BigTV English

Pawan Kalyan Unwell Again: పవన్ కల్యాణ్ కు మరోసారి అస్వస్థత.. ప్రచారానికి బ్రేక్..!

Pawan Kalyan Unwell Again: పవన్ కల్యాణ్ కు మరోసారి అస్వస్థత.. ప్రచారానికి బ్రేక్..!
Janasena Pawan Kalyan Health Update
Janasena Pawan Kalyan Health Update

Pawan Kalyan Health Update: జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరోసారి అస్వస్థతకు గురయ్యారు. దీంతో మరోసారి ఆయన ఎన్నికల ప్రచార కార్యక్రమాలు రద్దయ్యాయి. కొద్దిరోజుల క్రితం పిఠాపురంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన పవన్ కల్యాణ్ కు జ్వరం రావడంతో.. హైదరాబాద్ లో చికిత్స తీసుకుని రెస్ట్ తీసుకున్నారు. ఏప్రిల్ 5 నుంచి తిరిగి అనకాపల్లి నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభించారు.


ఏప్రిల్ 6, ఆదివారం గాజువాకలో నిర్వహించిన వారాహి విజయభేరి ప్రచార యాత్రలో పవన్ పాల్గొన్నారు. జనసేన అభ్యర్థి కొణతాల, ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ కు ఓటు వేసి గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రసంగం సమయంలోనే పవన్ స్వల్పంగా ఇబ్బందికి గురయ్యారు. సభ ముగిసిన అనంతరం పవన్ కల్యాణ్ నీరసపడినట్లు పార్టీ శ్రేణులు చెబుతున్నారు. దీంతో ఆయన హైదరాబాద్ కు తిరుగుపయనమయ్యారు. వైద్యుల సూచన మేరకు మరికొద్దిరోజుల పాటు పవన్ కల్యాణ్ రెస్ట్ తీసుకోనున్నారు.

Also Read: Pawankalyan Ugadi panchangam: పవన్‌కు రాజయోగం అద్భుతం, వీలుంటే అక్కడ కూడా..!


కాగా.. మే 13న ఏపీలో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఈ క్రమంలో ఏపీలో ఎన్నికల యుద్ధం తారాస్థాయికి చేరింది. ప్రధాన పార్టీల అభ్యర్థుల ఎంపిక, అలకలు, బుజ్జగింపులు పూర్తయి ఎన్నికల ప్రచారం పర్వం మొదలైంది. ఒకవైపు జగన్ బస్సుయాత్ర నిర్వహిస్తూ ప్రచారం చేస్తుండగా.. చంద్రబాబు ప్రజాగళం, పవన్ కల్యాణ్ వారాహి విజయభేరి యాత్రలు నిర్వహిస్తూ ప్రచారం చేస్తున్నారు. అధికార వైసీపీని గద్దె దించడమే లక్ష్యంగా టిడిపి – జనసేన – బీజేపీ కూటమి పోటీలోకి దిగాయి. ఇలాంటి సమయంలో పవన్ కల్యాణ్ అస్వస్థతకు గురవ్వడం పార్టీ శ్రేణులను ఆందోళనకు గురిచేస్తోంది.

Related News

Araku Coffee: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. అరకులో ఇకపై అందరూ లక్షాధికారులే!

Pawan Kalyan project: పవన్ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం.. కోట్లల్లో ఖర్చు.. ఎందుకంటే?

Railways: రైల్వే ప్రాజెక్టులపై దృష్టి.. అవన్నీ జరిగితే ఏపీకి తిరుగుండదు

Pulivendula Politics: పులివెందుల రాజకీయాలు.. 30 ఏళ్లలో రెండోసారి, ఓటర్లు ఫుల్‌ఖుషీ

Pawan Kalyan: రూటు మార్చిన పవన్.. నిన్న మామిడి.. నేడు చీరలు, రేపు?

AP Free Bus Scheme: ఏపీలో ఫ్రీ బస్ స్కీమ్.. ఆ బస్సు లెక్కితే ఉచిత ప్రయాణం ఉండదు

Big Stories

×