Saleshwaram Jathara: తెలంగాణ అమరనాథ్ యాత్రగా గుర్తింపు పొందింది సలేశ్వరం జాతర. శుక్రవారం నుంచి మూడు రోజులపాటు ఉత్సవాలు మొదలయ్యాయి. నల్లమల అభయారణ్యంలో ఈ క్షేత్రం కొలువై ఉంది. నల్లమల కొండల్లో కొలువైన లింగమయ్యను దర్శించుకునేందుకు భక్తులు పోటీ పడతారు. స్వామి వద్దకు వెళ్లాలంటే జరిగే పనికాదు.. దానికి స్వామి కరుణ ఉండాల్సిందే. యాత్ర కూడా కష్టంతో కూడిన పని కూడా.
జాతర స్పెషల్
నాగర్ కర్నూల్ జిలాల్లో సలేశ్వరం జాతర జరుగుతుంది. ప్రతీ ఏడాది చైత్ర పూర్ణిమ నుంచి స్వామికి ఉత్సవాలు నిర్వహిస్తారు. ఏప్రిల్ 11 నుంచి మూడు రోజుల పాటు నిర్వహించనున్న యాత్రకు అధికారులు ఏర్పాట్లు చేశారు. నాగర్ కర్నూలు జిల్లా నల్లమల అడవుల్లో సలేశ్వర క్షేత్రం ఉంది. శ్రీశైలం-హైదరాబాద్ రహదారి ద్వారా ఇక్కడికి చేరుకోవచ్చు.
ఎలా వెళ్లాలంటే
ప్రధాన రహదారి నుంచి 30 కిలోమీటర్ల లోపలకి వెళ్లాలి. అక్కడి నుంచి నాలుగైదు కిలోమీటర్లు కొండలు, గుట్టల మీదుగా నడవాల్సి ఉంటుంది. చెంచు గుడారాలు దాటుకుంటూ వెళ్లాలి. ఈ ప్రాంతం అంతా రాళ్లు, రప్పలతో ఉంటుంది. సళేశ్వరుడి కొలువు దీరిన ప్రాంతంలో నీటి దార ప్రవహిస్తుంది. చాలా ఎత్తైన ప్రాంతం నుంచి ఆ జలం వస్తుంది.
అందులో పుణ్యస్నానాలు ఆచరించిన తర్వాత లింగమయ్య స్వామిని దర్శించుకుంటారు భక్తులు. ఈ క్షేత్రానికి వచ్చినప్పుడు వస్తున్నాం.. లింగమయ్యో’ అంటూ నినాదాలు చేస్తారు భక్తులు. దర్శనం తర్వాత పోతున్నాం లింగమయ్యా అంటూ నినాదాలు చేస్తూ అడుగులు వేస్తారు.
ALSO READ: ఏప్రిల్ 12, 13 తేదీల్లో దివాలా చట్టాలపై జాతీయ సదస్సు
సలేశ్వరం లోయ సుమారం రెండు కిలో మీటర్ల పొడవు ఉంటుంది. ప్రకృతిలో గడపాలని అనుకునేవారు ఈ ప్రాంతం అంతగా నచ్చుతుంది. పురాతన కాలం నుంచి ఆలయంలో పూజారులుగా చెంచు పెద్ద మనుషులే వ్యవహరిస్తున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. కర్రల సాయంతో లోయలోకి నడుచుకుంటా వెళ్లాలి. కొండలు, గుట్టలు, లోయలు దాటుకుంటూ సాహస యాత్ర చేయాలి.
అధికారుల కీలక సూచనలు
మార్గమధ్యలో అనేక ఇబ్బందులు ఎదురవుతాయి. అప్పుడే లింగమయ్య దర్శనం లభిస్తుంది. ఈ జాతకు తెలంగాణ నుంచే కాకుండా ఇరుగు పొరుగు రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా తరలివస్తారు. ఈసారి అటవీ అధికారులు వచ్చే భక్తులకు కీలకమైన సూచనలు చేశారు. జాతరకు వచ్చే భక్తులకు అన్ని రకాలుగా ఏర్పాటు చేశారు. వందలాది సిబ్బందితో పాటు వాలంటీర్లను నియమించారు.
ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేకంగా చర్యలు తీసుకున్నారు. అనుకోని ఘటనలు ఏమైనా జరిగితే అత్యవసరంగా తరలించేందుకు ప్రత్యేక దారిని ఏర్పాటు చేశారు కూడా. వేసవికాలం నేపథ్యంలో ఆ ప్రాంతంలో అగ్ని ప్రమాదాలు సంభవించే అవకాశం ఉంది. అందుకే జాతర సమయంలో బీడీ, చుట్ట, సిగరేట్ కాల్చడాన్ని నిషేధించారు. ప్లాస్టిక్ తో పాటు మత్తు పదార్థాలు పూర్తిగా నిషేధం. నిబంధనలు ఎవరైనా ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు.