BigTV English

Urban development Authority Plan: జిల్లాకో అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ, ఛైర్మన్లుగా నేతలకు ఛాన్స్!

Urban development Authority Plan: జిల్లాకో అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ,  ఛైర్మన్లుగా నేతలకు ఛాన్స్!

Urban development Authority Plan: రేవంత్ సర్కార్ పరిపాలనపై పూర్తిస్థాయిలో ఫోకస్ చేశారు. ఇప్పటి వరకు హైడ్రా, మూసీ పునరుజ్జీవనంపై ఫోకస్ చేశారు. ఇప్పుడు మిగతా జిల్లాలపై దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా జిల్లాకో అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించుకుంది. కసరత్తు జరుగుతోంది.. దీనికి సంబంధించి ఉత్తర్వులు త్వరలో రానున్నాయి.


అథారిటీలకు ఛైర్మన్లుగా పార్టీ నేతలు ఉండనున్నారు. వైస్ ఛైర్మన్లుగా జిల్లా కలెక్టర్లు వ్యవహరించనున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో హెచ్‌ఎండీఏ తో కలిపి 10 అథారిటీలున్నాయి. కొత్తగా రానున్న అథారిటీలు హైదరాబాద్, రంగారెడ్డి మినహా మిగతా జిల్లాలకు రానున్నట్లు సచివాలయ వర్గాలు చెబుతున్నమాట.

కాంగ్రెస్ సర్కార్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీపై ఫోకస్ చేయడానికి కారణాలు లేకపోలేదు. దేశంలో పట్టణీకరణ క్రమంగా పెరుగుతోంది. మరో ఆరేళ్ల నాటికి అర్బన్ జనాభా 50 శాతానికి పైగానే పెరుగుతోందని నిపుణుల అంచనా.


జనాభాకు అనుగుణంగా మౌళిక వసతులు పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తాగు నీరు, రోడ్డు, కరెంటు, డ్రైనేజీ పెంచాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వాలు కూడా వీటికి కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు.

ALSO READ:  బాచుపల్లి నారాయణ కాలేజీలో దారుణం.. ఇంటర్ విద్యార్ధిని ఆత్మహత్య

అథారిటీలను ఏర్పాటు చేస్తే పనులు మరింత వేగంగా జరుగుతాయన్నది ప్రభుత్వ ఆలోచన. అర్బన్  అథారిటీలకు ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు కేటాయించనుంది.. అధికారులను నియమించనుంది. అంతేకాదు వీటి కోసం కేంద్రం నుంచి నిధులూ రానున్నాయి.

ఇటీవల జరిగిన జీ 20 సదస్సు కోసం వివిధ రాష్ట్రాల్లో ఏర్పాటు చేసిన సదస్సులో పట్టణీకరణపై ప్రధానంగా ప్రస్తావించారు కూడా. పట్టణీకరణ పెరుగుతోందని, దానికి తగ్గట్టుగా ప్రభుత్వాలు మౌళిక సదుపాయాలు కల్పించాల్సిన అవసరాన్ని వక్కానించారు అధికారులు. గత ప్రబుత్వాలు అథారిటీలకు నిధులు కేటాయించిన సందర్భం లేదు. పేరుకే రాష్ట్రవ్యాప్తంగా పది వరకు అథారిటీలున్నాయి.

 

Related News

Hyderabad floods: హైదరాబాద్‌కు భారీ వర్షాల భయం పోతుందా? సీఎం రేవంత్ రెడ్డి కొత్త ప్రణాళిక ఇదే!

Bandi Sanjay: వావి వరుసలు లేకుండా వారి ఫోన్లు ట్యాపింగ్ చేశారు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ 12 జిల్లాల్లో దంచుడే దంచుడు.. పిడుగులు కూడా..?

Weather Update: వర్షపాతాన్ని ఎలా కొలుస్తారు ? రెడ్, ఆరెంజ్, ఎల్లో అలెర్ట్‌కు అర్థం ఏంటి ?

Sunil Kumar Ahuja Scam: వేల కోట్లు మింగేసి విదేశాలకు జంప్..! అహూజా అక్రమాల చిట్టా

Phone Tapping Case: ప్రూఫ్స్‌తో సహా.. ఉన్నదంతా బయటపెడ్తా.. సిట్ విచారణకు ముందు బండి షాకింగ్ కామెంట్స్

Big Stories

×