E-Paper
Advertisement

తెలంగాణ ఆర్టీసీలో డిజిటల్ సేవలు.. ప్రయాణికులు ఫోన్‌ ద్వారా టికెట్‌ తీసుకోవచ్చు, అదెలా సాధ్యం?

తెలంగాణ ఆర్టీసీలో డిజిటల్ సేవలు.. ప్రయాణికులు ఫోన్‌ ద్వారా టికెట్‌ తీసుకోవచ్చు, అదెలా సాధ్యం?
Advertisement

TSRTC Decision: డిజిటల్‌ సేవలను విస్తరించే దిశగా అడుగులు వేస్తోంది తెలంగాణ ఆర్టీసీ. తాజాగా మరో కొత్త విధానానికి శ్రీకారం చుట్టింది. ప్రయాణికులు బస్సు ఎక్కే ముందు టికెట్‌ కోసం కండక్టర్‌ గురించి చూడాల్సిన పని లేదు. ప్రయాణికులు స్వయంగా టికెట్‌ తీసుకునే వ్యవస్థను తీసుకురానుంది. అందుకోసం బస్సులో QR కోడ్‌ ఆధారిత సెల్ఫ్‌ టికెటింగ్‌ విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది.

 

తెలంగాణ ఆర్టీసీలో డిజిటల్ సేవలు

Advertisement

దేశంలోని రాష్ట్ర ప్రభుత్వాలు డిజిటల్ సేవలను విస్తరించే పనిలో నిమగ్నమయ్యారు. ఆ విధంగా అడుగులు వేస్తున్నారు. తాజాగా తెలంగాణ ఆర్టీసీ మరొక కీలక నిర్ణయం తీసుకుంది. నాన్‌ స్టాప్ బస్సు సర్వీసుల్లో సెల్ఫ్ టికెటింగ్ విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. బస్సు ఎక్కే ముందు కండక్టర్ కోసం చూడకుండా ప్రయాణికులు టికెట్ కొనుగోలు చేసేలా కొత్త విధానాన్ని తీసుకొచ్చింది. నాన్‌స్టాప్‌ బస్సుల్లో ప్రయాణం చేసేవారికి ఈ విధానం ఉపయోగపడనుంది. ప్రస్తుతం డ్రైవర్ వచ్చి ప్రయాణికులకు టికెట్లు ఇచ్చే పద్దతి ఉంది. అలాకాకుండా బస్సు ప్రవేశ ద్వారం వద్ద QR కోడ్‌ను ఆర్టీసీ ఏర్పాటు చేస్తే ప్రయాణికులు తమ స్మార్ట్‌ఫోన్‌తో స్కాన్ చేసి బుకింగ్‌ చేసుకోవచ్చు.

 

క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే చాలు

Advertisement

ప్రయాణికుడు ఎక్కడ బస్సు ఎక్కాలి? ఎక్కడ దిగాలి? అనే వివరాలను నమోదు చేసి ఆన్‌లైన్‌ చెల్లింపు పూర్తి చేస్తే వెంటనే మొబైల్‌లో డిజిటల్‌ టికెట్‌ వస్తుంది. ఆ టికెట్‌ డ్రైవర్‌కు చూపించి బస్సు ఎక్కవచ్చు. ప్రయోగాత్మకంగా స్మార్ట్ టికెట్ విధానాన్ని తొలుత నల్గొండ-హైదరాబాద్ మార్గంలో అమలు చేయాలని డిసైడ్ అయ్యింది ఆర్టీసీ. ప్రస్తుతం ఈ రూట్‌లో 45 వరకు డీలక్స్, నాన్‌స్టాప్ బస్సులు తిరుగుతున్నాయి. ఆ రూట్లో కొత్త పద్దతి సక్సెస్ అయితే సెప్టెంబర్ నుంచి అన్ని నాన్‌స్టాప్ రూట్లలో విస్తరించాలని భావిస్తున్నారు అధికారులు. కొత్త విధానం వల్ల ప్రయాణికులకు చిల్లర సమస్య తీరుతుంది. ట్రావెల్ సమయం ఆదా అవుతుంది. అదే సమయంలో టికెట్లు జారీ చేసే పని భారం డ్రైవర్లకు తగ్గుతుంది.

 

స్మార్ట్ ఫోన్‌ లేనివారి మాటేంటి?

స్మార్ట్‌ఫోన్‌లు లేనివారు పరిస్థితి ఏంటి? అన్నది పెద్ద ప్రశ్న. డిజిటల్ చెల్లింపులపై అవగాహన లేని ప్రయాణికులు డ్రైవర్ వద్ద టికెట్ కొనుగోలు చేయవచ్చు. సెల్ఫ్ టికెటింగ్ విధానం కోసం మీ సేవకు చెందిన మీ టికెట్‌తో ఆర్టీసీ ఒప్పందం కుదుర్చుకుంది. మీ టికెట్‌ యాప్‌ ద్వారా ఆర్టీసీ బస్సు టికెట్లకు పరిమితం కాలేదు. హైదరాబాద్‌ మెట్రోలో ప్రయాణించాలన్నా, ఆలయాలు, పార్కులు, మ్యూజియంలు, గోల్కొండ ఫోర్ట్‌ వంటి పర్యాటక ప్రాంతాలను సందర్శించాలన్నా ముందుగా ఆన్‌లైన్‌లో టికెట్లు బుక్ చేసుకోవచ్చు. అక్కడికి వెళ్లిన తర్వాత టికెట్‌ కౌంటర్ల వద్ద నిలబడాల్సిన అవసరం లేదు.

ALSO READ: నేపాల్లో హైదరాబాద్ యువతి మిస్సింగ్.. డీఆర్​డీవో మాజీ డైరెక్టర్​ సహా.. మరో 30 మంది సేఫ్!

Related News

2 లక్షల మందితో కాంగ్రెస్ భారీ బహిరంగ సభ.. ఎందుకో క్లారిటీ ఇచ్చిన మహేష్ కుమార్ గౌడ్!

నీ హీరోయిన్ల జాతకం మొత్తం బయటపెడతా.. కేటీఆర్ పై బల్మూరి వెంకట్ ఫైర్!

విదేశాల్లో చదవాలనుకునే బీసీ, ఈబీసీ విద్యార్థులకు భారీ గుడ్ న్యూస్.. వెంటనే అప్లై చేయండి?

33 జిల్లాల తెలంగాణలో టాలెంట్ ఉన్న క్రికెటర్లు లేరా.. ధరం గురువారెడ్డి ఫైర్!

హైదరాబాద్‌కు జగన్ మకాం..అక్రమాస్తుల కేసులో బిగ్ ట్విస్ట్, న్యాయస్థానం కీలక నిర్ణయం

మా సంకల్ప అదే.. యువతతోపాటు మహిళలను ప్రోత్సహించాలన్న సీఎం రేవంత్‌రెడ్డి

సరైన అభ్యర్థి ఎవరు? ఎమ్మెల్సీ టికెట్లపై బీజేపీ కసరత్తు

ప్రభుత్వ లెక్చరర్ల బాగోతంపై విద్యాశాఖలో ప్రకంపనలు.. మండిపడుతున్న ప్రజలు, చర్యలు తీసుకోవాలని డిమాండ్

Big Stories

Advertisement
×