E-Paper
Advertisement

Natural Star Nani: ఆగిన ఎల్లమ్మ.. మళ్లీ డైలమాలో బలగం వేణు.. ?

Natural Star Nani: ఆగిన ఎల్లమ్మ.. మళ్లీ డైలమాలో బలగం వేణు.. ?
Advertisement

Natural Star Nani: న్యాచురల్ స్టార్ నాని ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారాడు. సరిపోదా శనివారం సినిమా ఇప్పటికే సెట్స్ మీద ఉంది. ఇది కాకుండా బలగం వేణుతో ఎల్లమ్మ అనే సినిమాను నాని ఓకే చేసినట్లు వార్తలు వచ్చాయి. దిల్ రాజు ప్రొడక్షన్ లో ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుందని కూడా చెప్పుకొచ్చారు.

జబర్దస్త్ ద్వారా మంచి కమెడియన్ గా పేరు తెచ్చుకున్న వేణు.. చాలా కష్టాలు పడి బలగం సినిమాతో డైరెక్టర్ గా మారాడు. ప్రియదర్శి, కావ్య జంటగా తెరకెక్కిన ఈ సినిమాను దిల్ రాజు కూతురు హర్షిత నిర్మించింది. చిన్న సినిమాగా రిలీజ్ అయిన బలగం భారీ విజయాన్ని అందుకోవడమే కాకుండా ఎన్నో అవార్డులను కూడా అందుకుంది. అచ్చ తెలుగు పల్లెటూరు కథగా బలగం తెరకెక్కింది.

Advertisement

ఇక బలగం నచ్చిన నాని.. వేణుతో ఒక సినిమా చేయడానికి పూనుకున్నాడు. ఇక నాని హీరో అనగానే.. వేణు కూడా ఎంతో పట్టుదలగా కూర్చోని ఎల్లమ్మ కథను తయారుచేశాడు అంట. బేసిక్స్ తో ఒక లైన్ ను నానికి వినిపించడం.. అది నచ్చడంతో ఆయన కూడా ఓకే చెప్పి.. కథను ఫినిష్ చేసి చెప్పమని చెప్పాడట. ఇక తాజాగా ఫైనల్ డ్రాఫ్ట్ ను సిద్దం చేసిన వేణు.. నానికి పూర్తి కథను వినిపించడం జరిగిందట. అయితే నానికి లైన్ నచ్చినంత ఫైనల్ డ్రాఫ్ట్ నచ్చకపోవడంతో సినిమాను ఆపేయమని చెప్పిన్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్ గా మారింది.

నాని నో చెప్పడంతో వేణు పరిస్థితి మళ్లీ డైలమాలో పడింది. ఒక మంచి హిట్ పడ్డాకా.. ఏ డైరెక్టర్ కు అయినా మరో సినిమా హిట్ పాడడం అనేది ఎంతో ముఖ్యం. నానితో సినిమా అనేసరికి వేణుకు హైప్ వచ్చింది. ఇప్పుడు కథ నచ్చలేదు అని తెలిసేసరికి అతనిపై అంచనాలు తగ్గుతున్నాయి. మరి నాని రిజెక్ట్ చేసిన కథను ఏ హీరో ఓకే చేస్తాడో చూడాలి.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×