Hyper aadi: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ప్రకాశం జిల్లా, చీమకుర్తిలో సాధారణ రైతు కుటుంబంలో జన్మించి బీటెక్ పూర్తి చేసిన హైపర్ ఆది(Hyper aadi) కొంతకాలం సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పని చేశారు. ఉద్యోగం చేస్తూనే నటన మీద ఆసక్తి కలిగిన ఈయన షార్ట్ ఫిలిమ్స్ లో నటించడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత జబర్దస్త్ షోలో స్క్రిప్టు రైటర్ గా అవకాశం అందుకుని.. అదిరే అభి టీం ద్వారా నటుడిగా పరిచయమై.. ఆ తర్వాత తన అద్భుతమైన డైలాగులతో జబర్దస్త్ లో టీం లీడర్ గా ఎదిగాడు. జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ , ఎక్స్ట్రా జబర్దస్త్ వంటి కామెడీ షో లలో తనదైన కామెడీతో ప్రేక్షకులను అలరించిన ఈయన 2017లో ‘రారండోయ్ వేడుక చూద్దాం’ అనే సినిమా ద్వారా సినీ రంగంలోకి అడుగుపెట్టారు.
ఇకపోతే హైపర్ ఆది వయసు 36 సంవత్సరాలు దాటినా ఇంకా ఆయన వివాహం చేసుకోకపోవడంపై సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు వార్తలు వినిపిస్తూనే ఉంటాయి. ముఖ్యంగా షోలో ఆయనతో ఇంకో అమ్మాయిని కలిపి లవ్ ట్రాక్లు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు కానీ ఏవి వర్క్ అవుట్ కాలేదు. అయితే ఇప్పుడు సడన్గా హైపర్ ఆది వివాహం చేసుకోబోయే అమ్మాయి ఈమె అంటూ ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం. శ్రీదేవి డ్రామా కంపెనీ లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమోను తాజాగా విడుదల చేశారు. నవంబర్ 8వ తేదీన స్ట్రీమింగ్ అయ్యే ఈ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో ఆద్యంతం నవ్వులు పూయించింది.
ప్రోమోలో భాగంగా నూకరాజు షోలోకి అడుగుపెట్టి, ఇది నా పెళ్లి కార్డు.. నేను వివాహం చేసుకోబోతున్నాను అంటూ చెబుతాడు. దీనికి హైపర్ ఆది మాట్లాడుతూ.. నీకేమైనా పిచ్చా.. బానే ఉన్నావు కదా అని ఆది అడిగితే .. నేను బాగానే ఉన్నాను. పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను అంటూ నూకరాజు చెబుతాడు. ఇక వీడి పిచ్చి క్లియర్ చేయాలి అంటే వాడే రావాలి అంటూ ప్రదీప్ ఇంట్రడక్షన్ ఇచ్చారు. వీడు పెళ్లి చేసుకుంటానంటున్నాడు అని నూకరాజును చూపించి ఆది చెప్పగా.. ప్రదీప్ మాట్లాడుతూ మనమంతా సింగిల్స్ కదా మనం చెబితే వీడు వినడు. పెళ్లి చేసుకున్న జంటలను పిలుద్దాం అంటూ బుల్లితెర సెలబ్రిటీ జంటలను స్టేజ్ పైకి తీసుకొచ్చారు.
also read:ఒకేసారి 10మంది నామినేషన్ లోకి.. ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుండి వెళ్ళేది ఎవరంటే?
అయితే ప్రోమో నవ్వులతో సాగుతున్న సమయంలో సడన్గా స్టేజ్ పైకి ఒక అమ్మాయి రావడం, ఆది సిగ్గుపడడం ప్రోమోలో చూపించారు. స్టెప్ ఒకటే అయినప్పుడు ఏ సాంగ్ అయితే ఏంటి అని ప్రదీప్ అనగా.. ఆది మాట్లాడుతూ ఎలాగో ఫ్యూచర్లో నేర్పించాలి కదా అంటూ ఆ అమ్మాయే తను చేసుకోబోయే అమ్మాయి అన్నట్టుగా ఇన్ డైరెక్ట్ గా హింట్ ఇచ్చాడు ఆది. మొత్తానికైతే ఆది లవ్ లో పడ్డారా తెలుసుకోవాలంటే ఈ దీపావళికి మిస్ అవ్వకండి అంటూ లాస్ట్ లో ప్రోమో కట్ చేశారు. మరి నిజంగానే ఆది లవ్ లో పడ్డాడా? ఆమెను వివాహం చేసుకోబోతున్నాడా? లేక దీపావళికి వచ్చే ఈ ఎపిసోడ్ పై హైప్ పెంచడానికి నిర్వాహకులు ఇలా ట్రిక్ ఏదైనా ప్లే చేశారా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. మరి చూద్దాం దీపావళికి ప్రసారమయ్యే ఈ ఎపిసోడ్ లో అసలు విషయం బయటపడుతుందేమో.