Podarillu Today Episode august 28th :పెళ్లిళ్ల పేరయ్య కి మాధవ్ ఫోన్ చేసి రమ్మని పిలుస్తాడు. ఏంటి మాధవ ఎప్పుడు లేనిది నువ్వు ఫోన్ చేసి రమ్మని పిలిచావు ఏం కావాలి ఏం జరిగింది అని అడుగుతాడు అతను. అయితే పెళ్లి కావాలి పెళ్లికూతురు చూస్తారని అడగగానే.. మీ తమ్ముళ్ల కోసం అని పెళ్లిళ్లు పేరయ్య అంటాడు కాదు.. నా కోసమే నీ మాధవ అంటాడు.. నేను కచ్చితంగా నీకు ఒక సంబంధాన్ని చూస్తాను అని అతను వెళ్ళిపోతుండగా అతనికి ఒక ఫోన్ వస్తుంది. ఆ ఫోన్ లిఫ్ట్ చేసి రెండవ సంబంధం అని చెప్పగానే.. మాధవ్ అమ్మాయిని నాకు సెట్ చేయండి నేను చేసుకుంటాను అని అంటాడు.
కన్న ఒక అమ్మాయి నన్ను చూస్తుంది కదా ఆ అమ్మాయి దగ్గరికి నేను వెళ్లి మాట్లాడాలి నాకు ధైర్యం సరిపోట్లేదు అని మహాలక్ష్మితో అంటాడు. మహాలక్ష్మి ఎలాగైనా సరే ఆ అమ్మాయి ఎవరో తెలుసుకోవాలి పదా అని మహాలక్ష్మి కూడా బస్ స్టాప్ కి వస్తుంది. చక్రీకి ఈ విషయం తెలియడంతో చక్రి కూడా బస్ స్టాప్ కి వెళ్తాడు. షాప్ కి వెళ్తాడు అయితే కన్నా ని చూస్తున్న అమ్మాయిని చూసి చక్రి ఈ అమ్మాయిలు చాలా బాగున్నారు. వీళ్ళు నిజంగానే కన్నా అని ప్రేమిస్తున్నారా అని అనుకుంటాడు. అయితే మహాలక్ష్మి ఎవర్రా నిన్ను చూసిన అమ్మాయి వెళ్లి తనతో మాట్లాడి రా అని పంపిస్తుంది. కానీ కన్నా మాత్రం భయపడుతూనే అమ్మాయి దగ్గరికి వెళ్తాడు. అమ్మాయిలు చాలా బాగున్నారు కదా బీడింగ్ లవ్ చేశారంటే నాకు అనుమానంగా ఉంది అంటూ చక్రి అనడంతో మహా సీరియస్ అవుతుంది.
కన్నా ఒక అమ్మాయి తో మాట్లాడడానికి వెళ్తాడు అయితే ఆ అమ్మాయి మా ఫ్రెండ్ ప్రేమిస్తుంది. నేను కాదు అని చెప్పగానే అవునా తను ఎవరిని ప్రేమిస్తుంది. అసలు మీకేం కావాలి అని కన్నా అడుగుతాడు. మా ఫ్రెండు లవ్ చేస్తుంది అని చెప్పగానే తనని చూసి కన్నా కాస్త సిగ్గుపడతాడు. అయితే ఫ్రెండ్ ప్రేమించేది మిమ్మల్ని కాదు.. మీ అన్నయ్యని తను ప్రేమిస్తుంది అందుకే నెంబర్ కావాలని మిమ్మల్ని అడుగుదామని వచ్చాము అని చెప్పగానే కన్నా ఒక్కసారిగా షాక్ అవుతాడు.. మా అన్నయ్య అంటే ఎవరిని ప్రేమిస్తున్నారు. మీ అన్నయ్యకు కోపం ఎక్కువ కదా.. అందుకే మిమ్మల్ని నెంబర్ అడిగి మాట్లాడదామని అనుకుంటున్నాము అని చెప్పగానే కన్నా ఏంటి తను లవ్ చేసింది నన్ను కాదా అని షాక్ అవుతాడు.. అన్నయ్యని అడిగి నెంబర్ ఇస్తాను అని అక్కడి నుంచి వచ్చేస్తాడు కన్నా.
