BigTV English

Pushpa 2 : పాన్ ఇండియా హిట్ అవ్వాలంటే.. ఇంతలా కాపీ కొట్టాలా సుక్కు..

Pushpa 2 : పాన్ ఇండియా హిట్ అవ్వాలంటే.. ఇంతలా కాపీ కొట్టాలా సుక్కు..

Pushpa 2 : టాలీవుడ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న పుష్ప-2 కోసం ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. మొదటి భాగంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫర్ఫామెన్స్‌ తో తెలుగు ప్రేక్షకుల్ని ఆకట్టుకోవడంతో పాటుగా నేషనల్ వైడ్ గా టాక్ ను అందుకోవడంతో నేషనల్ అవార్డు ను కూడా అందుకున్నాడు. ఇక ఆ సినిమాకు సీక్వెల్ గా ఇన్నాళ్లకు పుష్ప 2 సినిమా రాబోతుంది. ఈ మూవీ పై అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో అందరికి తెలుసు. ఈ మూవీని డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో మేకర్స్ మూవీని ప్రమోట్ చేసే పనిలో పడ్డారు. ఈ క్రమంలో తాజాగా పుష్ప 2 పోస్టర్ ట్రోల్స్ మొదలయ్యాయి.. ఓ పాన్ ఇండియా సినిమాను కాపీ కొట్టినట్లు వార్తలు వినిపిస్తున్నాయి..


తాజాగా పుష్ప 2 సినిమా నుంచి ట్రైలర్ అప్డేట్ వచ్చేసింది. పుష్ప 2 సినిమా ట్రైలర్ ను నవంబర్ 17 న సాయంత్రం 6 గంటల 3 నిమిషాలకు రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు. ఈ ప్రకటనతో పాటు అల్లు అర్జున్ గన్ పట్టుకున్న స్టైలిష్ పోస్టర్ కూడా షేర్ చేసారు.. ఆ పోస్టర్ రిలీజ్ అయిన క్షణాల్లోనే వైరల్ గా మారింది. ఈ పోస్టర్ కు కేజీఎఫ్ పోస్టర్ ను జత చేస్తూ నెట్టింట అల్లు అర్జున్ యాంటి ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. పాన్ ఇండియా హిట్ కొట్టాలంటే పాన్ ఇండియా సినిమానే కాపీ కొట్టాల అని కామెంట్స్ చేస్తున్నారు. ఈ కామెంట్స్ పై పుష్ప 2 టీమ్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి..

ఇక ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడటంతో సినిమా నుంచి ఒక్కో అప్డేట్ ను మేకర్స్ రిలీజ్ చేస్తున్నారు. తాజాగా ఈ మూవీ నుంచి ట్రైలర్ ఇక ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ను బీహార్ లోని పాట్నాలో చేయబోతున్నట్టు ప్రకటించారు. దీంతో బన్నీ ఫ్యాన్స్ పుష్ప 2 ట్రైలర్ కోసం ఎదురుచూస్తున్నారు.. పాట్నాలో ఈ ట్రైలర్ లాంచ్ తర్వాత కలకత్తా, చెన్నయ్, కొచ్చి, బెంగళూరు, ముంబై, హైదరాబాద్ సిటీల్లో భారీ మాసివ్ ఈవెంట్స్ చేయడానికి ప్లాన్ చేశారు. ప్రజెంట్ షూటింగ్ చివరి దశలో ఉంది. మరో వైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మాలీవుడ్ స్టార్ ఫహాద్ ఫాజిల్, వెర్సటైల్ యాక్టర్ రావు రమేష్, కమెడియన్ నుంచి విలన్ రోల్స్ చేయడానికి షిఫ్ట్ అయిన సునీల్, అనసూయ భరద్వాజ్ తదితరులు నటిస్తున్నారు. ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్ గా . సాంగ్స్ అన్నీ ఆయన ఇచ్చారు. ఆయనతో పాటు తమన్ రీ రికార్డింగ్ చేస్తున్నారు.. డిసెంబర్ 5 న సినిమా ఎలా ఉంటుందో చూడాలి..


ఈ సినిమా బిజినెస్ డీటెయిల్స్ విషయానికొస్తే.. పుష్ప-2 సినిమా ఆరు భాషల్లో విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సిద్ధమవుతోంది. మొత్తం 11,500 స్క్రీన్స్‌లలో రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇందులో ఓవర్సీస్‌లో సుమారు 5000 వేల వరకు స్క్రీన్స్ ఉండగా.. మిగిలినవి ఇండియాలోనే రిలీజ్ చెయ్యనున్నారు..

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×