BigTV English
Advertisement

Shiva Balaji : నువ్వో యాక్టర్ వి.. బేసిక్స్ నేర్చుకో ముందు.. స్టేజ్‌ పైనే పరువు తీసిన శివ బాలాజీ..!

Shiva Balaji : నువ్వో యాక్టర్ వి.. బేసిక్స్ నేర్చుకో ముందు.. స్టేజ్‌ పైనే పరువు తీసిన శివ బాలాజీ..!

Siva Balaji..జబర్దస్త్ (Jabardast) కామెడీ షో ద్వారా తనకంటూ కమెడియన్ గా మంచి పేరు సొంతం చేసుకున్న రాకింగ్ రాకేష్ (Rocking Rakesh), తాజాగా నటుడిగా, నిర్మాతగా మారి తెరకెక్కిన చిత్రం కేసీఆర్ (KCR). గతేడాది ప్రారంభమైన ఈ సినిమా ఇప్పటికీ షూటింగ్ పూర్తి చేసుకుంది. బావ మరదళ్ల ప్రేమ కథతో తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి తాజాగా ట్రైలర్ ను విడుదల చేశారు చిత్ర బృందం. అయితే ఈ ట్రైలర్ ను ప్రముఖ యాంకర్ అనసూయ(Anasuya )లాంచ్ చేసి స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. ఈ ట్రైలర్ ఈవెంట్ లో భాగంగా పలువురు సెలబ్రిటీలు కూడా హాజరయ్యి వేడుకను సక్సెస్ చేశారు.


కేసీఆర్ ట్రైలర్ లాంచ్..

విలేజ్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈ చిత్రానికి డైరెక్టర్ గరుడవేగ అంజి (Garudavega anji)దర్శకత్వం వహించారు. కేశవ చంద్ర రమావత్ – షార్ట్ కట్ లో కేసీఆర్ అని చైల్డ్ యాక్టర్ ఆదిత్య (Adithya)చెబుతూ కనిపించారు. చోటా కేసీఆర్ అని ఒక ముసలమ్మ పిలవగానే, ఆ తర్వాత రాకింగ్ రాకేష్ (Rocking Rakesh)ను చూపించడం జరిగింది. బావమరదలు ప్రేమ కథకు ఎలాంటి అడ్డంకులు ఏర్పడ్డాయి..? ఊరి కోసం పల్లెని విడిచి కేసీఆర్ సిటీకి ఎందుకు వెళ్ళాడు..? అసలు వీరిద్దరి ప్రేమ పెళ్లి వరకు వెళ్లిందా? అనే విషయాలను చూడాలంటే సినిమా చూడాల్సిందే అంటూ ట్రైలర్లో తెలియజేశారు.


ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి ముఖ్యఅతిథిగా శివబాలాజీ..

ఇకపోతే ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి ముఖ్యఅతిథిగా వచ్చిన వారిలో శివబాలాజీ (Shiva Balaji) కూడా ఒకరు. చందమామ సినిమాతో మంచి పాపులారిటీ సంపాదించుకున్న శివ బాలాజీ , ఆ తర్వాత శంభో శివ శంభో, ఆర్య ఇలా ఎన్నో చిత్రాలలో నటించి మంచి పేరు దక్కించుకున్న బిగ్ బాస్ సీజన్ వన్ లో కూడా పాల్గొని ఊహించని క్రేజ్ అందుకున్నారని చెప్పవచ్చు. ఇకపోతే ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో పాల్గొన్న శివ బాలాజీ వేదికను అలంకరించి అనన్యతో మాట్లాడారు. హీరోయిన్ అనన్యతో మాట్లాడుతూ.. అనన్య ఇందులో మీరు చాలా బాగా నటించారు. ముఖ్యంగా కుక్కలందరూ ఇక్కడే ఉన్నారు అనే డైలాగ్ చెప్పారు కదా చాలా క్యూట్ గా వుంది. మీ వాయిస్ కి మేమంతా ఫిదా అయిపోయాము. దీనికి మీరే డబ్బింగ్ చెప్పారా అని అడగ్గా.. అవునని ఆమె తల ఊపింది. అయితే మధ్యలో రాకింగ్ రాకేష్ కలగజేసుకొని ఏదో మాట్లాడే ప్రయత్నం చేశారు.

మధ్యలో నీ ఓవరాక్షన్ ఏంటి..? రాకేష్ పై శివ బాలాజీ ఫైర్..

దీంతో శివ బాలాజీ మధ్యలో నీ ఓవరాక్షన్ ఏంటి..? ఒకరి గురించి మాట్లాడేటప్పుడు ఓవర్ కమ్ చేయకూడదు. ప్లీజ్ నేర్చుకో .. ఒక ఆర్టిస్ట్ కి ఉండాల్సిన బేసిక్ అది అంటూ స్టేజ్ పైనే పరువు తీశాడు శివ బాలాజీ. మొత్తానికి అయితే ఫన్నీగా రాకేష్ ను ఒక ఆట ఆడుకున్నాడు శివ బాలాజీ. ఇక ఈ సినిమా ఖచ్చితంగా సూపర్ హిట్ అవుతుందని, రాకేష్ ను హీరోగా అందరూ ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని శివ బాలాజీ తెలిపారు. మొత్తానికి అయితే రాకేష్ హీరోగా తన తాను ప్రూవ్ చేసుకునే సమయం వచ్చిందని నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు.

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×