BigTV English

Telangana Secretariat: తెలంగాణ సచివాలయంలో వాస్తు మార్పులు!

Telangana Secretariat: తెలంగాణ సచివాలయంలో వాస్తు మార్పులు!

Vasthu Changes for Secretariat: తెలంగాణ సచివాలయంలో వాస్తు మార్పులు చేస్తున్నారు. ఇప్పటివరకు సచివాలయ ప్రధాన ద్వారం నుంచి ముఖ్యమంత్రి కాన్వాయ్ లోపలికి వస్తున్నది. అయితే, ఇకపై వెస్ట్ గేట్ నుంచి లోపలికి వచ్చి, నార్త్ ఈస్ట్ గేట్ గుండా సీఎం కాన్వాయ్ బయటకు వెళ్లిపోనున్నది. సౌత్ ఈస్ట్ గేట్ ద్వారా ఐఏఎస్, ఐపీఎస్, ఉన్నతాధికారులు రాకపోకలు కొనసాగించనున్నారు. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన తరువాత మొదటిసారి వాస్తు మార్పులు చేస్తున్నారు. గతంలో సీఎం కార్యాలయంను ఆరో అంతస్తు నుంచి తొమ్మిదో అంతస్తుకు మార్చాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం తొమ్మిదో అంతస్తులో పనులు కొనసాగుతున్నాయి.


ఇదిలా ఉంటే, గడిచిన రెండుమూడు రోజులుగా కురిసిన వర్షాలు, వచ్చే మూడునాలుగు రోజుల్లో తెలంగాణ వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అంచనా వేయడంతో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సంబంధిత అధికారులతో మాట్లాడి అన్ని జిల్లాల కలెక్టర్లు, వ్యవసాయ అధికారులను అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇప్పటికే అన్ని జిల్లాలకు సరఫరా చేసినటువంటి పచ్చరొట్ట, ప్రత్తి విత్తనాల ప్యాకెట్లను రైతులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అందేలా చూడాలని ఆదేశాలు ఇవ్వవలసిందిగా ఆయన కోరారు.

అదేవిధంగా పలు ప్రాంతాల్లో పచ్చి రొట్ట విత్తనాలను ఎక్కువ మొత్తంలో కొనుగోలు చేసి పక్క రాష్ట్రాలకు తరలిస్తున్నట్లు ప్రభుత్వం దృష్టికి వచ్చిందని, మన రాష్ట్ర ప్రయోజనాలను పక్కనపెట్టి ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నవారిని గుర్తించి, కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా ఆయన అధికారులను ఆదేశించారు. అదేవిధంగా అనుమతి లేకుండా ప్రత్తి విత్తనాల ప్యాకెట్లు విక్రయిస్తున్నవారిపై కేసులు పెట్టినట్లు, బ్లాక్ మార్కెటింగ్ చేస్తున్నవారిపై కూడా కేసులు నమోదు చేశామని అధికారులు తెలియజేసినట్లు తెలుస్తోంది.


Also Read: మాజీ డీసీపీ రాధాకిషన్ రావుకు మధ్యంతర బెయిల్.. రేపు సాయంత్రం ?

ప్రత్తి విత్తనాలు అవసరంమేర అందుబాటులో ఉన్నాయని, రైతులు అధికృత డీలర్ల వద్దనే విత్తనాలను కొనుగోలు చేయాలని మంత్రి విజ్ఞప్తి చేశారు.

Related News

Hyderabad Rains: అమీర్‌పేట ముంపు ప్రాంతాల్లో సీఎం రేవంత్ పర్యటన.. అధికారులకు కీలక ఆదేశాలు

Malreddy Ranga Reddy: రంగారెడ్డి ఎమ్మెల్యే మల్‌రెడ్డి కుటుంబంలో రాఖీ పండుగ రోజే విషాదం

Rain News: భారీ వర్షం.. ఈ జిల్లాల్లో కుండపోత వాన.. ఇళ్ల నుంచి బయటకు రావొద్దు

Guvvala Balaraju: బీజేపీలో చేరిన గువ్వల.. కేటీఆర్‌పై హాట్ కామెంట్స్..

Mallareddy: మల్లారెడ్డి యూటర్న్.. రాజకీయాల్లో నో రిటైర్మెంట్

Telangana rains: మళ్ళీ ముంచెత్తనున్న వర్షాలు.. ఆగస్టు 14 నుండి 17 వరకు జాగ్రత్త!

Big Stories

×