E-Paper
Advertisement

Vikarabad News: వామ్మో.. ఉన్నట్టుండి కారులో పొగలు.. తృటిలో తప్పించుకున్న ఓ కుటుంబం

Vikarabad News: వామ్మో.. ఉన్నట్టుండి కారులో పొగలు.. తృటిలో తప్పించుకున్న ఓ కుటుంబం
Advertisement

Vikarabad News: వికారాబాద్ జిల్లా యాలాల మండలంలోని పెను ప్రమాదం తప్పింది. లక్ష్మీనారాయణపురం పెట్రోల్ బంక్ సమీపంలోని.. తాండూర్ నుంచి కొడంగల్ వైపు వెళ్తున్న ఓ కారులో అకస్మాత్తుగా భారీగా పొగలు రావడంతో.. రహదారపై తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. కారు నుంచి రేడియేటర్, సైలెన్సర్ భాగాల నుంచి ఒక్కసారిగా పొగలు ఎడసిపడంతో ప్రయాణికులు తీవ్ర భయానికి లోనయ్యారు.

కిషోర్ అనే వ్యక్తి తన కుటుంబ సభ్యులు ఇద్దరితో కలిసి కారులో ప్రయాణిస్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పొగలు గమనించిన వెంటనే అప్రమత్తమైన వారు కారు నిలిపివేసి వెంటనే బయటకు దిగారు. కారు మెుత్తం పొగతో కమ్ముకోవడంతో కొద్దిసేపు రహదారి కనిపించని పరిస్థితి ఏర్పడింది. దీంతో అటువైపు వెళ్లే వాహనదారులు తమ వాహనాలను ఆపి పరిస్థితిని గమనిచడంతో రోడ్డుపై ట్రాఫిక్ నిలిచిపోయింది.

Advertisement

ఈ సంఘటన చూసిన స్థానికులు వెంటనే స్పందించి.. ప్రమాదం మరింత పెరగకుండా ముందుగా కార్ బ్యాటరీ కనెక్షన్‌ను తొలగించారు. దీంతో మంటలు చెలరేగే ప్రమాదం తప్పింది. కారు ఇంజెన్‌లో సాంకేతిక లోపం లేదా రేడియేటర్ సమస్య వల్లే పొగలు వచ్చినట్లు స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. కారులో ఉన్న ముగ్గురు సురక్షితంగా బయటపడటంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. పెట్రోల్ బంక్ సమీసంలోనే ఈ ప్రమాదం జరగడంతో పెద్ద ప్రమాదం జరిగి ఉండేదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాహనదారులు తమ వాహనాలను తరచూ తనిఖీ చేయించుకోవాలని, ముఖ్యంగా దీర్ఘ ప్రయాణాల ముందు ఇంజిన్, రేడియేటర్ వ్యవస్థలను జాగ్రత్తగా పరిశీలించాలని ఈ ప్రమాదం మరోసారి హెచ్చరికగా నిలిచింది.

Advertisement

ALSO READ: Hyderabad Crime: మూడేళ్ల చిన్నారి ప్రాణం తీసిన నిర్లక్ష్యం.. స్విమ్మింగ్‌ పూల్‌లో పడి..

Related News

హైదరాబాద్ సిటీవాసులకు బిగ్ అలర్ట్.. మంగళవారం వరకు ట్రాఫిక్ ఆంక్షలు, ఏయే ఏరియాల్లో

టెక్కీ మృతి కేసులో సంచలన విషయాలు.. అనుక్షణం వెంటాడిన ఆ భయం.. తట్టుకోలేక అర్ధరాత్రి వేళ..

విమాన రంగానికి కొత్త కష్టాలు.. విమానాలపై లేజర్ దాడులు, శంషాబాద్ ఎయిర్‌పోర్టు నాలుగో స్థానం

ORRపై ఘోర విషాదం.. భారీ వర్షం తెచ్చిన ప్రమాదం.. రెండు కార్లు నుజ్జునుజ్జు, ఇద్దరు మృతి

తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ అలర్ట్.. ఆ జిల్లాల్లో కుండపోత వర్షాలు.. ఐదు రోజులు ఇంతే!

Rajagopal Reddy: రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాల్సిందే.. జగ్గారెడ్డి డిమాండ్!

Ramchander Rao: హైదరాబాద్‌ను మజ్లిస్ నడిపిస్తోంది.. రాంచందర్ రావు సంచలనం!

Kharif Farming: పాలమూరు జిల్లాలో ఎల్‌నినో దెబ్బ.. భూమిలోనే కుళ్ళిపోయిన పత్తి విత్తనాలు!

Big Stories

Advertisement
×