E-Paper
Advertisement

HRC: చైనా మాంజాపై మానవ హక్కుల కమిషన్ సీరియస్.. సీపీ సజ్జనార్‌కు నోటీసులు

HRC: చైనా మాంజాపై మానవ హక్కుల కమిషన్ సీరియస్.. సీపీ సజ్జనార్‌కు నోటీసులు
Advertisement

నిషేధిత చైనా మాంజా విక్రయాలు, వినియోగంపై తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ (HRC) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. నగరంలో ప్రాణాంతకంగా మారిన ఈ మాంజా కట్టడిపై స్పష్టమైన నివేదిక సమర్పించాలని కోరుతూ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్‌కు కమిషన్ మంగళవారం నోటీసులు జారీ చేసింది.

పిటిషనర్ ఆవేదన..

Advertisement

అడ్వకేట్ రామరావు ఇమ్మానేని దాఖలు చేసిన పిటిషన్‌పై కమిషన్ ఈ నిర్ణయం తీసుకుంది. పండుగ సీజన్లలో చైనా మాంజా కారణంగా సామాన్య ప్రజలు, ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు ప్రాణాలు కోల్పోతున్నారని, పక్షులు సైతం ఈ దారానికి చిక్కి మృత్యువాత పడుతున్నాయని పిటిషనర్ కమిషన్ దృష్టికి తీసుకెళ్లారు. ప్రభుత్వం నిషేధం విధించినప్పటికీ.. క్షేత్రస్థాయిలో దీని అమ్మకాలు యథేచ్ఛగా సాగుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

నివేదికకు గడువు..

Advertisement

ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన హెచ్‌ఆర్‌సీ.. ప్రజల ప్రాణాలకు ముప్పు కలిగిస్తున్న చైనా మాంజా విషయంలో పోలీసులు తీసుకున్న చర్యలేమిటో తెలియజేయాలని ఆదేశించింది. ఈ అంశంపై పూర్తి వివరాలతో కూడిన నివేదికను వచ్చే ఏడాది ఫిబ్రవరి 26వ తేదీలోపు తమ ముందు ఉంచాలని పోలీసు శాఖను ఆదేశించింది.

ప్రమాదకరమైన చైనా మాంజా..

సాధారణంగా పతంగులు ఎగురవేసేందుకు వాడే ఈ మాంజాను నైలాన్ లేదా సింథటిక్ పదార్థాలతో తయారు చేస్తారు. దీనికి గ్లాస్ కోటింగ్ ఉండటం వల్ల ఇది అత్యంత పదునుగా ఉంటుంది. దీనివల్ల ప్రమాదవశాత్తు దారిలో వెళ్లేవారి మెడకు, కాళ్లకు ఈ దారం తగిలితే తీవ్రమైన గాయాలవ్వడమే కాకుండా, మెడ నరాలు తెగి మరణించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పోలీసులు ఎన్ని హెచ్చరికలు జారీ చేసినా, కొంతమంది విక్రేతలు రహస్యంగా దీనిని విక్రయిస్తూనే ఉన్నారు.

ఈ నేపథ్యంలోనే.. కమిషన్ ఇచ్చిన నోటీసులతో ఇకనైనా చైనా మాంజా విక్రయాలపై పోలీసులు కఠిన చర్యలు చేపడతారని సామాన్య ప్రజలు భావిస్తున్నారు

ALSO READ: UP Crime: పోలీసు‌స్టేషన్‌లో దారుణం.. అందరూ చూస్తుండగా, భార్యని కాల్చిన భర్త, యూపీలో ఘోరం

Related News

స్పీడ్ పెంచిన రేవంత్ రెడ్డి.. రేపటి నుంచి సొంత గడ్డపై రెండు రోజుల పర్యటన !

అసదుద్దీన్ ఒవైసీ అసలైన దేశభక్తుడు.. సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభంలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

సాగర్‌కి శని పట్టింది.. ఆ ఇద్దరు మంత్రులే కారణం:మిర్యాల గూడలో రెచ్చిపోయిన KTR

31 ఏళ్ల కాంగ్రెస్ బంధం.. అధిష్టానానికి కొండా సురేఖ కన్నీటి లేఖ!

కేబినెట్ నుంచి ఔట్.. సురేఖకు ముందు బర్తరఫ్ అయిన మంత్రులు వీళ్లే!

రేవంతే పట్టుబట్టి నన్ను తీసేశారు..సీఎం పై సంచలన కామెంట్స్!

నన్ను అడగకుండా ఎలా బర్తరఫ్ చేస్తారు?.. అధిష్ఠానంపై మంత్రి కొండా సురేఖ ఫైర్!

సురేఖ అక్కా నేనున్నాను, పార్టీలోకి రావాలని కేఏపాల్ ఆహ్వానం

Big Stories

Advertisement
×