Villagers Protest : వికారాబాద్ (Vikarabad) జిల్లాలో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఫార్మా కంపెనీ ఏర్పాటును వ్యతిరేకిస్తూ ఏకంగా జిల్లా కలెక్టర్ (District Collector) ప్రతీక్ జైన్ పైనే దాడులకు పాల్పడ్డారు జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన కొందరు రైతులు, గ్రామస్థులు. ప్రజాభిప్రాయం కోసం వచ్చిన కలెక్టర్, అధికారుల్ని గ్రామానికి రప్పించి మరీ.. కర్రలు, రాళ్లతో దాడులు చేయడంతో.. రాష్ట్రంవ్యాప్తంగా సంచలనంగా మారింది.
జిల్లాలోని దుద్యాల మండలం లగచర్ల గ్రామంలో ఫార్మా కంపెనీ (pharma Company) ఏర్పాటు కోసం భూసేకరణ(Land Acquisition) చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో.. గ్రామస్థుల అభిప్రాయాలు సేకరించేందుకు జిల్లా కలెక్టర్ ప్రతిక్ జైన్, కొడంగల్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (KUDA) ప్రత్యేకాధికారి వెంకట్‌రెడ్డి, అదనపు కలెక్టర్ లింగానాయక్, సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్ సహా.. ఇతర అధికారులు వచ్చారు. మొదట.. దుద్యాల శివారులో ప్రజాభిప్రాయ సేకరణకు ఏర్పాట్లు చేయగా.. గ్రామస్థులు, రైతులు అక్కడికి రాలేదు. వారంతా లగచర్లలోనే ఉండి.. వారి వద్దకే రావాలంటూ అధికారులు రావాలని ఓ మధ్యవర్తిని పంపించారు. అందుకు అంగీకరించిన కలెక్టర్, అధికారులతో కలిసి లగచర్లకు వెళ్లారు. వారంతా గ్రామానికి చేరుకోగానే కొందరు రైతులు, గ్రామస్థులు కలెక్టర్ కు, అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ.. వారిని చుట్టుముట్టి, వాగ్వివాదానికి దాగారు.
క్రమంగా పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. కర్రలో, రాళ్లతో దాడులకు ప్రయత్నించిన కొందరు రైతులు, గ్రామస్థులు.. మూడు వాహనాలు ధ్వంసం అధికారులపై దాడి చేశారు. ఈ క్రమంలోనే కలెక్టర్ వెనుకవైపు నుంచి వచ్చి ఓ మహిళ.. ప్రతీక్ జైన్ వీపుపై కొట్టింది. దాంతో.. అప్రమత్తమైన సిబ్బంది… ఆయనను అక్కడి నుంచి వాహనంలోకి తరలించి,అక్కడి నుంచి బయలుదేరారు. అయినా.. శాంతించని నిరసనకారులు… కారుపై రాళ్లు విసిరారు. అక్కడే ఉన్న అధికారులైపై దాడులకు పాల్పడ్డారు. ఈ దాడుల్లో కొడంగల్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ – కుడా(KUDA) ప్రత్యేకాధికారి వెంకట్ రెడ్డికి గాయాలయ్యాయి. అయినప్పటికీ.. వెనక్కితగ్గని నిరసనకారులు.. కొడుతుండడంతో, పొలాల వెంబడి పరుగెత్తి అక్కడి నుంచి తప్పించుకున్నారు.
కలెక్టర్ పై దాడి ఘటనతో గ్రామంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గ్రామంలో అదనపు బలగాలను మోహరించిన పోలీసులు.. దాడులకు పాల్పడిన వారిని గుర్తించే పనిలో పడ్డారు. ఏకంగా జిల్లా పాలనాధికారిపైనే దాడి జరగడంతో.. జిల్లా అధికారులు, ఉద్యోగులు తీవ్ర నిరసన తెలుపుతున్నారు. దాడులకు పాల్పడిన, ఉసిగొల్పిన వారిని గుర్తించి వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనకు నిరసనగా మంగళవారం నుంచి పెన్ డౌన్ చేస్తున్నట్లు ప్రకటించారు.
Also Read : CM Revanth Reddy: కేసిఆర్.. ఇక నీ దుకాణం బంద్.. ప్రజలెప్పుడో మరచిపోయారు.. సీఎం రేవంత్ రెడ్డి
వికారాబాద్ కలెక్టర్, అధికారులపై దాడి ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం కలిగించింది. మరోవైపు, కలెక్టర్, అదనపు కలెక్టర్, ఇతర రెవెన్యూ అధికారులపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలంగాణ ఉద్యోగుల జేఏసీ(JAC) ప్రకటించింది. ఈ విషయాన్ని డీజీపీ(DGP) దృష్టికి తీసుకెళ్లి దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరతామన్నారు. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా తగిన చర్యలు చేపట్టాలని కోరతామన్నారు.