BigTV English

Siddhu Jonnalagadda: హిందీ ఆతా.? అంటే ఆ భయ్యా తోడా ప్యాజ్ దాలో, ఇంటర్వ్యూలో కూడా టైమింగ్ మిస్ అవ్వలేదు

Siddhu Jonnalagadda: హిందీ ఆతా.? అంటే ఆ భయ్యా తోడా ప్యాజ్ దాలో, ఇంటర్వ్యూలో కూడా టైమింగ్ మిస్ అవ్వలేదు

Siddhu Jonnalagadda:  టాలీవుడ్ స్టార్ బాయ్ సిద్దు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముందుగా కొన్ని సినిమాల్లో చిన్న చిన్న పాత్రలో కనిపించి ఆ తర్వాత తనలోని రైటర్ టాలెంట్ ని కూడా బయటికి తీసి మంచి గుర్తింపును సాధించుకున్నాడు. తన కెరియర్ లో ఎన్నో అద్భుతమైన సినిమాలు చేశాడు సిద్దు. సిద్దుకు మంచి పేరు తీసుకొచ్చిన సినిమా మాత్రం డిజె టిల్లు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన ఘనవిజయాన్ని సాధించింది. చిన్న తర్వాత టిల్లు స్క్వేర్ అనే సినిమాను చేశాడు సిద్దు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద దాదాపు 100 కోట్లకు పైగా వసూలు చేసింది. ఇక్కడితో సిద్దు రేంజ్ నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళిపోయింది అని చెప్పాలి.


సిద్దు ఆఫ్ స్క్రీన్ టైమింగ్

సిద్దు సినిమాలలో ఆన్ స్క్రీన్ టైమింగ్ మాత్రమే కాకుండా ఆఫ్ స్క్రీన్ లో కూడా తన టాలెంట్ కనిపిస్తూ ఉంటుంది. చాలా సందర్భాలలో సిద్దు టైమింగ్ విపరీతంగా ఆకట్టుకుంది అని చెప్పాలి. ఒక బాలకృష్ణ హోస్టుగా వ్యవహరించిన అన్ స్టాపబుల్ షోలో కూడా సిద్దు విపరీతంగా ఆకట్టుకున్నాడు. అయితే యంగ్ యాక్టర్ విశ్వక్సేన్ తో సిద్దుకు మంచి పరిచయం ఉంది. వీరిద్దరూ కలిసి అన్ స్టాపబుల్ షో కి హాజరయ్యారు. ఇక అక్కడితో వీరిద్దరి మధ్య స్నేహం మరికాస్త పెరిగింది. ఇక వీరిద్దరూ కూడా నందమూరి బాలకృష్ణ కి విపరీతమైన అభిమానులు అంతేకాకుండా ఎన్టీఆర్ కూడా వీరు అభిమానులే. అందుకనే వీళ్ళు సినిమాలకు సంబంధించిన ఫంక్షన్స్ కి ఎన్టీఆర్ హాజరవుతూ ఉంటారు.


దేవర ప్రొమోషనల్ ఇంటర్వ్యూ

ఇక తాజాగా వీరిద్దరూ కలిసి ఎన్టీఆర్ ను ఇంటర్వ్యూ చేశారు దేవర సినిమా రిలీజ్ కు రెడీగా ఉన్న తరుణంలో ప్రమోషన్స్ లో భాగంగా ఈ ఇంటర్వ్యూ చేశారు. దీనికి సంబంధించిన ప్రోమో ఇప్పుడు విడుదలైంది. ఇంటర్వ్యూలో కొరటాల శివ, ఎన్టీఆర్, విశ్వక్సేన్, సిద్దు జొన్నలగడ్డ హాజరయ్యారు. ఇంటర్వ్యూలో పలు రకాల అంశాలను చర్చించినట్లు తెలుస్తోంది. ఇక ఇంత బాగా మాట్లాడుతున్నారు మీరు ముంబైకి వెళ్లిపోవచ్చు కదా అంటూ ఎన్టీఆర్ ని అన్నారు యంగ్ హీరోస్. దానికి ప్రతిస్పందిస్తూ నీకు హిందీ వచ్చా అని అడిగాడు సిద్ధు ఎన్టీఆర్. దానికి సమాధానంగా “హిందీ ఆతా.? అంటే ఆ భయ్యా తోడా ప్యాజ్ దాలో” అని నిత్యం పానీపూరి బండి దగ్గర ఉపయోగించే డైలాగును పర్ఫెక్ట్ టైమింగ్ లో చెప్పుకొచ్చాడు సిద్దు. ప్రస్తుతం ఈ ప్రోమో వైరల్ గా మారింది.సెప్టెంబర్ 27న రిలీజ్ అవ్వతున్న ఈ సినిమా పైన మంచి అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా ఫలితం పైనే కొరటాల శివ కెరియర్ కూడా ఆధారపడి ఉంది అని చెప్పాలి. సినిమాకి అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన పాటలు అలానే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన వీడియో ఫుటేజ్ కూడా సినిమా మీద భారీ అంచనాలను పెంచింది.

Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×