BigTV English

Bhogireddy Trishna: ఓరీ దీని పాసుగాలా..? పెళ్లాడాలంటూ యాంకర్ ను కిడ్నాప్ చేయించిన లేడీ కిలాడీ

Bhogireddy Trishna: ఓరీ దీని పాసుగాలా..? పెళ్లాడాలంటూ యాంకర్ ను కిడ్నాప్ చేయించిన లేడీ కిలాడీ

Pranav TV Anchor Kidnap by a Lady: టీవీ ఛానల్ యాంకర్‌ను ఓ మహిళ కిడ్నాప్ చేయడం హైదరాబాద్‌లో సంచలనంగా మారింది. యాంకర్‌ను పెళ్లి చేసుకోవాలని భావించిన ఒ మహిళ కిడ్నాప్ చేసి రూమ్‌లో బంధించిందని సమాచారం. యాంకర్‌ని పెళ్లి చేసుకోవాలని కిడ్నాప్‌కు పాల్పడ్డ మహిళ పోలీసులకు చిక్కింది. దీంతో అసలు బండారం బయటపడింది.


పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఒక టీవీ ఛానల్‌లో యాంకర్‌గా పని చేస్తున్న ప్రణవ్‌ను త్రిష అనే యువతి తనను పెళ్లి చేసుకోవాలని కోరుతూ ప్రణవ్‌ను రూమ్‌లో బంధించింది. త్రిష చెర నుంచి ప్రణవ్ చాకచక్యంగా తప్పించుకుని పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు విచారణ జరపగా అసలు నిజాలు వెలుగులోకి వచ్చాయి.

త్రిష అనే యువతి డిజిటల్ మార్కెటింగ్ బిజినెస్‌ను నడుపుతోంది. భారత్ మాట్రిమోని వెబ్‌సైట్‌లో త్రిష ప్రణవ్ ఫోటోలు చూసి ఇష్టపడింది. పెళ్లి చేసుకుంటే ప్రణవ్‌నే చేసుకోవాలని త్రిష ఫిక్స్ అయింది.


Read More: ఢిల్లీ లిక్కర్ కేసులో కీలక పరిణామం.. కవితను నిందితురాలిగా చేర్చిన సీబీఐ..

ఇక్కడే మరో షాకింగ్ ట్విస్ట్ బయటపడింది. విషయం ఏమిటంటే నిజానికి యాంకర్ ప్రణవ్ ఆ ప్రొఫైల్ పెట్టలేదు. ప్రణవ్ పేరుతో మాట్రిమోని వెబ్‌సైట్‌లో కొందరు సైబర్ కేటుగాళ్లు నకిలీ ఐడీ క్రియేట్ చేశారు. ప్రణవ్ పేరుతో డబ్బు సంపాదించాలని స్కెచ్ వేశారు. ఇక నిజంగానే ప్రణవ్ ఐడీ అనుకోని ఇష్టపడ్డ త్రిష పెళ్లి చేసుకుంటే ప్రణవ్‌నే చేసుకోవాలని ఫిక్స్ అయింది. ఇక ప్రణవ్‌పై మనసు పడ్డ త్రిష కిడ్నాప్ చేసి పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయింది.

ఫిబ్రవరి 11న కొందరు రౌడీలకు సుపారీ ఇచ్చి ప్రణవ్ ను కిడ్నాప్ చేయించింది. అప్పటినుంచి తనను రూమ్‌లోనే బంధించింది. ఈ క్రమంలో ప్రణవ్ ఆమె అదుపు నుంచి తప్పించుకుని పోలీసులను ఆశ్రయించాడు.

దీంతో పోలీసులు రంగంలోకి దిగి త్రిషను అరెస్ట్ చేసి రిమాండ్‌కి తరలించారు. ఐదు స్టార్ట్ అప్ కంపెనీలకు ఎండీగా ఉన్న త్రిష కోట్లాది రూపాయలకు అధినేత్రి అని పోలీస్ విచారణలో తెలుస్తోంది. మొత్తానికి ప్రణవ్‌తో పెళ్లి దెబ్బకు కిడ్నాప్ కేసులో ఇరుక్కుని జైలుకెళ్లింది.

Tags

Related News

Weather News: కొన్ని గంటల్లో ఈ ఏరియాల్లో భారీ వర్షం.. ఇక రాత్రంతా దంచుడే

Nagarjunasagar flood: నాగార్జునసాగర్‌ గేట్లు ఎత్తివేత.. సందర్శకులకు బిగ్ అలర్ట్!

Hyderabad Rains: అమీర్‌పేట ముంపు ప్రాంతాల్లో సీఎం రేవంత్ పర్యటన.. అధికారులకు కీలక ఆదేశాలు

Malreddy Ranga Reddy: రంగారెడ్డి ఎమ్మెల్యే మల్‌రెడ్డి కుటుంబంలో రాఖీ పండుగ రోజే విషాదం

Rain News: భారీ వర్షం.. ఈ జిల్లాల్లో కుండపోత వాన.. ఇళ్ల నుంచి బయటకు రావొద్దు

Guvvala Balaraju: బీజేపీలో చేరిన గువ్వల.. కేటీఆర్‌పై హాట్ కామెంట్స్..

Big Stories

×