BigTV English

CM Revanth Reddy: హిరోషిమాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. కలిసి పనిచేద్దామని సీఎం పిలుపు

CM Revanth Reddy: హిరోషిమాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. కలిసి పనిచేద్దామని సీఎం పిలుపు

CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి జపాన్ లో బిజీ బిజీగా పర్యటిస్తున్న విషయం తెలిసిందే. సీఎంతో పాటు పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి డి. శ్రీధర్ బాబు నేతృత్వంలోని తెలంగాణ అధికారుల బృందం జపాన్‌ లోని హిరోషిమా ప్రి ఫెక్చర్ ను సందర్శించింది. ఈ సందర్భంగా హిరోషిమా డిప్యూటీ గవర్నర్‌తో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబులు సమావేశమయ్యారు. రెండు రాష్ట్రాల మధ్య పరస్పర సహకారానికి ఉన్న అవకాశాలపై విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు.


హిరోషిమా ప్రభుత్వ ఆతిథ్యానికి సీఎం రేవంత్ రెడ్డి హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలిపారు. శాంతితో పాటు సాంకేతిక పురోగతిలో హిరోషిమా ప్రపంచంలోనే ప్రత్యేక గుర్తింపు సాధించిందని అన్నారు. తెలంగాణ రాష్ట్రం కూడా కొత్త ఆవిష్కరణలు, సుస్థిర విధానాలు, శాంతియుత వాతావరణానికి కట్టుబడి ఉందని అన్నారు. మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. తెలంగాణ, హిరోషిమా కలిసి పని చేయగలిగే రంగాలపై విస్తృతంగా చర్చలు జరిపాం అని అన్నారు.

Also Read: Civil Services Results: సివిల్స్-2024 ఫలితాలు వచ్చేశాయ్.. మెరిసిన తెలుగు ఆణిముత్యాలు..


వ్యర్థాల నుంచి ఇంధనం లాంటి క్లీన్ టెక్నాలజీ, మున్సిపాలిటీల్లో వ్యర్థాల ప్రాసెసింగ్, మురుగు నీటి శుద్ధి, పునరుత్పాదక విద్యుత్తు ప్రాజెక్టులు, అర్బన్ ఇన్నోవేషన్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, హైదరాబాద్ లో విపత్తుల నివారణ డిజైన్లు, భూగర్భ మెట్రో ఇంజనీరింగ్, స్మార్ట్ సిటీ సొల్యూషన్స్, పారిశ్రామిక సహకారం, ఎలక్ట్రిక్ వాహనాలు, ఎలక్ట్రానిక్స్, అధునాతన ఉత్పత్తుల తయారీకి హిరోషిమా-తెలంగాణ ఆటోమోటివ్ అండ్ మొబిలిటీ కారిడార్ ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనలను వారు ప్రస్తావించారు.

వీటితో పాటు విద్య, సాంస్కృతిక మార్పిడి కార్యక్రమాలు, హిరోషిమా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీతో తెలంగాణలోని ప్రముఖ విశ్వవిద్యాలయాల మధ్య సంబంధాలు, పరిశోధనలకు సహకారం, తెలంగాణ సంస్కృతి, శాంతి, పర్యాటకం, పీస్ పార్క్, సాంస్కృతిక ప్రదర్శనలు, బౌద్ధ వారసత్వానికి సహకరించాలని కోరారు.

Also Read: Jobs: ప్రముఖ బ్యాంక్‌ నుంచి భారీ నోటిఫికేషన్.. కేవలం ఒకేఒక్క ఇంటర్వ్యూతోనే జాబ్.. ఇంకా మూడు రోజులే గడువు

Related News

Bandi Sanjay: వావి వరుసలు లేకుండా వారి ఫోన్లు ట్యాపింగ్ చేశారు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ 12 జిల్లాల్లో దంచుడే దంచుడు.. పిడుగులు కూడా..?

Weather Update: వర్షపాతాన్ని ఎలా కొలుస్తారు ? రెడ్, ఆరెంజ్, ఎల్లో అలెర్ట్‌కు అర్థం ఏంటి ?

Sunil Kumar Ahuja Scam: వేల కోట్లు మింగేసి విదేశాలకు జంప్..! అహూజా అక్రమాల చిట్టా

Phone Tapping Case: ప్రూఫ్స్‌తో సహా.. ఉన్నదంతా బయటపెడ్తా.. సిట్ విచారణకు ముందు బండి షాకింగ్ కామెంట్స్

Hyderabad Drugs: హైదరాబాద్‌‌ డ్రగ్స్‌ ఉచ్చులో డాక్టర్లు.. 26 లక్షల విలువైన?

Big Stories

×