Japan : సీఎం రేవంత్‌రెడ్డి జపాన్ టూర్ గ్రాండ్ సక్సెస్. సుమారు లక్ష కోట్ల మేర తెలంగాణకు పెట్టుబడుల వేట కొనసాగింది. లాస్ట్ డే.. హిరోషిమాలో పర్యటించారు. అమెరికా చేసిన అణుబాంబు గాయం నుంచి ఆ నగరం రొమ్ము విరిచి నిలబడిన తీరును చూసి ఆశ్చర్యపోయారు. అక్కడే మరో ఆసక్తికర సంఘటన కూడా జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి మరుపురాని జ్ఞాపకాన్ని ఇచ్చింది.
రేవంత్ పొలిటికల్ స్టార్
రేవంత్ అంటే మాస్ లీడర్. రాజకీయాల్లో సూపర్ స్టార్. సినిమా హీరోలకే ఫ్యాన్స్ ఉంటారా? మాకుండరా? నేను పొలిటికల్ హీరోను.. నాకూ ఫ్యాన్స్ ఉంటారంటూ గతంలో ఓ జాతీయ మీడియా ఇంటర్వ్యూలో రేవంత్‌రెడ్డినే స్వయంగా చెప్పారు. ఆయన చెప్పింది అక్షరాలా నిజం అని చాటిచెప్పేలా.. జపాన్, హిరోషిమా నగరంలో ఓ ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్ జరిగింది. అదేంటంటే…
జపాన్‌లో రేవంత్ ఫ్యాన్స్
గుండెల్లో అభిమానం ఉండాలే గానీ.. అది ఏ రూపంలోనైనా బయటకు వచ్చేస్తుంది. అదే జరిగింది. ఇద్దరు స్కూల్ స్టూడెంట్స్. ఒకరు 7th క్లాస్ చదివే హరిణి, ఇంకొకరు 8th క్లాస్ చదువుతున్న హాసిని. అక్కాచెల్లిలు. హిరోషిమాలో ఉంటారు. పేరెంట్స్ అక్కడే సెటిల్ అయ్యారు. వాళ్లకు రేవంత్ అంటే ఎంతో అభిమానం. తెలంగాణ ముఖ్యమంత్రి తమ నగరానికి వస్తున్నారని తెలిసి.. ఆయన కోసం స్వయంగా ప్లకార్డ్స్ తయారు చేశారు ఆ చిన్నారులు.
హిరోషిమాలో రేవంత్‌కు సర్‌ప్రైజ్
‘మా ప్రియతమ తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులకు హిరోషిమా నగరానికి స్వాగతం’ అంటూ స్లోగన్ రాశారు. రేవంత్‌రెడ్డి ముఖచిత్రంతో పాటు చార్మినార్ ఫోటోను స్కెచ్ వేశారు. ఆ ఇద్దరు అమ్మాయిలు సీఎం రేవంత్‌రెడ్డిని కలిసి.. తాము వేసిన స్కెచెస్‌ను ఆయనకు అందించారు. జపాన్, హిరోషిమా నగరంలో ఉండే ఆ పిల్లలు తన మీద చూపించిన అభిమానానికి ఫిదా అయ్యారు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి. స్కెచెస్ చూసి మెచ్చుకున్నారు. వాళ్లతో కాసేపు ముచ్చటించారు. వాళ్ల స్టడీస్, ఫ్యామిలీ డీటైల్స్ గురించి అడిగి తెలుసుకున్నారు.
Also Read : హిరోషిమాలో సీఎం రేవంత్ ఏం చేశారంటే..
జపాన్‌లో జయ జయహే తెలంగాణ..
అంతేకాదు. హిరోషిమాలోని గాంధీ మెమోరియల్ ముందు నిలుచుని.. తెలంగాణ జాతీయ గీతం “జయ జయహే తెలంగాణ”ను గానం చేశారు హరిణి అండ్ హాసిని. జపాన్‌లో ఉంటూ.. స్వచ్ఛమైన తెలుగులో.. తెలంగాణ గీతాన్ని.. గొంతెత్తి పాడి.. శెభాష్ అనిపించారు.