E-Paper
Advertisement

OTT Movies : ఓటీటీలోకి వచ్చిన బెస్ట్ థ్రిల్లర్ మూవీస్.. అస్సలు మిస్ అవ్వకండి..

OTT Movies : ఓటీటీలోకి వచ్చిన బెస్ట్ థ్రిల్లర్ మూవీస్.. అస్సలు మిస్ అవ్వకండి..
Advertisement

OTT Movies : డిజిటల్ ప్లాట్ఫార్మ్స్ లలోకి డిఫరెంట్ కంటెంట్ సినిమాలు రిలీజ్ అవుతూ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.. అందులో ఎక్కువగా థ్రిల్లర్ సినిమాలకు జనాలు ఆసక్తి కనబరుస్తున్నారు. ఇండస్ట్రీ ఏదైనా కూడా అలాంటి సినిమాలకు డిమాండ్ ఎక్కువగానే ఉంది.. ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ సంస్థ అయిన జీ5 లో ఇప్పటివరకు స్ట్రీమింగ్ అయిన బెస్ట్ థ్రిల్లర్ మూవీలు ఏవో ఒకసారి వివరంగా తెలుసుకుందాం..

కాఫిర్.. 

Advertisement

ఇదొక థ్రిల్లర్ వెబ్ సిరీస్. 2019లో ప్రముఖ ఓటి సంస్థ జీ 5 లో స్ట్రీమింగ్ కి వచ్చేసింది. దియా మీర్జా, మోహిత్ రైనా లీడ్ రోల్స్ లో నటించారు. కైనాజ్ అక్తర్ అనే ఓ పాకిస్థానీ మహిళను మిలిటెంట్ గా భావించి ఆమె ఇండియాలోని జైల్లో బంధిస్తారు. అయితే ఆమె ఎటువంటి బ్యాగ్రౌండ్ తో వచ్చింది. ఆమె జీవితం గురించి తెలుసుకొని ఆమెను ఎలాగైనా జైలు నుంచి బయటికి పంపించాలని ఓ జర్నలిస్టు ప్రయత్నాలు చేస్తాడు. చివరికి ఆమెను జైలు నుంచి బయటకు తీసుకొస్తాడా? ఆమె సొంత ఊరికి పంపిస్తాడా? అన్నది ఈ వెబ్ సిరీస్ స్టోరీ

విడుదల పార్ట్ 2.. 

Advertisement

తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలో నటించిన మూవీ విడుదల 2.. గతంలో వచ్చిన విడుదల మూవీకి ఈ మూవీ సీక్వల్ గా గత ఏడాది రిలీజ్ అయింది. పెరుమాల్ వాతియార్ అనే ఓ నక్సలైట్ జీవితం చుట్టూ తిరిగే స్టోరీ ఇది. ఓ టీచర్ ఉద్యమకారుడిగా ఎలా మారాడన్నది ఈ మూవీ స్టోరీ.. థియేటర్లలో ఈ మూవీ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. అదేవిధంగా ఓటీటీలో కూడా ప్రేక్షకులను అలరించింది. అందుకే బెస్ట్ మూవీగా నిలిచింది.

లాగౌట్..

ఈ మూవీ సైబర్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ.. ప్రముఖ నటుడు ఇర్ఫాన్ ఖాన్ తనయుడు బాబిల్ ఖాన్ నటించిన మూవీ ఇది. ఈ తరం యువతను సోషల్ మీడియా, మొబైల్ ఫోన్ ఓ వ్యసనంలా మారి ఎలా వేధిస్తోందో ఈ సినిమా స్టోరీగా కళ్లకు కట్టినట్లు చూపించారు. మొబైల్ ఫోన్ ని అతిగా వాడేవో యువకుడి ఫోన్ని తనను అభిమానించే వ్యక్తి కొట్టేసి ఆ తర్వాత అతని ఎలా బ్లాక్ మెయిల్ చేస్తాడు అన్నది ఈ మూవీ స్టోరీ. సినిమా రిలీజ్ అయిన మొదట్లో ఈ సినిమా మంచి టాక్ ను సొంతం చేసుకుంది.. జీ5 లో ఇప్పటికీ బెస్ట్ థ్రిల్లర్ మూవీలో ఇది కొనసాగుతుంది.

కింగ్‌స్టన్..

ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాశ్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ కింగ్ స్టన్..ఊరికి పట్టుకున్న శాపాన్ని తొలగించడానికి ఓ మత్స్యకారుడు సముద్రంలోకి వెళ్లి ఎలాంటి సాహసం చేస్తాడన్నది ఈ సినిమాలో చూడొచ్చు. ఈ మూవీ పైన ఇండియా మూవీగా రిలీజ్ అయింది తెలుగులో కూడా జీ5లో స్ట్రీమింగ్ అవుతుంది.

ఇవే కాదు దావీద్  అనే ఓ మలయాళ యాక్షన్ మూవీ ప్రేక్షకులను అలరించింది.. ఇది కూడా బెస్ట్ థ్రిల్లర్ ఫిలిం గా ప్రేక్షకులను అలరిస్తుంది. ఈ సినిమాలు అన్ని కూడా జీ5 లో బెస్ట్ థ్రిల్లర్ మూవీస్. మీకు నచ్చిన మూవీ ని మీరు చూసి ఎంజాయ్ చేయండి..

Tags

Related News

హైదరాబాద్ కుర్రాడికి కొరియన్ దెయ్యంతో లవ్… కితకితలు పెట్టే ఇండో-కొరియన్ థ్రిల్లర్

సోమరిపోతులే ఓటీటీలో సినిమాలు చూస్తారా? శివాజీ షాకింగ్ కామెంట్స్!

Friday OTT Releases : శుక్రవారం ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు.. ఏకంగా 14 స్ట్రీమింగ్…!

అడగకుండా సినిమా తీశారని హత్యలు… హారర్ క్లాసిక్స్ కి నవ్వుల ట్రీట్… ఓటీటీని షేక్ చేస్తున్న ఐకానిక్ పారడీ ఫిల్మ్

అధ్యక్షుడి కేక్ వెనుక దాగిన భయంకరమైన కుట్ర… ఆస్కార్ రేసులో నిలిచిన డార్క్ పొలిటికల్ కామెడీ డ్రామా

మన చుట్టూ జరిగే భయంకరమైన దారుణాలు… గజగజ వణికించే రియల్ లైఫ్ క్రైమ్ ఆంథాలజీ

కెరీర్ కాపాడుకోవడానికి ఫుట్‌బాల్ స్టార్ చేసిన పిచ్చి పని… ఓటీటీలో రచ్చ చేస్తున్న గ్లెన్ పావెల్ ఐకానిక్ కామెడీ స్పోర్ట్స్ డ్రామా

బిలియనీర్ల ప్రపంచంలో బుర్రపాడు పనులు… పార్ట్-1 సీట్ ఎడ్జ్ హిట్ తర్వాత వస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెల్

Big Stories

Advertisement
×