Big Stories

Telangana TET 2024 Results: రేపు టీఎస్ టెట్ ఫలితాలు విడుదల..

Telangana TET 2024 Results on June 12th: తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ ఫలితాలు జూన్ 12న విడుదల కానున్నాయి. మే 20 నుంచి జూన్ 2 వరకు టెట్ పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షలకు 2,86,381 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. కాగా వారిలో 2,36, 487 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. ఈ నెల 3న టెట్ ప్రాథమిక కీని అధికారులు విడుదల చేశారు.

- Advertisement -

అభ్యంతరాల అనంతరం ఈ నెల 12న ఫలితాలు విడుదల చేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. జూన్ 12న ఫైనల్ కీతో పాటు ఫలితాలు ప్రకటించేందుకు విద్యాశాఖ సిద్ధమవుతోంది.
ఇక పేపర్ – 1కి 99, 558 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా..86.03 శాతం మంది హాజరయ్యారు. పేపర్ – 2కు 1,86, 423 మంది దరఖాస్తు చేసుకోగా.. వారిలో 82.58 మంది పరీక్షకు హాజరయ్యారు.

- Advertisement -

Also Read: నీట్ పేపర్ లీక్ విషయంలో కీలక నిర్ణయం

డీఎస్సీ ఉద్యోగాల భర్తీ సమయంలో టెట్ మార్కులకు 20 శాతం వెయిటేజీ ఉంటుంది. అలాగే ప్రభుత్వ ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం నిర్వహించే టీఆర్టీ రాయాలంటే టెట్ లో అర్హత సాధించి ఉండాలి. అందుకే బీఎడ్, డీఎడ్ పూర్తి చేసిన అభ్యర్థులు టెట్ పరీక్షలు రాయడానికి పెద్ద ఎత్తున పోటీ పడతారు. ఎన్నికలకు ముందు టెట్ పరీక్షను నిర్వహించిన ఏపీ అధికారులు టెట్ ఫలితాలను ఇంకా ప్రకటించలేదు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News