ఏంట్రా అమ్మాయి ప్రేమించింది నిన్ను కదా ఎందుకు మరి నిన్ను చూసింది అని చక్రి అడుగుతాడు. అవును ఆ అమ్మాయి నన్ను కాదంటే ప్రేమించింది అన్నయ్యని అని అనగానే చక్రి నన్ను ప్రేమించిందా నేను అంత నచ్చానా అంటూ తెగ సంబరపడిపోతూ సిగ్గుపడతాడు.. కానీ నిన్ను కాదంట కేశవ అన్నయ్యని అని చెప్పగానే.. చక్రి వాడు నచ్చడా..? ఆ బండోడు మొండోడు ఈ అమ్మాయికి ఎలా నచ్చాడు ఈ అమ్మాయి చూడడానికి చాలా బాగుంది కదా అని చెప్పగానే.. కన్నా ఏమో నాకేం తెలుసు అని అంటాడు. మరి వాడికి ఆల్రెడీ గర్ల్ ఫ్రెండ్ ఉంది కదరా.. ఇప్పుడు వాడిని ప్రేమిస్తే ఎలా అని చక్రి అంటాడు ఏమో అన్నయ్య నాకు కూడా తెలీదని కన్నా ఫీలవుతూ ఉంటాడు..
శైలు కేశవ ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటూ ఉండగా కన్నా అలాగే చక్రి అక్కడికి వెళ్తారు.. ఏమైంది ఎందుకు ? మీరిద్దరూ ఇలా సడన్గా వచ్చారు అని శైలు అడుగుతుంది. చక్రి వాళ్ళిద్దరి మధ్య ఎలాగైనా చిచ్చు పెట్టాలి అని అనుకుంటాడు. అయితే బస్ స్టాప్ లో ఒక అమ్మాయి నేను చూసి ప్రేమిస్తుంది. అంటరా ఆ నీ నెంబర్ ఇవ్వమని అడిగింది ఇవ్వమంటావా? అని శైలు ముందరే చక్రి అడగడంతో శైలు వాడికి గర్ల్ ఫ్రెండ్ అన్న సంగతి మీకు తెలియదా మీరు ఎందుకు అలా చెప్పారు అంటూ కోపంతో ఊగిపోతుంది.. ఇక వాళ్ళు ఎక్కడున్నారో తెలుసుకోవాలి అని అక్కడికి వెళుతుంది శైలు. ఆ తర్వాత శైలు వాళ్ళతో గొడవ పడగానే ప్రేమించింది కేశవాణి కాదు చక్రీని అని ఆ అమ్మాయి వాళ్ళు నిజం చెప్పేస్తారు.
మాధవ్ పెళ్లి సంబంధం చూడటానికి అని పెళ్లిళ్ల పేరయ్య ఇంటికి రావడంతో నారాయణ మళ్లీ ఎందుకు వచ్చావు.. ఎలాంటి సంబంధం తీసుకొచ్చావు నువ్వు తెచ్చావని ఇలానే ఉంటాయా అంటూ అతనితో అనడంతో నేను మాధవిని కలవాలి అని అతను లోపలికి వెళ్ళిపోతాడు.. వెనకాలే మహాలక్ష్మి రావడం చూసి నారాయణకు షాక్ తగులుతుంది. ఒక్కసారి ఇన్ని బీడీలు కలుస్తావా నేను వచ్చే టైంకి ఎప్పుడు ఇన్ని ఉండవు కదా మరి ఇవేలా వచ్చాయి అని అడుగుతుంది. ఇక లోపలికి వెళ్లిన బ్రోకర్ మాధవకు సంబంధం గురించి చెప్తాడు. ఆ అమ్మాయి మిమ్మల్ని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంది మీరు మళ్లీ ఆలోచించుకొని చెప్పండి అని అతను చెప్పగానే.. నాకు పెళ్లి ఇష్టమే చేసుకుంటాను అని మాధవ్ చెప్తాడు అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..