Nepal Floods: నేపాల్ ప్రళయంలో హైదరాబాద్ కు చెందిన ఆచూకి గల్లతయ్యింది. పలు ప్రయత్నాలు చేసినా ఆమె కాంటాక్ట్ లోకి రాకపోవటంతో ఏం జరిగిందో అని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఎల్బీ నగర్ కు చెందిన సుహాసిని రెడ్డి ఆస్ట్రేలియాలో సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తోంది. ఈనెల 19న ఇంటికి వచ్చింది. ఈ ఆదివారం మానస సరోవర్ యాత్రకు బయల్దేరగా.. అకస్మిక వరదల పోటెత్తిన దగ్గర నుంచి ఆమె ఆచూకి మిస్ అయ్యింది.
ఆస్ట్రేలియాలో ఉండగానే సుహాసిని మానస సరోవరం టూర్ ప్లాన్ చేసుకుంది. ఆస్ట్రేలియాకు చెందిన స్నేహితురాలితో కలిసి 3 నెలల క్రితమే టికెట్లు బుక్ చేసింది. ఆమె ఫ్రెండ్ నేరుగా ఖాట్మాండుకు రాగా హైదరాబాద్ నుంచి సుహాసిని ట్రిప్ లో జాయిన్ అయ్యారు. ఆ తరువాత ఈ ఇద్దరితోపాటు మొత్తం 29 మంది టూర్స్ అండ్ ట్రావెల్స్ ద్వారా మానస సరోవర్ యాత్రకు బయల్దేరారు. నేపాల్ లో వరదలు బీభత్సం సృష్టించటం.. వేలాది మంది కొట్టుకుపోయిన నేపథ్యంలో మంగళవారం రాత్రి నుంచి సుహాసిని రెడ్డి కుటుంబ సభ్యులు ఆమెను కాంటాక్ట్ చేయటానికి ప్రయత్నిస్తున్నారు. అయితే, ఎన్నిసార్లు ఫోన్లు చేసినా ఆమె నుంచి ఎలాంటి జవాబు రాలేదు. దాంతో అసలేం జరిగిందో తెలియక ఆమె కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.
మరోవైపు మానస సరోవర్ యాత్రకు వెళ్లిన మరో 30 మంది క్షేమంగా ఉన్నారు. డీఆర్డీవో మాజీ ఛైర్మన్ సతీష్ రెడ్డి దంపతులతోపాటు మిగితావారు చిక్కడపల్లికి చెందిన ఎంఎస్ రామారావు మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇటీవల యాత్రకు బయల్దేరారు. నేపాల్ చేరుకుని అక్కడి నుంచి యాత్ర మొదలుపెట్టిన కొన్ని గంటలకే వరదలు వచ్చాయి. దాంతో సతీష్ రెడ్డి దంపతులతోపాటు మిగితా యాత్రికుల యోగక్షేమాలపై తీవ్ర ఆందోళన వ్యక్తమైంది. కాగా, తామందరం సురక్షితంగానే ఉన్నామని సతీష్ రెడ్డి వెల్లడించారు.
Also Read: కేటీఆర్‌కు అరుదైన గౌరవం.. ఓపీ జిందాల్ గ్లోబల్ యూనివర్సిటీ నుంచి ప్రత్యేక ఆహ్వానం!
ప్రళయం వచ్చిన ప్రాంతాన్ని తామందరం దాటిన కొన్ని గంటల తరువాత వరదలు వచ్చాయన్నారు. భారీ మంచుకొండ చరియ విరిగిపడి ఈ వరదలు వచ్చాయని.. దానికి ముందే ఆ ప్రాంతాన్ని దాటడంతో తామందరికీ ప్రాణాపాయం తప్పిందని పేర్కొన్నారు. ప్రస్తుతం టిబెట్ లోని సాగా అనే ప్రాంతంలో అందరం ఉన్నట్టు తెలియచేశారు. భారత్ కు తిరిగి వచ్చేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నట్టు పేర్కొన్నారు.
Also Read: రాఖీ పండుగ వేళ తెలంగాణ సర్కార్ బంపర్ ఆఫర్.. ఇక మహిళలకు పండగే?