E-Paper
Advertisement

రాయదుర్గంలో ఐకానిక్ యూనిటీ మాల్‌.. రెండు వేల కోట్లతో ట్విన్ టవర్స్, ఎన్ని ప్రత్యేకలో తెలుసా?

రాయదుర్గంలో ఐకానిక్ యూనిటీ మాల్‌.. రెండు వేల కోట్లతో ట్విన్ టవర్స్, ఎన్ని ప్రత్యేకలో తెలుసా?
Advertisement

Raidurg Unity Mall: హైదరాబాద్‌ సిటీలోని రాయదుర్గ్ ప్రాంతంలో యూనిటీ మాల్‌ నిర్మాణం చేపట్టనున్నారు. 6 ఎకరాల స్థలంలో ట్విన్‌ టవర్లు నిర్మాణం జరగనుంది. తెలంగాణలోని అన్ని జిల్లాల ఉత్పత్తులకు ఇక్కడ మార్కెట్‌ కల్పించనున్నారు. పీపీపీ విధానంలో నిర్మాణం జరుగుతున్న ఈ ప్రాజెక్టులో ప్రపంచస్థాయి సదుపాయాలు అందుబాటులోకి రానున్నాయి. ఈ మాల్ ప్రత్యేకలపై ఓ లుక్కేద్దాం.

 

రాయదుర్గంలో ఐకానిక్ యూనిటీ మాల్‌

Advertisement

హైదరాబాద్‌ హైటెక్ సిటీ ఐటీ కారిడార్‌లోని రాయదుర్గ్ ప్రాంతంలో యూనిటీ మాల్‌ నిర్మాణం జరగనుంది. కేంద్రం స్పెషల్‌ అసిస్టెన్స్‌ టు స్టేట్స్‌ ఫర్‌ క్యాపిటల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ పథకం కింద మంజూరైన నిధులతో ఈ ప్రాజెక్టు అభివృద్ధి చేస్త్తోంది ప్రభుత్వం. రాయదుర్గంలో టీజీ లిప్కోకు చెందిన 6.12 ఎకరాల భూమిని ఈ ప్రాజెక్టు కోసం బదలాయించింది ప్రభుత్వం. దాదాపు 27 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో రెండు భారీ ట్విన్‌ టవర్లు నిర్మించనుంది. అందుకోసం రూ.2,059.81 కోట్లు ఖర్చు అవుతుందిన ఓ అంచనా. దీనికి సంబంధించినట్టు ప్రణాళిక రెడీ చేశారు. ఈ ప్రాజెక్టుకు తెలంగాణ ట్రేడ్‌ ప్రమోషన్‌ కార్పొరేషన్‌ నోడల్‌ ఏజెన్సీగా వ్యవహరించనుంది. కేంద్ర వాణిజ్యశాఖ ఈ ప్రాజెక్టు కోసం రూ.202 కోట్లు మంజూరు చేసింది.

రెండు వేల కోట్లతో ట్విన్ టవర్స్ నిర్మాణం

తొలి విడతగా రూ.101 కోట్లు విడుదల చేసింది. రూ.60 కోట్లు జీహెచ్‌ఎంసీ భవన నిర్మాణ అనుమతుల ఫీజులకు చెల్లించారు. ఇప్పటివరకు రూ.83.24 కోట్లు ఖర్చు చేశారు. ధ్రువపత్రాలు సమర్పిస్తూ రెండో విడత రూ.101 కోట్లు విడుదల చేయాలని టీజీటీపీసీ కేంద్రాన్ని కోరింది. 2030 అక్టోబరు నాటికి ప్రాజెక్టు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ట్విన్ టవర్ నిర్మాణం దేనికి? తెలంగాణ వ్యాప్తంగా 33 జిల్లాలకు చెందిన ఉత్పత్తులతోపాటు ఇతర రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన వస్త్రాలు, హస్తకళలు, వ్యవసాయ ఉత్పత్తులను ఒకే వేదికపైకి తీసుకురావాలన్నది ప్రభుత్వ ఆలోచన. ఆయా ఉత్పత్తుల కోసం ప్రత్యేక స్థలం కేటాయించనుంది. యూనిటీ మాల్‌ నిర్మాణం పీపీపీ విధానంలో చేపడుతున్నారు.

Advertisement

 

అన్ని జిల్లాల ఉత్పత్తులకు ఒకే వేదిక

జేఎల్‌ఎల్‌ నేతృత్వంలో టెండర్ల ప్రక్రియ పూర్తి అయ్యింది. వంశీరామ్‌ బిల్డర్స్‌ అండ్‌ డెవలపర్స్‌-అపర్ణ ఇన్‌ఫ్రా ఉన్న కన్సార్టియం ప్రాజెక్టును దక్కించుకుంది. యూనిటీ మాల్‌ అండ్‌ స్పేసెస్‌ ఎల్‌ఎల్‌పీ పేరుతో జాయింట్‌ డెవలప్‌మెంట్‌ అగ్రిమెంట్‌ ప్రక్రియను చేపడుతున్నాయి. ఇందులో ప్రపంచస్థాయి ఎగ్జిబిషన్‌ గ్యాలరీలు, అంతర్జాతీయ సదస్సులకు మల్టీపర్పస్‌ కాన్ఫరెన్స్‌ హాళ్లు, కొనుగోలుదారులు, బిజినెస్‌ లాంజ్‌లు, ఫుడ్‌ కోర్టులు, ఆధునిక లాజిస్టిక్స్‌ వంటి సదుపాయాలు రానున్నాయి. జీఐ గుర్తింపు పొందిన తెలంగాణ ఉత్పత్తులకు దేశీయ-అంతర్జాతీయ మార్కెట్‌ను విస్తరించడంతోపాటు లాజిస్టిక్స్‌, ఫెసిలిటీ మేనేజ్‌మెంట్‌ వంటి రంగాల్లో ఉపాధి అవకాశాలు పెరగనున్నాయి. యూనిటీ మాల్‌.. వాణిజ్య సముదాయంగా కాకుండా గ్రామీణ ఉత్పత్తులను గ్లోబల్‌ మార్కెట్‌తో అనుసంధానించే వేదికగా మారనుంది.

ALSO READ: గుట్టుచప్పుడు కాకుండా.. ఇంట్లోనే అక్రమ గ్యాస్ రీఫిల్లింగ్ కలకలం

Related News

ఎల్‌నినో ఎఫెక్ట్ ఎండిపోయిన చెరువులు.. చేపపిల్లల పథకం ఉన్నట్టా లేనట్టా..?

ఆంధ్ర వ్యక్తులకు తెలంగాణ ఆలయ బోర్డులో చోటా.. సీఎం రేవంత్ పై కవిత ఫైర్!

గుట్టుచప్పుడు కాకుండా.. ఇంట్లోనే అక్రమ గ్యాస్ రీఫిల్లింగ్ కలకలం

మీరాలం చెరువు పనులపై సీఎం రేవంత్ ఆకస్మిత తనిఖీలు, అధికారులు పరుగో పరుగు

నేపాల్ వరదల్లో చిక్కుకున్న తెలంగాణ వాసులకు బిగ్ అలర్ట్!

ట్యాంక్​ బండ్‌లో దూకిన సూడాన్ దేశస్తుడు.. కానీ చివరికి..?

కూతురు మరణాన్ని తట్టుకోలేక తండ్రి ఆత్మహత్య!

Big Stories

Advertisement
×