BigTV English

Inter Student Suicide: బాచుపల్లి నారాయణ కాలేజీలో దారుణం.. ఇంటర్ విద్యార్ధిని ఆత్మహత్య

Inter Student Suicide: బాచుపల్లి నారాయణ కాలేజీలో దారుణం.. ఇంటర్ విద్యార్ధిని ఆత్మహత్య

Inter Student Suicide: హైదరాబాద్ బాచుపల్లి నారాయణ కాలేజీలో ఓ విద్యార్థిని అనుమానస్పద మృతి కలకలం రేపుతోంది. అనూష అనే ఇంటర్ ఫస్టియర్ విద్యార్థిని దసరా సెలవుల తర్వాత నిన్ననే కాలేజీకి వచ్చింది. ఆమె తల్లిదండ్రులు కాలేజీలో దింపి హైదరాబాద్‌ దాటే లోపే విద్యార్థిని స్పృహ కోల్పోయిందన్న సమాచారం వచ్చింది. అనూష ఉరి వేసుకొని చనిపోయిందని కాలేజీ యాజమాన్యం తెలిపింది. తల్లిదండ్రులు వచ్చేసరికి ఆమె మృతదేహాన్ని గాంధీకి తరలించారు.


పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అనూష అనే విద్యార్ధిని బాచుపల్లి నారాయణ కాలేజీలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతుంది. దసరా సెలవులు అనంతరం అనూషను.. ఆమె తల్లి దండ్రులు ఆదివారం నాడు హాస్టల్‌లో వదిలిపెట్టి వెళ్లారు. వెళ్లిన కాసేపటికే విద్యార్దిని హాస్టల్ గదిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ తరుణంలో కాలేజీ యాజమాన్యం ఆమె తల్లిదండ్రులకు ఫోన్ చేసి.. విద్యార్ధిని స్పృహకోల్పోయిందని చెప్పారు. దీంతో ఇంకా సిటీ కూడా దాటని పేరంట్స్.. వెంటనే కాలేజీ దగ్గరకు చేరుకునే సరికి విద్యార్ధిని ఆత్మహత్య చేసుకుందని.. నారాయణ కాలేజీ యాజమాన్యం తెలిపింది. ఇంతలో అనూష తల్లి దండ్రులు కాలేజీకి వచ్చే సరికి..  ఆమెను కాలేజీ యాజమాన్యం గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Also Read: నేరాల తీరు మారుతోంది.. పోలీసులు అప్రమత్తంగా ఉండాలన్న సీఎం రేవంత్


ఈ నేపథ్యంలో నారాయణ కాలేజీ వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. విద్యార్ధిని బంధువులు కాలేజీ ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు. అనూష ఆత్మహత్య చేసుకున్న విషయం తమకు ముందే ఎందుకు చెప్పలేదని ఆందోళన వ్యక్తం చేశారు. అదే సమయంలో తాము అనూష డెడ్ బాడీని చూడక ముందే ఎందుకు ఆస్పత్రికి తరలించారని కాలేజీ యాజమాన్యాన్ని ప్రశ్నించారు. ఈ తరుణంలో కాలేజీ వద్ద ఆందోళనకు దిగారు. తమకు న్యాయం చేయాలను పోలీసులను కోరారు. అయితే పోలీసులు అక్కడున్న వారిని పంపించే ప్రయత్నం చేయగా.. వాగ్వాదం చోటుచేసుకుంది.

Related News

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ ప్రాంతాల్లో కుండపోత వాన.. ఇంట్లోనే ఉండండి..

Bandi Sanjay: కేటీఆర్ కు ఉన్న అతి తెలివి నాకెక్కడ? – బండి సంజయ్

Hyderabad floods: హైదరాబాద్‌ ఇక మునగదు.. సీఎం రేవంత్ రెడ్డి అదిరి పోయే ప్లాన్ ఇదే!

Bandi Sanjay: వావి వరుసలు లేకుండా వారి ఫోన్లు ట్యాపింగ్ చేశారు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ 12 జిల్లాల్లో దంచుడే దంచుడు.. పిడుగులు కూడా..?

Weather Update: వర్షపాతాన్ని ఎలా కొలుస్తారు ? రెడ్, ఆరెంజ్, ఎల్లో అలెర్ట్‌కు అర్థం ఏంటి ?

Big Stories

×