BigTV English

Bachupally Instagram Murder Case: హైదరాబాద్‌లో దారుణం.. యువకుడిని చంపి ఇన్‌స్టాలో రీల్స్ చేసిన నిందితులు

Bachupally Instagram Murder Case: హైదరాబాద్‌లో దారుణం.. యువకుడిని చంపి ఇన్‌స్టాలో రీల్స్ చేసిన నిందితులు
Bachupally Insta Murder News
Bachupally Insta Murder News

2 People Murdered a Person and Posted in Instagram: ఇన్‌స్టాలో హద్దులు లేకపోవడంతో.. యువత మరింత రెచ్చిపోతున్నారు. వ్యూస్‌ కోసం.. పనికి మాలిన పనులు చేసి.. అదెదో హీరోయిజంలాగా పోస్టులు పెడుతున్నారు. వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్‌ బాచుపల్లిలో ఇద్దరు యువకులు పేట్రేగిపోయారు. హైదరాబాద్‌ బాచుపల్లిలో తేజస్(26) అనే యువకుడిని 2024 ఏప్రిల్ 7న అర్ధరాత్రి సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు వెంటాడి వేటాడి మరీ దారణంగా హతమార్చి ఆ వీడియోను ఇన్‌స్టాలో పోస్టు చేశారు.


అంతటితో ఆగకుండా గొప్ప పనిచేశామని చెప్పుకుంటూ.. డాన్సులు చేస్తూ రెచ్చిపోయారు. బాచుపల్లి ప్రగతినగర్‌ చెరువు దగ్గర ఈ ఘటన చోటుచేసుకుంది. ఓ హత్య కేసులో నిందితుడిగా ఉన్న తేజాను మరో ఇద్దరు వ్యక్తులు అతి కిరాతకంగా.. తలపై బండరాల్లతో కొట్టి, 12 కత్తిపోట్లు పొడిచి అతడిని చంపేశారు. హత్య చేస్తున్న వీడియోనూ చిత్రీకరించి పోస్టు చేయడంతో ఆ వీడియో ఇప్పుడు సామాజికమాధ్యమాల్లో వైరలైంది.

Also Read: కవితకు చుక్కెదురు.. బెయిల్ తోసిపుచ్చిన కోర్టు, నెక్ట్స్ ఏంటి?


సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అనంతరం ఇన్ స్టాలో పెట్టిన రీల్స్ ఆధారంగా నిందితుల కోసం గాలిస్తున్నారు. పాత కక్షల వల్ల ఇంతటి దారుణానికి పాల్పడ్డారాని పోలీసులు అనుమానిస్తున్నారు.

Tags

Related News

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ ప్రాంతాల్లో కుండపోత వాన.. ఇంట్లోనే ఉండండి..

Bandi Sanjay: కేటీఆర్ కు ఉన్న అతి తెలివి నాకెక్కడ? – బండి సంజయ్

Hyderabad floods: హైదరాబాద్‌ ఇక మునగదు.. సీఎం రేవంత్ రెడ్డి అదిరి పోయే ప్లాన్ ఇదే!

Bandi Sanjay: వావి వరుసలు లేకుండా వారి ఫోన్లు ట్యాపింగ్ చేశారు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ 12 జిల్లాల్లో దంచుడే దంచుడు.. పిడుగులు కూడా..?

Weather Update: వర్షపాతాన్ని ఎలా కొలుస్తారు ? రెడ్, ఆరెంజ్, ఎల్లో అలెర్ట్‌కు అర్థం ఏంటి ?

Big Stories

×