపారు.


రాష్ట్ర ప్రభుత్వం మూడు పేజీల అప్లికేషన్ ఫారంని టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్, సభ్యుల పోస్టుల భర్తీ కోసం రూపొందించింది. ఇందులో విద్యార్హతలు, కేంద్ర, రాష్ట్రప్రభుత్వాల్లో పనిచేసిన వివరాలు, విధులు, ఉద్యోగంలో సాధించిన విజయాలు మొదలైన పూర్తి సమాచారం నింపాలి. న్యాయశాస్రం, సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం, హ్యుమానిటీస్ లేదా పనిని గుర్తించే రంగానికి సంబంధించిన వివరాలు, నిర్వహించిన బాధ్యతలు మొదలైన పూర్తి సమాచారాన్ని సమర్పించాల్సి ఉంటుంది. తమ ప్రత్యేకతలు విజయాలను 200 పదాల్లో వివరించాలి.

పరిశీలనకు వచ్చిన దరఖాస్తులను సెర్చ్ కమ్ స్క్రీనింగ్ కమిటీ పరిశీలన చేయనుంది. ఈ కమిటీ దరఖాస్తులను పరిశీలించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పిస్తుంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 316 ప్రకారం టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్, ఇతర సభ్యులను గవర్నర్ నియమిస్తారు.


మరోవైపు టీఎస్‌పీ‌ఎస్సీ సభ్యురాలు సుమిత్ర ఆనంద్ తనోబా శుక్రవారం తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను గవర్నర్ తమిళసైకు పంపించారు. టీఎస్‌పీఎస్సీ లో నెలకొన్న పరిస్థితులు, ప్రభుత్వం మారడంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు ఆమె వివరించారు.

.

.

Tags

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×