BigTV English

CM Revanth Reddy: కేసిఆర్.. ఇక నీ దుకాణం బంద్.. ప్రజలెప్పుడో మరచిపోయారు.. సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy: కేసిఆర్.. ఇక నీ దుకాణం బంద్.. ప్రజలెప్పుడో మరచిపోయారు.. సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Fires on KCR: బడికి ఎగ్గొట్టే వారిని చూసే ఉంటాం మనం. కానీ తెలంగాణలో అసెంబ్లీకి ఎగ్గొట్టి ఇంటికి పరిమితమయ్యే వారిని చూస్తున్నాం. ఇదేనా ప్రజలు మీకు ఇచ్చిన భాధ్యత.. మీ పని అయిపోయింది.. తెలంగాణ సమాజం మొత్తం ఎప్పుడో మరిచిపోయిందంటూ.. మాజీ కేసీఆర్ ను ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి సెటైరికల్ కామెంట్స్ చేశారు.


ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయం ఆవరణంలో కొత్తగా ఎంపికైన అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లకు నియామక పత్రాలను అందజేసే కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్, రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్, పలువురు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నూతనంగా అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఉద్యోగాలకు నియమితులైన వారికి నియామక పత్రాలు అందజేసిన అనంతరం సీఎం మాట్లాడారు.

సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రాన్ని నిరుద్యోగ యువత, ఉద్యోగాలను సాధించుకోవాలన్న లక్ష్యంతో సాధించుకున్నారన్నారు. కానీ గత ప్రభుత్వం నిరుద్యోగులకు ఉద్యోగ కల్పన కల్పించే విషయంలో పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరించి, వారి గురించి ఆలోచించిన పరిస్థితి లేదన్నారు.


దీనితో తాను ఎన్నికల సమయంలో మిమ్మల్ని నమ్మించిన వారి ఉద్యోగాలు ఊడగొట్టండి.. మీకు ఉద్యోగాలు వస్తాయని హామీ ఇచ్చానని, అధికారంలోకి వచ్చిన మరుక్షణం 10 నెలల్లో 50 వేల ఉద్యోగాలు అందించినట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. గ్రూప్-1 పరీక్షను తెలంగాణలో 12 ఏళ్లుగా నిర్వహించలేదని, తమ ప్రభుత్వం వచ్చిన అనంతరం 563 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ప్రకటించి ఎన్ని కష్టాలు ఎదురైనా చిట్టచివరకు పరీక్షలను విజయవంతంగా నిర్వహించామన్నారు.

ఇక మాజీ సీఎం కేసీఆర్ లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి సెటైరికల్ కామెంట్స్ చేశారు. బడికి ఎగ్గొట్టే వారిని చూసి ఉంటామని, కానీ నేడు ప్రజలు ఇచ్చిన బాధ్యతను కూడా మరిచి అసెంబ్లీకి రాని వారిని తెలంగాణ రాష్ట్రంలో చూస్తున్నామన్నారు. అసెంబ్లీకి రావాలని తాము పదేపదే కోరాల్సిన పరిస్థితి ఏర్పడిందని, తెలంగాణ సమాజం గత పాలకులను ఎప్పుడో మరిచిపోయిందంటూ విమర్శించారు.

కొంతమంది దీపావళి పండుగ రోజు చిచ్చుబుడ్లకు బదులుగా, సారా బుడ్లతో దీపావళి పండుగను జరుపుకుంటున్నారని, ఇటువంటి వారిని సామాజిక బహిష్కరణ చేయాలన్నారు. కేసీఆర్ వాస్తు కోసం సచివాలయం, ప్రగతి భవన్ కట్టుకుండు కానీ.. రెసిడెన్షియల్ స్కూల్స్ ఒక్కటి కూడా నిర్మించలేదన్నారు. తెలంగాణ రాష్ట్రానికి ఇటువంటి వారు ఆదర్శమా అంటూ ప్రశ్నించారు.

Also Read: CM Revanth Reddy: ప్రభుత్వానికి మీరు రెండు కళ్లు.. దేశంలో ఉన్నవి ఆ రెండేనన్న సీఎం రేవంత్

తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణాలు అర్పించిన శ్రీకాంత్ ఆచారి ఇషాంత్ రెడ్డి వారిని ఆదర్శంగా తీసుకోవాలా లేదా అన్నది తెలంగాణ సమాజం ఆలోచించాలన్నారు. పక్క రాష్ట్రాల నుండి వస్తున్న గంజాయి రవాణాను అడ్డుకోవడంలో రవాణా శాఖ కీలకపాత్ర పోషించిందని, నూతన ఉద్యోగాలకు ఎంపికైన వారు తమ విధి నిర్వహణలో, మంచి పేరు ప్రఖ్యాతులు సాధించాలన్నారు.

Related News

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ 12 జిల్లాల్లో దంచుడే దంచుడు.. పిడుగులు కూడా..?

Weather Update: వర్షపాతాన్ని ఎలా కొలుస్తారు ? రెడ్, ఆరెంజ్, ఎల్లో అలెర్ట్‌కు అర్థం ఏంటి ?

Sunil Kumar Ahuja Scam: వేల కోట్లు మింగేసి విదేశాలకు జంప్..! అహూజా అక్రమాల చిట్టా

Phone Tapping Case: ప్రూఫ్స్‌తో సహా.. ఉన్నదంతా బయటపెడ్తా.. సిట్ విచారణకు ముందు బండి షాకింగ్ కామెంట్స్

Hyderabad Drugs: హైదరాబాద్‌‌ డ్రగ్స్‌ ఉచ్చులో డాక్టర్లు.. 26 లక్షల విలువైన?

Rain Alert: ఓర్నాయనో.. ఇంకా 3 రోజులు వానలే వానలు.. ఈ జిల్లాల్లో పిడుగుల పడే అవకాశం

Big Stories

×